అడివి శేష్ 'డెకాయిట్' సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి మార్చి 28న రిలీజ్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డెకాయిట్ సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి మార్చి 28న రిలీజ్ కానుంది. ఇది అదిరిపోయే డాన్సింగ్ నెంబరు. ఈ పాట కోసం చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్లో అడివి శేష్ డాన్సింగ్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాయి.
ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.
సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘డెకాయిట్'’కి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ రగ్డ్ విజువల్స్‌ను అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తున్నారు. గ్యాని అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎమోషన్ మరింతగా పెంచనుంది.
ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్'’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.