Dacoit trailer launch - Q & A press meet
'డెకాయిట్' ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ లో సర్‌ప్రైజ్ అవుతారు: ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్
అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం 'డెకాయిట్”తో మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే, ఇది మరో ఇంటెన్స్, ఎమోషన్స్ కూడిన కథగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
“డెకాయిట్” కథ హరి, జూలియెట్ మధ్య ఉన్న ఇంటెన్స్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రశాంతమైన జీవితానికి కలలు కంటున్న ఈ జంట జీవితాన్ని, ఒక ద్రోహం పూర్తిగా మార్చేస్తుంది. హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ అతని పరారితో కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో జూలియెట్ తన అనారోగ్యంతో ఉన్న కుమార్తె ప్రాణాలను కాపాడటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో, హరి ప్రేమికుడి నుంచి సర్వైవర్‌గా మారి, జూలియెట్ అవసరాన్ని ఉపయోగించుకుంటూ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
దర్శకుడు షనిల్ డియో కథను చెప్పిన విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. గత జ్ఞాపకాలు, ప్రస్తుత సంఘటనలను కలిపి చూపించే తీరు ట్రైలర్‌లో ఆకట్టుకుంది. అడివి శేష్ కథా రచనలో కూడా భాగం కావడం వల్ల, ప్రేమ, ద్రోహం, సర్వైవల్ మధ్య జరిగే భావోద్వేగాల ఊగిసలాట చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.
మృణాల్ జూలియెట్ పాత్రలో ప్రేమికురాలిగా, తల్లిగా రెండింటినీ అద్భుతంగా నటించారు. అనురాగ్ కశ్యప్ కూల్, టెర్రిఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ కథకు మరింత టెన్షన్ తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ తన అనుభవంతో కథకు బలాన్ని ఇచ్చారు. అలాగే సునీల్, అతుల్ కులకర్ణి వంటి నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా చూసుకుంటే, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ సినిమాకు రా, స్టైలిష్ లుక్‌ను ఇచ్చింది. జ్ఞాని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచుతోంది. నిర్మాత సుప్రియా యార్లగడ్డ, కో-ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది.
ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ట్రైలర్‌కి తగ్గట్టే అడివి శేష్, షానీల్ డియో కలిసి ఒక హై వోల్టేజ్ సినీమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు.
ట్రైలర్ ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే నా లైఫ్ ఫిలాసఫీ. డెకాయిట్ ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ట్రైలర్‌లో వాటిని బయటపెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడనే అంశమే ఈ కథలో ప్రధానంగా ఉంటుంది. ఫీలింగ్స్‌పై ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం. ఈ సినిమా కథ లేయర్స్‌గా ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫీలింగ్స్ ఆధారంగా నడిచే సినిమా. డైరెక్టర్ షానీల్ గురించి చెప్పాలంటే, ఆయన చెప్పేటప్పుడు భోజ్‌పురి కల్చర్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అందుకే ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేయడానికి పవన్ సింగ్ ని తీసుకొచ్చాం. మృణాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. సినిమా మొదటి అరగంట తర్వాత ఏం జరుగుతుందో గెస్ చేయడం చాలా కష్టం. అబ్బూరి రవి గారు నాకు గురువులాంటి వారు. పంజా, క్షణం, మేజర్, గూడచారి, డెకాయిట్ గూడచారి 2దాదాపు అన్ని కలిసి పని చేశాం. ఆయన నాకు మంచి గైడ్. మహేష్ బాబు గారితో నాకు పర్సనల్ కనెక్షన్ ఉంది. హరి క్యారెక్టర్ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి ఆయనను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరంగల్, తిరుపతి సహా అనేక ప్రాంతాలు తిరిగాం. ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. పర్ఫెక్ట్ టైమ్‌లో సినిమా తీసుకువస్తున్నాం. ఇది యూనివర్సల్ కథ. చిన్నప్పుడు ఒక ఫంక్షన్‌లో డాన్స్ చేస్తుంటే “నువ్వు పొడుగ్గా ఉన్నావు, డాన్స్ చేయొద్దు” అన్నారు. అప్పటినుంచి నాకు డాన్స్‌పై భయం. కానీ తర్వాత క్రమంగా కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. ఈ సినిమాలో ఒక ఆర్గానిక్ డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది.. చాలా అందంగా వచ్చింది.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ…సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డెకాయిట్లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. సుప్రియ, శేష్ గారు, శానిల్ ఈ సినిమాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా నిలబడ్డారు. నేను 100% ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుంది.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్‌లో నేను ఇంతవరకు కనిపించలేదు. సుప్రియ గారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆమె ఒక డైనమిక్ ప్రొడ్యూసర్. ప్రతి ఛాలెంజ్‌ని స్వీకరిస్తారు.
డైరెక్టర్ శానిల్ మాట్లాడుతూ…ఈ సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. డెకాయిట్ ఒక మంచి లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్.
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ… ఈ కథకు అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చాం. మొదటి నుంచే గ్రాండ్‌గా తీయాలనుకున్నాం. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మహేష్ గారు ఎన్టీఆర్ గారు ట్రైలర్‌ని షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ.
సునీల్ మాట్లాడుతూ… శేష్ గారు చాలా జెన్యూన్‌గా సినిమా చేస్తారు. ఈ కథ, నా పాత్ర చాలా బాగున్నాయి. అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ టీమ్‌తో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.
డీఓపీ ధనుష్ భాస్కర్ మాట్లాడుతూ… పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్, శేష్ గారు నాకు చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. ఇది పూర్తిగా టీమ్ వర్క్‌తో చేసిన సినిమా.
డీఓపీ రవి కే చంద్రన్ మాట్లాడుతూ…ఈ టీమ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. థియేటర్‌లో చూడటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ… అడివి శేష్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ప్రతి డీటైల్‌ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది పూర్తిగా టీమ్ వర్క్. ఈ సినిమా ఒక లైఫ్‌టైమ్ మూవీ అవుతుంది. శేష్‌లో మంచి సినిమా చేయాలనే తపన ఉంది. ప్రతి ఐడియాని మరో స్థాయికి తీసుకెళ్లే ఆయన ప్రయత్నం అద్భుతం.