pizza

Nandamuri Balakrishna Resumes Shoot Of Gopichand Malineni, Venkata Satish Kilaru, Vriddhi Cinemas’ Epic Actioner Dada In Mysore
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

You are at idlebrain.com > news today >

06 October 2026
Hyderabad

God Of Masses Nandamuri Balakrishna and blockbuster maker Gopichand Malineni’s highly anticipated mass action entertainer Dada, produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, has already created strong buzz with immense response to the “Entry Of An Era” glimpse, followed by the subsequent title announcement video. The film presents Balakrishna in a rugged, stylish and intensely powerful avatar that has become a major talking point.

Meanwhile, Dada has resumed shooting today in Mysore. Balakrishna, who had suffered an injury, is back on the sets and has joined the team for this crucial and lengthy schedule.

The current schedule is focused on the talkie portions of the film, with Balakrishna and several other prominent actors participating in the shoot. The makers are planning to cover key sequences during this schedule, making it an important phase in the production of the movie.

Dada marks the reunion of Balakrishna and Gopichand Malineni after their successful outing Veera Simha Reddy. Gopichand Malineni is mounting this movie as a stylish commercial action spectacle, with Balakrishna presented in a high-impact mass avatar. The title glimpse introduced him as The King Of Chaos. The film features Manoj Manchu and Kajal Aggarwal in important roles.

A strong lineup of technicians are working on the film. Arvind S Kashyap is the cinematographer, with S Thaman composing the music. AS Prakash is handling production design and Navin Nooli is responsible for editing. Sai Madhav Burra has penned the dialogues, while Ram Lakshman, Ravi Varma and Vvenkat are choreographing the action sequences.

Dada is scheduled to arrive in theatres on December 24, making it a major Christmas attraction and a festive treat for audiences.

Cast: Nandamuri Balakrishna, Manoj Manchu, Kajal Aggarwal

Technical Crew:
Writer, Director: Gopichand Malineni
Producer: Venkata Satish Kilaru
Banner: Vriddhi Cinemas
Music: S Thaman
DOP: Arvind S Kashyap ISC
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram Lakshman, Ravi Varma and Vvenkat

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అనంతరం విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో బాలకృష్ణ రగ్గడ్, స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్, పాత్ర మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి

‘దాదా’ సినిమా షూటింగ్ నేటి నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో ఆయన చిత్రబృందంతో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి వస్తున్న సినిమా కావడంతో దాదాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ స్పెక్టకిల్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’గా బాలకృష్ణను పరిచయం చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

‘దాదా’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్

రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్. థమన్
డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ISC
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved