pizza

Vishwak Sen Launched Theatrical Trailer Of Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, Smt Chaitanya, PrimeShow Entertainment’s Darling
'డార్లింగ్‌' ట్రైలర్ చాలా హిలేరియస్ గా వుంది. సినిమా డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్

You are at idlebrain.com > news today >

07 July 2024
Hyderabad

Priyadarshi and Nabha Natesh starrer unique rom-com Darling directed by debutant Aswin Raam has generated significant enthusiasm with the hilarious teaser, followed by two super hit songs. The film produced by K Niranjan Reddy and Smt Chaitanya of PrimeShow Entertainment is due for release on the 19th of this month. Today, hero Vishwak Sen launched the film’s theatrical trailer.

It's the story of a young couple with different characterizations. The guy is very innocent and his only aim in life is to marry a nice girl and take her on a honeymoon in Paris. However, his dreams shatter with Anandi entering his life as a wife. She beats him every day, shattering all his dreams and making life hell. While many think she is possessed by an evil force, it is revealed that she has split personality disorder.

Although the makers disclosed the film’s storyline through the trailer, there still seem some twists in the tale. It’s a mature attempt from director Aswin Raam who penned strong characterizations to the lead pair. Priyadarshi is outstanding in the role of a typical youth with dreams about marriage, whereas Nabha’s character has different layers and the split personality disorder adds a new dimension to the character.

Ananya Nagalla appeared in a brief role. Brahmanandam made his presence felt in a single sequence. The trailer looks promising and pledges that the movie is going to be a Mad Max Marriage Entertainer.

The narrative was further enhanced by solid technical finesse. Naresh Ramadurai’s cinematography is praiseworthy for colorful visuals, while Vivek Sagar enhanced the mood with his wonderful score. The production standards of PrimeShow Entertainment are top-class. The dialogues penned by Hemanth are witty, while the editing by Pradeep E Ragav of Love Today is sharp. Gandhi is the production designer.

While the teaser created inquisitiveness, the trailer has now taken the expectations to another level.

Cast: Priyadarshi, Nabha Natesh, Brahmanandam, Vishnu, Krishna Tej, Ananya Nagalla, etc.

Technical Crew:
Writer - Director: Aswin Raam
Producers: K Niranjan Reddy, Smt Chaitanya
Banner: PrimeShow Entertainment
Music: Vivek Sagar
DOP: Naresh Ramadurai
Editor: Pradeep E Ragav
Dialogues: Hemanth
Production Designer: Gandhi
Publicity Designer: Ananth Kancharla
Creative Producer: SeethaRam Y
Lyrics: kasarla shyam
Choreographer: Vijay polaki, Eshwar Penti
Project Consultant: Sunny Bond
Costume Designer: Poornima Ramaswamy,
Executive Producers: Prakash Reddy Pannala, Vamshi Sangem
Line Producer: Manchi Venkat

'డార్లింగ్‌' ట్రైలర్ చాలా హిలేరియస్ గా వుంది. సినిమా డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన యూనిక్ రోమ్-కామ్ 'డార్లింగ్' హిలేరియస్ టీజర్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది, ఆ తర్వాత రెండు సూపర్ హిట్ పాటలు అలరించాయి. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈరోజుఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ గ్రాండ్ గా లాంచ్ చేశారు.

డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఓ యంగ్ కపుల్ స్టొరీ ఇది. హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది. ఆమెను దుష్టశక్తి ఆవహించిందని చాలామంది అనుకుంటుండగా, ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తేలుతుంది.

మేకర్స్ ట్రైలర్ ద్వారా సినిమా స్టొరీ లైన్ డిస్ క్లోజ్ చేసినప్పటికీ, కథలో కొన్ని మలుపులు ఉన్నాయి. లీడ్ పెయిర్‌కి బలమైన క్యారెక్టరైజేషన్స్ రాశాడు దర్శకుడు అశ్విన్ రామ్. పెళ్లి గురించి కలలు కనే యువకుడి పాత్రలో ప్రియదర్శి అత్యద్భుతంగా నటించారు, నభా పాత్రకు డిఫరెంట్ లేయర్స్ వున్నాయి. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ పాత్రకు కొత్త కోణాన్ని యాడ్ చేస్తోంది.

అనన్య నాగళ్ల ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించింది. ఒకే ఒక్క సీక్వెన్స్‌లో బ్రహ్మానందం తన ప్రజెన్స్ ని చాటుకున్నారు. ట్రైలర్ ప్రామెసింగ్ గా వుంది, సినిమా మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని హామీ ఇచ్చింది.

సాలిడ్ టెక్నికల్ వర్క్ నెరేటివ్ మరింత ఎలివేట్ అయ్యింది. నరేష్ రామదురై సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్ విజువల్స్‌ తో ఆకట్టుకుంది, వివేక్ సాగర్ తన అద్భుతమైన స్కోర్‌తో మూడ్‌ని మరింత ఎలివేట్ చేశారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ టాప్-క్లాస్. హేమంత్ రాసిన డైలాగ్స్ అలరించగా, లవ్ టుడే చిత్రానికి ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. గాంధీ ప్రొడక్షన్ డిజైన్ ఎక్స్ లెంట్. టీజర్ ఆసక్తిని రేకెత్తించగా, ట్రైలర్ ఇప్పుడు అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ నగరానికి ఏమైయింది టైమ్ లో నన్ను స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి అందరికీ సైకో వివేక్ గా పరిచయం చేసింది దర్శి. కళామాతల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. బలగం, మల్లేశం లాంటి సినిమాలు అందరికీ పడవు. రాసి పెట్టుండాలి. ఇప్పుడు తను 'డార్లింగ్' తో రావడం చాలా ఆనందంగా వుంది. తాను గెలిస్తే నేను గెలిచినట్లనిపిస్తది. డార్లింగ్ ట్రైలర్ చాలా ప్రామెసింగ్ గా వుంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. ట్రైలర్ హిలేరియస్ గా అనిపించింది. నభాని చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. తను యాక్సిడెంట్ నుంచి కోలుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తోంది. ఇది చాలా మందికి ఇన్స్ ప్రెషన్. డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది. అందరికీ థాంక్స్' అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ..విశ్వక్ ఈ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీగా వుంది. ఎపుడూ నాతో వుండే స్నేహితుడు తను. థాంక్ యూ డార్లింగ్. తను ట్రూలీ డార్లింగ్. మా టీం ఎంత గొప్ప వర్క్ చేశారో ఈ సినిమా ద్వారా మీకు తెలుస్తుంది. ఇలాంటి టీం స్నేహితులతో పని చేసినందుకు గర్వపడుతున్నాను. డైరెక్టర్ అశ్విన్ వలనే 'డార్లింగ్' గా మీముందు వున్నా. డార్లింగ్ అనగానే ప్రభాస్ అన్న పేరు వస్తుంది. జై ప్రభాస్ అన్న. అలాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా భయంభయంగా వుండే. అయితే కథని నమ్మి దానికి డార్లింగ్ టైటిల్ అనుకున్నాం. నిరంజన్ గారు, చైతన్య గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. నభా ఎక్స్ ట్రార్డినరీ గా యాక్ట్ చేసింది. వివేక్ సాగర్ సూపర్ మ్యూజిక్ అందించాడు. అందరూ అద్భుతంగా వర్క్ చేశారు. అందరికీ థాంక్స్.' అన్నారు,

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. థాంక్స్ విశ్వక్. ఈ నగరానికి ఏమైయింది నా ఫేవరట్ మూవీ. డార్లింగ్ మూవీ నాకు చాలా స్పెషల్. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు డార్లింగ్ కథ వచ్చింది. చాలా నచ్చింది. అశ్విన్ రాసిన క్యారెక్టర్ అద్భుతంగా వుంది. ఈ సినిమా కోసం వర్క్ షాప్ చేశాం. చాలా మంచి టీం వర్క్ చేశారు. నిర్మాతలు నిరంజన్ గారు, చైతన్య గారికి థాంక్ యు. హనుమాన్ సక్సెస్ డార్లింగ్ తో కంటిన్యూ అవుతుంది. చాలా పాషన్ తో సినిమా చేశారు. దర్శి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో మా కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంటుంది. ఇందులో డిఫరెంట్ దర్శిని చూస్తారు. డార్లింగ్ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. డార్లింగ్ మూడేళ్ళ జర్నీ. దర్శి గారు, నిరంజన్ గారు, చైతన్య గారికి కథ నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైయింది. ట్రైలర్ లో చూసినట్లుగా డార్లింగ్ చాలా ఫన్ ఫిలిం. నభా, దర్శి ఈ సినిమా యాక్టింగ్ వర్క్ షాప్ చేశారు. టీం అంతా నన్ను ఎంతగానో నమ్మారు. టీం అందరికీ థాంక్ యూ. నభా ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. దర్శి గారు నాకు ఒక బ్రదర్ లా వున్నారు. వివేక్ సాగర్ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. సినిమా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీం అందరికీ థాంక్స్. డార్లింగ్ ఫన్ రైడ్ ఎంటర్ టైనర్. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. డార్లింగ్ లో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ చూపించామో థియేటర్స్ కి వచ్చి ఆడియన్స్ చెప్పాలని కోరుకుంటున్నాం. ఇది చాలా మంచి ప్రోడక్ట్. కథని నమ్మి తీసిన సినిమా. కథ అవసరమైనది రాజీపడకుండా సమకూర్చడం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఎజెండా. అశ్విన్ కథ చెప్పినపుడు నిరంజన్ గారు నేను చాలా కనెక్ట్ అయ్యాం. అశ్విన్ చాలా అద్భతంగా తీశాడు. ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్స్. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ కథకి దర్శి కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదు. ఆయన అద్భుతమైన యాక్టర్. నభా తన పాత్రలో లీనమై పెర్ఫామ్ చేశారు. వివేక్ సాగర్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్స్. మంచి ప్రోడక్ట్ ని తీశాం. మీ అందరి సపోర్ట్ కావాలి' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన- దర్శకత్వం: అశ్విన్ రామ్
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ
డైలాగ్స్: హేమంత్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సీతారామ్ వై
లిరిక్స్: కాసర్ల శ్యామ్
కొరియోగ్రాఫర్: విజయ్ పోలాకి, ఈశ్వర్ పెంటి
ప్రాజెక్ట్ కన్సల్టెంట్: సన్నీ బాండ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ప్రకాష్ రెడ్డి పన్నాల, వంశీ సంగెం
లైన్ ప్రొడ్యూసర్: మంచి వెంకట్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved