`
pizza

Deekshith Shetty about Dasara
‘దసరా’ రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అద్భుతమైన ఎంటర్ టైనర్: దీక్షిత్ శెట్టి

You are at idlebrain.com > news today >
Follow Us

11 March 2023
Hyderabad

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యాయి. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న దీక్షిత్ శెట్టి విలేఖరుల సమావేశంలో ‘దసరా’ విశేషాలని పంచుకున్నారు.

దసరా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
‘మీట్ క్యూట్’ వెబ్ సిరిస్ లో చేశాను. ‘దసరా’లో ఈ పాత్రకి ఆడిషన్ జరిగినప్పుడు మీట్ క్యూట్ లో పని చేసిన కో డైరెక్టర్ వినయ్ ఈ పాత్రకి నన్ను రిఫర్ చేశారు. అక్కడి నుంచి జర్నీ మొదలైయింది. మీట్ క్యూట్ లో నేను చేసి వర్క్ నాని గారికీ నచ్చింది. దసరాలో పాత్ర చేయగలననే నమ్మకాన్ని ఇచ్చింది.

దసరా మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
ఇందులో నా పాత్ర పేరు సూరి. క్లోజ్ ఫ్రండ్ క్యారెక్టర్. సినిమా అంతా వుంటుంది. చాలా కీలకమైన పాత్ర. రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా దసరా. మంచి కంటెంట్ తో అన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి అద్భుతమైన ఎంటర్ టైనర్.

దసరా లాంటి పాన్ ఇండియా మూవీ లో భాగం కావడం ఎలా అనిపిస్తోంది ?
చాలా గొప్పగా, అనందంగా వుంది. ఈ సినిమా రావడమే ఒక సక్సెస్ గా భావిస్తున్నాను. ఒక సినిమాలో పని చూసి మరో మూడు సినిమాల్లో అవకాశం రావడమే అసలైన విజయమని మీట్ క్యూట్ ప్రెస్ మీట్ లో చెప్పాను. నా వరకూ దసరా ఆల్రెడీ ఒక పెద్ద విజయం.

మీకు ఏ జోనర్స్ ఇష్టం ?
అన్నీ జోనర్స్ ఇష్టమే, కానీ చేసిన జోనర్ ని మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం వుండదు. ప్రతి సారి ఎదో కొత్తగా చేయాలి, ఎదో కొత్తగా నేర్చుకోవాలి.

దసరా నుంచి ఏం నేర్చుకున్నారు ?
దసరాలో తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, నడవడిక ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ ప్రాసస్ ని చాలా ఎంజాయ్ చేశాను.

ఈ పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ?
దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దగ్గర ఒక స్ట్రక్చర్ వుంది. తనకి ఎలా కావాలో ఫుల్ క్లారిటీ వుంది. ఆయన అనుకున్న పాత్రని ఆయన కోరుకున్నట్లు చేయడం పట్లే ద్రుష్టి పెట్టాను.

నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
నాని గారితో దాదాపు పది నెలల పాటు ప్రయాణించాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని గారు ఆల్రెడీ నేచురల్ స్టార్. చాలా సహజంగా ఫెర్ ఫార్మ్ చేస్తారు. ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలవడానికి కూడా ఒక కారణం వుంది. చాలా క్రమశిక్షణ గల స్టార్ అయన. ఒక్క రోజు కూడా సెట్ కి ఆలస్యం గా రాలేదు. చెప్పిన సమయానికి పది నిమిషాలు ముందే వుంటారు. సినిమా అంటే గొప్ప ప్యాషన్. నాని గారి నుంచి చాలా స్ఫూర్తి పొందాను.

కీర్తి సురేష్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
కీర్తి సురేష్ గారిని మహానటి సినిమాలో చుశాను. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అనుకోలేదు. కీర్తి సురేష్ గారితో కలసి పని చేయడం మంచి అనుభవం.

దర్శకుడు శ్రీకాంత్ ఒదెల గురించి చెప్పండి ?
శ్రీకాంత్ ఒదెల మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తను అనుకున్నది వచ్చే వరకూ ఎక్కడా రాజీ పడరు. చాలా క్లారిటీ విజన్ వున్న దర్శకుడు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించిది.

దసరా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కదా ? ఎలా అనిపించింది ?
దసరా పాటలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. దీనికి కారణం సంతోష్ నారాయణ్, దర్శకుడు శ్రీకాంత్. ప్రతి సాంగ్ ఇలా వుండాలని ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు.

సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?
ఒక బడ్డింగ్ యాక్టర్ ని కన్నడ నుంచి తీసుకొచ్చి ఇలాంటి కీలకమైన పాత్ర ఇవ్వాలంటే టీం పై ఎంతో నమ్మకం వుండాలి. ఈ పాత్రని నేను చేయగలని బలంగా నమ్మిన నిర్మాతలకు రుణపడివుంటాను.

దసరా కన్నడలో కూడా విడుదలౌతుంది కదా.. అక్కడ బజ్ ఎలా వుంది ?
‘దసరా’ సినిమా కోసం కన్నడ ప్రేక్షకులు చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఇంకా ఎక్సయిటెడ్ గా వుంది. ఇప్పుడు సినిమాకి భాషతో అడ్డంకులు లేవు. కేజీఎఫ్ పుష్ప ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలని ఇండియన్ సినిమాగా సెలబ్రేట్ చెసుకుంటున్నాం. దసరా పై కూడా కన్నడ లోచాలా క్రేజ్ వుంది. నా విషయానికి వస్తే దియా తర్వాత థియేటర్ రిలీజ్ అవుతున్న సినిమా దసరా కావడం చాలా ఆనందంగా వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved