Harshith Reddy's Deewana Teaser out now; Geetha Film Distributors releasing the film this summer
హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ టీజర్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ విడుదలకు వస్తున్న సినిమా
In Deewana, Harshith Reddy plays the lead role, while Smeha Manimegalai is being introduced to Telugu audiences as the heroine. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of Arha Media and V Studios. Director Sreekanth Sangishetty is crafting the film as a beautiful love story. Deewana is gearing up for a grand theatrical release this summer.
The teaser of Deewana was released today. Watching the teaser gives the feel of a Mani Ratnam-style romantic film. From what the teaser shows, the hero falls in love with the heroine at first sight after seeing her at a wedding celebration. From that moment, she becomes his entire world. Even though his friends warn him that getting involved with her family could be dangerous, he refuses to listen. Whether the girl reciprocates his intense love or not is something audiences will have to discover in theaters.
The background music of the song “Prema Idi Prema Gundellona Sadirepede Prema...” in the teaser is heart-touching. Towards the end of the teaser, a dialogue that says, “The more beautiful they are, the more these girls make you suffer,” creates intrigue. Overall, the teaser suggests that Deewana will present an intense and beautiful musical love story.
The teaser has created a strong impact. Even after it ends, the song continues to linger in the mind. The visuals look very realistic and beautiful. The lead pair appears fresh on screen, and the new heroine Smeha Manimegalai looks beautiful and impressive.
Cast
Harshith Reddy, Smeha Manimegalai
Technical Team
Costumes: Manasa
Production Designer: Jhansi Gojala
Editor: Hrishikesh Paspal
Director of Photography: Vamsi Patchipulusu
Music: Eswar Chand
Digital Marketing: House Full
Producers: Vasudev Koppineni, Sridevi Karyampudi
Story, Screenplay, Direction: Sreekanth Sangishetty
హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ టీజర్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ విడుదలకు వస్తున్న సినిమా
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు "దీవాన" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్ కలుగుతోంది. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే - ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్ ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి తరుపు వాళ్లతో ప్రమాదమని స్నేహితులు చెప్పినా వినిపించుకోడు. ఇంతే ప్రేమ అమ్మాయి నుంచి కూడా ఈ అబ్బాయికి దక్కిందా లేదా అనేది థియేటర్స్ చూడాలి. టీజర్ లోని 'ప్రేమ ఇది ప్రేమ గుండెల్లోన సడిరేపేదే ప్రేమ...' సాంగ్ బీజీఎం హార్ట్ టచింగ్ గా ఉంది. టీజర్ చివరలో 'ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు, అది నీ పానం పీక్కతినకపోతే నన్ను అడుగురా..' అనే డైలాగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. "దీవాన" సినిమాలో ఒక ఇంటెన్స్ బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ చూడబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. టీజర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. టీజర్ పూర్తయ్యాక కూడా పాట ఇంకా మదిలోనే తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. విజువల్స్ చాలా రియలెస్టిక్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ జంట ఫ్రెష్ గా కనిపిస్తోంది. కొత్త హీరోయిన్ స్మేహ మణిమేగలై బ్యూటిఫుల్ గా కనిపించి ఆకట్టుకుంది.
నటీనటులు - హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ - మానస
ప్రొడక్షన్ డిజైనర్ - ఝాన్సీ గోజల
ఎడిటర్ - హృషికేశ్ పాస్పల్
డీవోపీ - వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ - ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్
ప్రొడ్యూసర్స్ - వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ - శ్రీకాంత్ సంగిశెట్టి
The teaser of #Deewana presents two phases of love from the boy’s perspective - one during the joyful moments and the other during the painful times.
With appealing music and realistic dialogues, it raises expectations for the film’s release. 👍 pic.twitter.com/q0pBh39pPQ