`
pizza

Kalyan Ram looks ferocious as secret agent in Ugadi Special poster, The film's shoot nearing completion
చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’

You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2022
Hyderabad

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The first look of the film released on actor's birthday raised the curiosity on this spy thriller.

Today, the makers released another slick and blasting poster on the occasion of Ugadi. Kalyan Ram looks great in a blazer and panchekattu and brave with a handlebar moustache, beard and long hair in the first look poster. He looks like a DEVIL holding a gun and standing on the ship.

He looks to be ferocious and ready for a fight. We can also see that his head has been injured. This special look is stunning, and Kalyan Ram's outfit is equally amazing. It certainly raised the bar to a new level. It doesn't reveal much, but it looks like a high octane action sequence will suprise everyone in theatres. This special look is highly magnificent and Kalyan Ram’s getup is equally amazing.

"We wish all the audience a very happy Ugadi," said the film's producer, Abhishek Nama. With a large budget and high technical standards, we are producing Devil as a period drama that explores a previously unexplored territory. Kalyan Ram, who has done a unique films, will surprise audiences once more with Devil. The film's production is nearing completion. We will provide more updates about the film soon.

Devil will be made as a Pan India project on a rich budget with high technical standards in Telugu, Hindi, Tamil and Kannada languages. Being directed by Naveen Medaram, Devil has its story, screenplay and dialogues provided by Srikanth Vissa. Soundarajan will be handling the cinematography. More details regarding this said-to-be period spy thriller will be out soon.

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’

డిఫ‌రెంట్ మూవీస్‌, క్యారెక్ట‌ర్స్ చేస్తూ హీరోగా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో క‌ళ్యాణ్ రామ్ డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక చేతిలో ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఉన్నారు. మ‌రో చేతిలో గ‌న్‌తో షూట్ చేస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో అల‌రించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా ..

చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులంద‌రికి ఉగాది శుభాకాంక్ష‌లు. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని ఓ కొత్త పాయింట్‌ను చూపిస్తూ పీరియాడిక్ మూవీగా డెవిల్ సినిమాను రూపొందిస్తున్నాం. వెర్స‌టైల్ మూవీస్ చేస్తూ వ‌స్తోన్న క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి డెవిల్ సినిమాతో స‌ర్‌ప్రైజ్ ఇస్తారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. న‌వీన్ మేడారంగారు సినిమాను సూప‌ర్బ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్ అందిస్తాం’’ అన్నారు.

సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని ... శ్రీకాంత్ విస్సా కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

సాంకేతిక నిపుణులు:

స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
నిర్మాత‌: అభిషేక్ నామా
ద‌ర్శ‌క‌త్వం: న‌వీన్ మేడారం
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్ : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
కో డైరెక్ట‌ర్‌: చ‌ల‌సాని రామారావు
స్టోరి డెవ‌ల‌ప్‌మెంట్: ప్ర‌శాంత్ బ‌ర‌ది
సి.ఇ.ఒ: పోతిని వాసు

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved