pizza

Dhamaka Is An Out And Out Entertainer: Mass Maharaja Ravi Teja
ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు : మాస్ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >
Follow Us

22 December 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja and director Trinadha Rao Nakkina’s mass and action entertainer Dhamaka produced by TG Vishwa Prasad, under the People Media Factory will arrive in theatres tomorrow with premieres in the USA and other locations on December 22nd. A day before the release of the movie, Ravi Teja took part in a media interaction.

Ravi Teja recently participated in an interaction session with fans. He says he enjoyed the process of spending time with his fans. “These kinds of fans meet give some positive energy which boosts our confidence.”

Unlike before, Ravi Teja is actively promoting Dhamaka. He, however, affirms, “I don’t like to talk much about my movies, I want my movies to talk more. If a film gets positive talk, after the first show was done, then there’s nobody can stop it from becoming a hit.”

It’s been a while; since Ravi Teja did a completely entertaining movie. “I didn’t do a proper entertainer in recent times. Dhamaka is a perfect out-and-out entertainer, after Raja The Great.”

Ravi Teja is one actor who has no qualms working with newcomers. “I like working with newcomers. There is enthusiasm, excitement, and hunger in them to prove themselves.”

The film’s audio album became a chartbuster and Ravi Teja appreciates the composer Bheems Ceciroleo for providing such an amazing album. “Bheems is a very good tune maker. Every song in the movie became a super hit.”

Ravi Teja says he loved working with director Trinadha Rao Nakkina. “It’s really fun working with him. He is a jovial person. Writer Prasanna Kumar’s dialogues are other big assets.”

The actor says he takes the same care for every movie. “I put in the same effort for every movie. But the result is not in our hands. While some stories will connect to the audience, and some may not.”

Sreeleela who played the heroine in the movie already won praise for her good looks, dances, and lively acting. About his co-star, Ravi Teja says, “Sreeleela has a bundle of talent. She is a good perfo1rmer and has got a sweet voice. She will have a bright future.”

Ravi Teja also appreciated his producers TG Vishwa Prasad and Vivek Kuchibhotla. “Both Vishwa Prasad and Vivek are very positive people. They are passionate. I wish to work with them again and again.”

About his character in Waltair Veerayya, Ravi Teja informed, “It is a very strong character, that’s all I can say for now. It’s a good experience to work with megastar Chiranjeevi again. I definitely wanted to work with him again, but I did the movie because I liked the character and the story.”

Ravi Teja opines all kinds of audiences will like his next movie Tiger Nageswara Rao. “It is a Pan India film. The story will have a wider reach. I did undergo a makeover for the film.” He also informed his film Ravanasura completed 80% of its shoot.

The actor affirms he enjoys shooting for his movies and he feels it’s a celebration to be on set every day. “There is no word like boring in my dictionary. I have no complaints or regrets in my life.”

ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు : మాస్ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ధమాకా ప్రమోషన్స్ లో కొత్తగా కనిపిస్తున్నారు.. ఫ్యాన్ మీట్ జరిగింది కదా ?
ఫ్యాన్స్ తో కలవడం జరుగుతూనే వుంటుంది. ఫ్యాన్ మీట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్ గా వుంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.

ఏ సినిమా ప్రమోష‌న్లలోనూ సినిమా గురించి పెద్దగా మాట్లాడ‌రు.. హైప్ ఇవ్వరు కదా ?
ఇప్పుడే కాదండీ.. మొదటి నుండి నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా సినిమానే మాట్లాడుతుంది కదా.

ధమాకా ఎలాంటి సినిమా ?
ధమాకా మంచి ఎంటర్ టైనర్. రాజా ది గ్రేట్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయలేదు. ధమాకా ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ మధ్య మీ నుండి సీరియస్ సినిమాలు వచ్చాయి కదా ? అటు వైపు వెళ్ళడానికి కారణం ?
అన్నీ ప్రయత్నించాలి కదా. ఫలితం మాట పక్కన పెడితే ప్రయత్నం జరుగుతూనే వుండాలి.

ధమాకాని రౌడీ అల్లుడు తో పోలుస్తున్నారు ?
మా రచయిత ఈ మాట చెప్పి వుంటారు. తెలుగు లో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం. ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఈ మధ్య కొత్త రచయితలతో ఎక్కువ పని చేస్తున్నారు కదా ?
ఈ మధ్య కాదు. ఎప్పటి నుండో వుంది. నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన వుంటుంది. నేను అలా వచ్చినవాడినే కదా.

మీ ఎనర్జీ భీమ్స్ కి ఇచ్చినట్లు వున్నారు ?
రెచ్చిపోతున్నాడు.(నవ్వుతూ) ధమాకా ఆల్బమ్ ఇరగదీశాడు. తను చాలా మంచి ట్యూన్ మేకర్. ధమాకా సౌండ్ అదిరిపోయింది. అన్నీ పాటలు అద్భుతంగా చేశాడు.

దర్శకుడు త్రినాధరావు నక్కిన గురించి ?
త్రినాథరావు నక్కినతో చాలా సరదాసరదాగా వుంటుంది. తనతో పని చేయడం అందరికీ కంఫర్ట్ బుల్ గా వుంటుంది.

త్రినాథ‌రావు మీ అభిమాని క‌దా..? ఫ్యాన్ డైరెక్టర్ తో పనిచేసే సౌల‌భ్యం వేరుగా ఉంటుందా?
అలాగేం లేదు. తన హీరో ఇలా వుండాలి, ఇలా చూపించాలని ప్రతి దర్శకుడికి వుంటుంది.

శ్రీలీల పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు కదా ?
ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ వున్నాయి. మంచి డ్యాన్సర్, వాయిస్, ఎనర్జీ అన్నీ వున్నాయి. పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది.

కథల ఎంపిక విషయంలో మీ జడ్జ్ మెంట్ ఎలా వుంటుంది. ?
కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్ గురించి చేసే ప్రసక్తే లేదు. నేనే కాదు ఎవరూ కథ నచ్చకుండా చేయరు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో మళ్ళీ మళ్ళీ పని చేస్తాని చెప్పారు కదా ?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు అద్భుతం. నాకు చాలా నచ్చారు. వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. చాలా పాజిటివ్ గా వుంటారు. అలాంటి వారికీ విజయాలు వస్తే చాలా మందికి ఉపాది కలుగుతుంది. అలాంటి వారికి హిట్లు రావాలి. వారితో ఎన్నిసార్లయిన పని చేస్తాను.

ఓటీటీ మీ ఆలోచన ధోరణిని మార్చిందా ?
లేదు. ఓటీటీ వేరు, థియేటర్ వేరు. ఓటీటీ కి నేను ప్రభావితం కాను.

మీ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు కదా ? కథలు వింటారా ?
తప్పకుండా వింటాను. నిర్మాతకు కథ తెలియాలి. పెట్టుబడి పెడుతున్నాం. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ తెలుసుకుంటాం. మా బ్యానర్ లో వచ్చే సినిమాలు గురించి త్వరలో చెబుతాం.

మీ అబ్బాయిని హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ?
దానికి చాలా టైమ్ వుంది. ప్రస్తుతానికి ఆలోచనే లేదు. చదువుకుంటున్నాడు.

వాల్తేరు వీరయ్య గురించి ?
పవర్ ఫుల్ కారెక్టర్ చేస్తున్నా. పండక్కి చూసి మీరు చెప్పండి. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యతో సినిమా చేయడం గొప్ప అనుభవం. కథ, క్యారెక్టర్ అద్భుతంగా కుదిరాయి. పైగా బాబీ దర్శకుడు.

పాన్ ఇండియా సినిమాల గురించి ?
కథలో పాన్ ఇండియా కంటెంట్ వుండాలి. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వర రావు' చేస్తున్నా . అది చాలా బావుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా.. ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారా ?
నేను జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను. షూటింగ్ అంటే పండగ నాకు. నాకు ఏ రోజు బోర్ కొట్టదు. బోర్ అనే పదం నా డిక్షనరీ లో లేదు. మ

మీ ప్లానింగ్స్ ఏమిటి ?
నేను పెద్దగా ప్లాన్ చేసుకోను. ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించను. ప్రజంట్ ని ఎంజాయ్ చేస్తాను.

మీలో కొత్తగా వచ్చిన మార్పులు ?
నాకు ఊహ తెలిసినప్పటికీ నుండి ఇలానే వున్నాను. నెగిటివిటీ పక్కన పెట్టేసి ఆనందంగా పాజిటివ్ గా ఉండటమే తెలుసు. నా స్ట్రగుల్ ని కూడా ఎంజాయ్ చేశాను. నా లైఫ్ లో ఎలాంటి రిగ్రేట్ లేదు. నేను ఎలాంటి ఒత్తిడి తీసుకొను.

ఆల్ ది బెస్ట్

థాంక్స్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved