pizza

Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, People Media Factory’s "DHAMAKA" Mass Cracker (Teaser) On 21st October
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "ధమాకా" మాస్ క్రాకర్ (టీజర్) అక్టోబర్ 21న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

5 October 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja and commercial maker Trinadha Rao Nakkina’s mass and action entertainer Dhamaka is carrying positive reports. Dhamaka indeed is Ravi Teja mark out-and-out entertainer and the actor will be seen in a dashing character. Played opposite him in the movie is the most sought-after actress Sreeleela.

The makers earlier released a romantic glimpse that showed the sizzling chemistry of Ravi Teja and Sreeleela. The film’s first two songs also became superhits. They will be releasing Mass Cracker (Teaser) on October 21st at 10:01 AM. The makers released two different posters to make the announcement. While one poster shows the romantic side, the other shows the action side.

The movie is being produced lavishly by TG Vishwa Prasad. Vivek Kuchibhotla is the co-producer of the movie being made under the banners- People Media Factory & Abhishek Aggarwal Arts.

‘Double Impact’ is the tagline of the movie that also stars some noted actors in important roles. Coming to technical crew, Prasanna Kumar Bezawada has penned story, screenplay and dialogues for the film, while Karthik Ghattamaneni handles the cinematography. Bheems Ceciroleo has provided soundtracks.

The makers of Dhamaka will soon announce its release date.

Cast: Ravi Teja, Sreeleela

Technical Crew:
Director: Trinadha Rao Nakkina
Producers: TG Vishwa Prasad
Banners: People Media Factory, Abhishek Aggarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Story, Dialogues: Prasanna Kumar Bezawada
Music Director: Bheems Ceciroleo
Cinematography: Karthik Ghattamaneni
Fights: Ram-Lakshman
Production Designer: Srinagendra Tangala

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "ధమాకా" మాస్ క్రాకర్ (టీజర్) అక్టోబర్ 21న విడుదల

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న 'ధమాకా'లో డాషింగ్ క్యారెక్టర్‌లో అలరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

రవితేజ, శ్రీలీల యొక్క అద్భుతమైన కెమిస్ట్రీని చూపించే రొమాంటిక్ గ్లింప్స్‌ను మేకర్స్ ఇదిచ్వరకే విడుదల చేశారు. సినిమా మొదటి రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అక్టోబర్ 21, ఉదయం 10:01 గంటలకు మాస్ క్రాకర్ (టీజర్)ని విడుదల చేయనున్నారు. టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రెండు వేర్వేరు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పోస్టర్ రొమాంటిక్ సైడ్ అయితే, మరొకటి యాక్షన్ సైడ్ తో ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత..

'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజ.వాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

'ధమాకా' నిర్మాతలు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved