`
pizza

O Dollar Pillaga from Das Ka Dhamki released
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ 'దాస్ కా ధమ్కీ' నుంచి ఓ డాలర్ పిలగా పాట విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

6 March 2023
Hyderabad

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.

ఇప్పటివరకూ విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్,

లియోన్ జేమ్స్ ఈ పాటని పెప్పీ పబ్ నెంబర్ గా క్యాచిగా కంపోజ్ చేశారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు సింగర్ మంగ్లీ. ఈ పాటలో విశ్వక్ లుక్స్ స్టన్నింగా వున్నాయి. రావు రామేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఈ పాటలో సందడి చేశారు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved