Dharman first look out
సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, RKFI, #Thalaivar173 మూవీ టైటిల్ 'ధర్మన్' (Dharman)- స్టైలిష్, పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్- ఘనంగా జరిగిన సినిమా ప్రారంభోత్సవం
సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, RKFI, #Thalaivar173 మూవీ టైటిల్ 'ధర్మన్' (Dharman)- స్టైలిష్, పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్- ఘనంగా జరిగిన సినిమా ప్రారంభోత్సవం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం 'ధర్మన్' షూటింగ్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ రోజు ప్రారంభించింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది.
'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో నిలబడి ఉన్న రజనీకాంత్, ఆపరేషన్ డ్రస్‌తో పాటు డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు. చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.
ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, 'ధర్మన్' చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్,ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, RKFI నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే మొదటి సినిమా కావడం విశేషం. ఇది భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యంత ప్రముఖ స్టూడియోలలో ఒకటైన RKFI 46 ఏళ్ల ప్రయాణంలో ఒక గర్వించదగ్గ ఘట్టం.
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, అత్యంత ఆసక్తికరమైన యువ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు, దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి సిమ్రాన్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన రాశీ ఖన్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించడంలో పేరుగాంచిన జాతీయ అవార్డు గ్రహీతలు 'అన్బరివ్' ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిరెడ్డి , కార్తీక్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, అన్నదురై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే డిస్నీ సంస్థ దీనికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ బృందం, ప్రముఖ అతిథుల సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంతో చెన్నైలో ఈ చిత్రం చిత్రీకరణ ఈ రోజు మొదలైంది.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంతో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “రజనీకాంత్‌తో నాకు దాదాపు 50 ఏళ్ల స్నేహం, ప్రయాణం ఉంది. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత ఆ కల ఇప్పుడు ఒకటి కాదు, రెండు సినిమాల రూపంలో నిజమవుతోంది. ఈ స్థాయికి చేరుకోవడానికి మాకు అండగా నిలిచిన ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనది. మహేంద్రన్ గారికి, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ టీమ్‌కు ధన్యవాదాలు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు, సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పాటు మొత్తం టీమ్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు పరిశ్రమకు మంచి సినిమాలు, విజయవంతమైన సినిమాలు ఎంతో అవసరం. ఆ బాధ్యతను మేము కూడా తీసుకుంటున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు”
రజనీకాంత్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కోసం ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు అద్భుతంగా రూపొందిస్తున్నారు. కథ విషయంలో నా నిర్ణయంపై కమల్ పూర్తి నమ్మకం ఉంచినప్పుడు నాకు మరింత బాధ్యతగా అనిపించింది. ముందుగా ఆయనే కథ వినాలని నేను కోరాను. ఆయనకు నచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లింది. అశ్వత్ ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. ఆయనతో పాటు మొత్తం టీమ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది అందరి సమిష్టి కృషి. మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతో అందరం పనిచేస్తున్నాం. కమల్‌తో నా స్నేహం 50 ఏళ్లకు పైబడింది. సినీ ప్రయాణం ప్రారంభమైన రోజుల నుంచే ఆయన నాకు ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మా స్నేహం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ మాత్రమే. ఆయన చేసిన సహాయం, మార్గదర్శకత్వం ఎంతో గొప్పది. ‘పెట్టా’ తర్వాత మళ్లీ సిమ్రాన్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సినిమాలో బలమైన పాత్రలు, వినోదం, థ్రిల్స్, అనిరుధ్ అందించిన అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కమల్ గారికి ఎప్పుడూ అండగా నిలిచే మహేంద్రన్ గారికి కూడా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదాలు, దేవుడి కృపతో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను”
కలైపులి ఎస్. ధను, అన్బుచెజియన్, ఆర్.కె. సెల్వమణి, లింగుస్వామి, కణ్ణన్ (CTO, సన్ నెట్‌వర్క్), షెన్‌బగమూర్తి, తమిళ కుమారన్, కృష్ణన్ కుట్టి (జియో స్టార్), బాలచంద్రన్ (జియో స్టార్), ప్రదీప్ మిల్ట్రాయ్ పీటర్ (జియో స్టార్), ఆనంద్ (సరిగమ) శరవణన్ వినోత్ వంటి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దిగ్గజాలు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఇది ఒక చిరస్మరణీయ వేడుకగా నిలిచింది.
Superstar Rajinikanth’s #Dharman: Ashwath Marimuthu (Oh My Kadavule & Dragon fame) replaces Cibi Chakaravarthi as director.
Music by Anirudh Ravichander, female stars Simran and Raashi Khanna.