pizza

Dheera trailer promises an action-packed ride
*ఆసక్తికరంగా లక్ష్ చదలవాడ ‘ధీర’ ట్రైలర్*

You are at idlebrain.com > news today >

27 January 2024
Hyderabad

The trailer of Laksh Chadalavada-starrer Dheera was dropped by the makers at an event at AMB Cinemas, Hyderabad on Friday. Produced by Chadalavada Padmavathi under Sri Tirumala Tirupati Venkateswara Films, the film is a directorial venture of Vikranth Srinivas.

The two-minute-seven-second clip opens with fantastic drone visuals of a bridge before a male voiceover states that a human’s brain is the most dangerous. What does your brain need? A female counterpart asks him. “To save Rajguru from our attack, we don’t just need the chariot-driving Krishna but also one who wages a war like Rama. Is anyone there?” He wants to know. On cue, we get to see Ranadhir (Laksh) who is six feet two inches tall and someone who equates himself to currency which doesn’t have a character. He is seen two-timing multiple women at the same time, prompting a character played by Mirchi Kiran asking him what sort of a man he is. “You’ve seen a love story so far, I will show you an action movie from now on,” Ranadhir replies. The trailer is filled with powerful dialogue like Vaadu attack chesthe situation ela untuntdo thelusa? Bookampam taruvatha bhoomi-la untundhi (If he attacks, the situation will be akin to an Earth which has just witnessed an earthquake). Ranadhir, who is seen accepting the deal to save Rajguru for Rs 50 lakhs, is now keen on knowing the finer aspects of the deal from the ruffians. He understands that there are 100s of crores of money involved in the deal. What unfolds next?

On the whole, the trailer is an action-packed ride with some high-octane action sequences and powerful one-liners. Laksh, with a certain swag about him, transforms from a romantic boy to a man on a mission effortlessly. He, especially, nails the action part with ease. The lively background score by Sai Kartheek complements the teaser well, while the production values are neat.

Dheera, also featuring Soniya Bansal, Neha Pathan and Suman, will vroom into cinema halls on February 2.

*ఆసక్తికరంగా లక్ష్ చదలవాడ ‘ధీర’ ట్రైలర్*

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో మాస్ హీరోగా లక్ష్ చదలవాడ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ‘ధీర’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.

ధీర గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు హైలెట్ అవుతున్నాయి. ‘ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు అది వెరీ డేంజరస్’.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘రాజ్‌ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే.. రథం నడిపే కృష్ణుడితో పాటు.. యుద్దం చేసే రాముడు రావాలి.. ఎవడైనా ఉంటాడా?’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడం అదిరిపోయింది. వాడి పేరు రణధీర్.. 6'2 ఉంటాడు.. అని హీరోని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

‘నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు’ అని హీరో చెప్పే డైలాగ్.. ‘ఐ లవ్యూ మనీషా’.. ‘ఐ లవ్యూ అమృతా’.. అంటూ హీరో రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. ‘ఇప్పటి దాకా లవ్ స్టోరీ చూశావ్.. ఇప్పుడు యాక్షన్ మూవీ చూపిస్తా’.. అంటూ హీరో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు. ‘ వాడు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూకంపం తరువాత భూమిలా ఉంటుంది’.. అంటూ హీరో గురించి అద్భుతంగా ఎలివేట్ చేశారు. ‘నేను యుద్దం చేయడం ఏంట్రా.. యుద్దమే మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ వస్తోంది.. రూ. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు చేరింది..’ అంటూ చివరి డైలాగ్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ: చదలవాడ బ్రదర్స్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర
నిర్మాత: పద్మావతి చదలవాడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ
ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
ఎడిటర్: వినయ్ రామస్వామి
రచన మరియు దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved