pizza

"Audience is enjoying the music and comedy in the movie Dhoom Dhaam,”: Producer Ram Kumar & Writer Gopi Mohan
"ధూం ధాం" సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు - ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

You are at idlebrain.com > news today >

11 November 2024
Hyderabad

The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana play key supporting roles. The film is produced by MS Ram Kumar under the banner of Friday Framework Works and directed by Sai Kishore Maccha as a love and family entertainer. Gopi Mohan is credited with the story and screenplay. Dhoom Dhaam, which had a grand theatrical release on the 8th of this month, is successfully entertaining audiences as a family film. In a recent interview, producer Ram Kumar and writer Gopi Mohan discussed the movie's success.

Producer Ram Kumar Said,
- "Dhoom Dhaam is receiving a great response from the audience. Everyone who has gone to the theaters is thoroughly enjoying the movie, and the collections are good. The film is attracting audiences from different age groups. Hero Chetan even watched the movie with the general audience in a theater, and he felt happy seeing them enjoy the film so much. After the movie, the audience recognized Chetan and congratulated him."

- "Chetan has connected well with family audiences through Dhoom Dhaam. His previous movies like First Rank Raju and Rojulu Maaray were more youth-oriented. This is the first time Chetan has done a family entertainer. He took a commercial risk with this film, and it has paid off. Successful heroes are those who impress the family audience, and Chetan has made a name for himself in this way. Filmmakers who are thinking about family entertainers will now consider Chetan as a great fit."

- "Although people aren't coming to theaters as much these days and we're not seeing the collections we expected, we are still satisfied with the response. We're doing as much promotion as possible to attract audiences. We will announce our next project in the coming days, and we have no plans to work with outside heroes. Our next film will again feature Chetan."

Writer Gopi Mohan's Said,
- "We planned that the first half of Dhoom Dhaam should focus on good songs, while the second half would be more comedy-driven. As we planned, the audience is enjoying the songs and comedy immensely. Youth typically watch movies in the first three days, and we hope that more families will come to see our movie from now on."

- "Initially, we planned to shoot the movie in the U.S., but due to visa issues, we had to shoot in Poland instead. We decided to include supporting artists in the second half of the movie and selected them according to their characters. Vennela Kishore's character was introduced early on with a touch of aggression, and the second half of the film focuses on him. The audience is connecting really well with his character."

- "The movie revolves around a father who loves his son and a son who deeply respects his father. However, we introduced a plot twist with Prithvi's character, where the relationship between the father and son begins to suffer due to the heroine. While the film is lighthearted, this subplot has created a good level of interest. We initially thought it would be better to bring Prithvi's character in toward the end, but it wasn't practical."

- "Both producer Ram Kumar and hero Chetan are lovers of comedy films. Even though they have worked on serious movies in the past, they enjoy entertaining films. We had a lot of discussions and worked hard on the script for Dhoom Dhaam. In many of my previous scripts, I've incorporated comedy with drinking scenes, and in this film, we created a hilarious scene with Vennela Kishore, which has been receiving an amazing response in theaters."

- "I am planning my next movie with Galla Jayadev Garu's second son, and I will direct that film myself. We will reveal more details soon."

"ధూం ధాం" సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు - ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా సకుటుంబంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

ప్రొడ్యూసర్ రామ్ కుమార్ మాట్లాడుతూ

- "ధూం ధాం" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేటర్స్ లోకి వెళ్లిన వాళ్లంతా ఎంటర్ టైన్ అవుతున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడియెన్స్ థియేటర్స్ కు వెళ్తున్నారు. ఒక థియేటర్ లో కామన్ ఆడియెన్స్ తో కలిసి హీరో చేతన్ సినిమా చూశాడు. వారు మూవీని బాగా ఎంజాయ్ చేయడం గమనించి హ్యాపీగా ఫీలయ్యాడు. సినిమా పూర్తయ్యాక ఆడియెన్స్ చేతన్ ను గుర్తుపట్టి అభినందించారు.

- "ధూం ధాం" సినిమాతో చేతన్ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గతంలో తను చేసిన ఫస్ట్ ర్యాంక్ రాజు, రోజులు మారాయి వంటి మూవీస్ యూత్ ఓరియెంటెడ్ గా ఉంటాయి. ఫస్ట్ టైమ్ చేతన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో చేశాడు. కమర్షియల్ గా ప్రయత్నించాడు. సక్సెస్ ఫుల్ హీరోలంతా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసిన వాళ్లే. చేతన్ కూడా అలాగే పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా ఫిలింమేకర్స్ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అనుకుంటే చేతన్ బాగా సెట్ అవుతాడని భావిస్తారు.

- ఈ రోజుల్లో థియేటర్స్ కు జనం పెద్దగా రావడం లేదు. మేము ఆశించినంత కలెక్షన్స్ లేకున్నా సంతృప్తికరంగానే వసూళ్లు ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఆకర్షించేలా వీలైనంత ప్రమోషన్ చేస్తున్నాం. మా సంస్థలో నెక్ట్ మూవీని మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాం. బయట హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశం లేదు. చేతన్ తోనే మా నెక్ట్ మూవీ ఉంటుంది.

రైటర్ గోపీ మోహన్ మాట్లాడుతూ

- "ధూం ధాం" సినిమా ఫస్టాఫ్ లో మంచి పాటలు, సెకండాఫ్ లో కామెడీ ఉండాలని ప్లాన్ చేశాం. మేము అనుకున్నట్లే సాంగ్స్ కు , కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ మూడు రోజులు యూత్ ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు. ఈరోజు నుంచి ఫ్యామిలీస్ మా మూవీకి బాగా వస్తారని ఆశిస్తున్నాం.

- అమెరికాలో ఈ మూవీ షూటింగ్ చేయాల్సింది, అయితే వీసాలు రాని కారణంగా పోలెండ్ లో చిత్రీకరణ జరిపాం. సెకండాఫ్ లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే బాగుంటుందని క్యారెక్టర్స్ కు తగినట్లు తీసుకున్నాం. వెన్నెల కిషోర్ దూకుడు ముందు నుంచీ పరిచయం. అతని పైనే ఈ సినిమా సెకండాఫ్ వెళ్లింది. తన క్యారెక్టర్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

- కొడుకు ప్రేమించే తండ్రి, తండ్రిని బాగా గౌరవించే కొడుకు..ఇది మూల కథ అయితే...ఒక హుక్ పాయింట్ లా ఉంటుందని హీరోయిన్ వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుందని పృథ్వీ క్యారెక్టర్ తో చెప్పించాం. సినిమా సరదాగా రన్ అవుతున్నా, ఆ క్యారెక్టర్ చెప్పిన పాయింట్ ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పృథ్వీ క్యారెక్టర్ ని చివరలో తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నా...ప్రాక్టికల్ గా కుదరలేదు.

- ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు, హీరో చేతన్ ఇద్దరూ కామెడీ మూవీ లవర్స్. వాళ్లు ఇప్పటిదాకా చేసింది హాఫ్ బీట్ సినిమాలే అయినా ఎంటర్ టైనింగ్ మూవీస్ ఇష్టపడతారు. "ధూం ధాం" స్క్రిప్ట్ కోసం చాలా డిస్కషన్స్ చేసి వర్క్ వుట్ చేశాం. నేను స్క్రిప్ట్ చేసిన మూవీస్ లో డ్రింకింగ్ సీన్స్ తో మంచి కామెడీ వచ్చింది. అలా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో మన లెజెండరీ నటుల డైలాగ్స్ తో ఓ సీన్ చేశాం. ఈ సీన్ కు థియేటర్ లో హిలేరియస్ గా రెస్పాన్స్ వస్తోంది.

- నా నెక్ట్ మూవీ గల్లా జయదేవ్ గారి రెండో అబ్బాయితో ప్లాన్ చేస్తున్నా. నా డైరెక్షన్ లోనే ఆ సినిమా చేస్తాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved