pizza

"Dhoom Dham" Teaser Released by Star Hero Gopichand and Director Sreenu Vaitla; Movie Set for Grand Theatrical Release on September 13
స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా టీజర్ విడుదల,సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

You are at idlebrain.com > news today >

12 August 2024
Hyderabad

The teaser for the movie "Dhoom Dham" was released today by star hero Gopichand and successful director Sreenu Vaitla. The film, which is set for a grand theatrical release on September 13, features Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana play significant supporting roles. Produced by MS Ram Kumar under the Friday Frame Works banner, "Dhoom Dham" is a love and family entertainer directed by Sai Kishore Macha, with Gopi Mohan providing the story and screenplay.

On the occasion of the teaser release, Director Srinu Vaitla praised the teaser, describing it as vibrant and colorful. He noted that many people involved in the film are close to him, including Gopi Mohan, a talented and insightful writer with whom he has collaborated extensively. Vaitla also commended Director Sai Kishore for his passion and dedication, having worked with him from "Dubai Sheenu" to "Baadshah." He acknowledged producer Ram Kumar as a good friend with a deep passion for cinema, having made significant contributions to the industry with films like "First Rank Raju." Vaitla expressed his hope that "Dhoom Dham" will be a great success for Ram Kumar and hero Chetan Krishna.

Hero Gopichand also praised the teaser, highlighting the impressive music and good production values. He was introduced to Ram Kumar through Srinu Vaitla and commended him as a good producer. Gopichand expressed confidence in Director Sai’s dedication and Gopi Mohan's storytelling abilities. He emphasized that the film is set for release on September 13 and expressed his hope that it will be successful, bringing acclaim to Ram Kumar, Sai Kishore, and Chetan Krishna.

Director Saikishore Macha said - I would like to thank the hero Gopichand and Ma Srinu Vaitla who launched the teaser of the movie "Dhoom Dham". Thanks to Gopi Sundar who gave good music in our movie and Ramajogaiah Shastri who wrote the songs. Also, our producer Ram Kumar and all the team who worked for this film gave me good support. We all made a good movie. Coming to you on September 13. Wish you would cherish

Producer MS Ram Kumar said - We are happy to release the teaser of our movie "Dhoom Dham" at the hands of hero Gopichand and director Srinu Vaitla. Gopichand is one of my best friends in the industry. He gives us his guidance. Director Sai has made this movie to be liked by everyone. He took care of every little thing and made it perfect. Gopi Mohan's story and screenplay are impressive. Giri. "Dhoom Dham" is a good family entertainer movie. We are bringing our movie to the theaters on September 13. Hope you all support.

Story and screenplay writer Gopi Mohan said - He is happy to release the teaser of the movie "Dhoom Dham" by hero Gopichand and director Srinu Vaitla. Gopichand's hand is good. I worked with him for a super hit movie called Laukyam. This movie will also be a good family entertainer like Laukyam. We believe that "Dhoom Dham" will be a good success. Said.

Actor Vinay Varma said - The opportunity to act in the movie "Dhoom Dham" came through Gopi Mohan. In this movie, I am playing the heroine's father. There will be a movie for all of you.

Actor Giri said - "Dhoom Dham" is a family entertainer movie. You can watch it as a family. I played a very funny role in this movie. See you in theaters on September 13.

Actor Sandesh said - "Dhoom Dham" movie was made by our producer with great passion. Our director Saikishore has brilliantly shot it. I am happy to get a chance to act in this film.

"Dhoom Dham" movie teaser is impressive with complete love and family entertainer elements. Every frame looks colorful. Chetan Krishna's performance is the highlight. Also good casting is attractive. The BGM made for this teaser by Gopi Sundar with the hook line Dhoom Dham is impressive. With rich production values, the movie "Dhoom Dham" is going to hit the screens on September 13.

Actors - Chetan Krishna, Hebah Patel, Sai Kumar, Vennela Kishore, Prithviraj, Goparaju Ramana, Sivannarayana, Banerjee, Sai Srinivas, Praveen, Naveen Neni, Giridhar, Bhadram etc.

Technical Team:
- Dialogues: Praveen Varma
- Choreography: Vijay Binni, Bhanu
- Lyrics: Saraswati Putra Ramajogayya Sastry
- Fights: Real Satish
- Publicity Designers: Anil, Bhanu
- Art Director: Raghu Kulkarni
- Editing: Amar Reddy Kudumula
- Cinematography: Siddharth Ramaswamy
- Music: Gopi Sundar
- Story & Screenplay: Gopi Mohan
- Executive Producer: Siva Kumar
- Producer: MS Ram Kumar
- Director: Sai Kishore Macha

స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా టీజర్ విడుదల,సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు "ధూం ధాం" సినిమా టీజర్ ను స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమా టీజర్ చాలా బాగుంది. చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. "ధూం ధాం" సినిమాకు పనిచేసిన టీమ్ లో చాలా మంది నాకు దగ్గరి వాళ్లు. గోపీ మోహన్ నాతో ఎంతగా ట్రావెల్ చేశాడో మీకు తెలుసు. ఆయన మంచి సెన్సబుల్ రైటర్. ఈ సినిమాకు మంచి స్టోరీ స్క్రీన్ ప్లే చేశారు. డైరెక్టర్ సాయి కిషోర్ నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో దుబాయ్ శీను నుంచి బాద్ షా మూవీ వరకు వర్క్ చేశాడు. ప్యాషన్, డెడికేషన్ ఉన్న డైరెక్టర్. నిర్మాత రామ్ కుమార్ గారు నాకు మంచి మిత్రులు. ఆయన విదేశాల్లో ఉండి సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ల అబ్బాయితో ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి మూవీస్ చేశారు. "ధూం ధాం" సినిమా భారీ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. విదేశాల్లో షూటింగ్స్ చేశారు. ఈ సినిమా రామ్ కుమార్ గారికి, హీరో చేతన్ కృష్ణకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మంచి సాంగ్స్ ఉన్నాయి. శ్రీను వైట్ల గారి ద్వారా నాకు రామ్ కుమార్ గారు పరిచయం అయ్యారు. ఆయన మంచి ప్రొడ్యూసర్. డైరక్టర్ సాయి నాకు ఎప్పటినుంచో తెలుసు. డెడికేషన్ ఉన్న పర్సన్. ఈ సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే చేసిన గోపీ మోహన్ సెన్సబుల్ రైటర్. నాతో లౌక్యం సినిమా నుంచి వర్క్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13న "ధూం ధాం" సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి రామ్ కుమార్ గారికి, సాయికి, చేతన్ కృష్ణకు మంచి పేరు తీసుకురావాలి. రామ్ కుమార్ గారు నిర్మాతగా మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమా టీజర్ లాంఛ్ చేసిన హీరో గోపీచంద్ గారికి, మా శ్రీను వైట్ల గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీలో మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీ సుందర్, పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు, ఈ సినిమాకు వర్క్ చేసిన టీమ్ అంతా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మేమంతా ఒక మంచి మూవీ చేశాం. సెప్టెంబర్ 13న మీ ముందుకు రాబోతున్నాం. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ మాట్లాడుతూ - మా "ధూం ధాం" సినిమా టీజర్ ను హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో నాకు ఉన్న మిత్రుల్లో గోపీచంద్ గారు ముఖ్యులు. తన గైడెన్స్ మాకు ఇస్తుంటారు. ఈ సినిమాను డైరెక్టర్ సాయి అందరికీ నచ్చేలా రూపొందించాడు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుని పర్పెక్ట్ గా తెరకెక్కించాడు. గోపీ మోహన్ గారి కథ, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. గిరి. "ధూం ధాం" మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. సెప్టెంబర్ 13న మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ గోపీ మోహన్ మాట్లాడుతూ- "ధూం ధాం" సినిమా టీజర్ ను హీరో గోపీచంద్ గారు, డైరక్టర్ శ్రీను వైట్ల గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. గోపీచంద్ గారి హ్యాండ్ మంచిది. ఆయనతో లౌక్యం అనే సూపర్ హిట్ సినిమాకు వర్క్ చేశాను. ఈ సినిమా కూడా లౌక్యంలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. "ధూం ధాం" మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

నటుడు వినయ్ వర్మ మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమాలో నటించే అవకాశం గోపీ మోహన్ గారి ద్వారా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటిస్తున్నాను. మీ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.

నటుడు గిరి మాట్లాడుతూ - "ధూం ధాం" ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా. మీరంతా సకుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది. నేను ఈ మూవీలో బాగా నవ్వించే రోల్ చేశాను. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

నటుడు సందేశ్ మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమాను మా ప్రొడ్యూసర్ ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. మా డైరెక్టర్ సాయికిషోర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాకు నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. అన్నారు.

"ధూం ధాం" సినిమా టీజర్ కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. చేతన్ కృష్ణ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంది. అలాగే మంచి కాస్టింగ్ ఆకర్షణగా నిలుస్తున్నారు. ధూం ధాం అనే హుక్ లైన్ తో గోపీ సుందర్ ఈ టీజర్ కు చేసిన బీజీఎం ఆకట్టుకుంది. రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో "ధూం ధాం" సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ ,స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved