I will produce films with a new team through 'DilRaju Dreams': Ace Producer DilRaju
‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా కొత్త టీంతో చిత్రాలను నిర్మిస్తాను : ప్రముఖ నిర్మాత దిల్ రాజు
To promote new talent, ace producer DilRaju launched DilRaju Dreams banner. As part of this initiative, he unveiled the logo on Monday and announced plans to launch a website soon. DilRaju addressed the media and shared his vision for this new platform, revealing several key details.
- "I started DilRaju Dreams to encourage fresh talent and new content. Anyone, whether it's a director, producer, actors, technicians and music composers , can approach the DilRaju team. Through the website, your content will reach us. I will listen to the scripts brought by this team once a week."
- "We plan to launch the new website either on my birthday or on New Year's Day. We will invite all the star heroes and directors who are close to me for a grand launch. We will share more details soon."
- "Two NRI producers are already working on two projects by collaborating with Dil Raju Dreams. I want this to be a platform for newcomers to showcase their talent."
- "We will also review scripts from a critical perspective. We aim to involve the media at the script level itself. While films are eventually reviewed, we want the media to be part of the process even before the film goes into production . Ultimately for good content and new talent encouragement .
- "In the industry, it's often unclear how many films are coming or going. Many people approach me asking to release posters and teasers, and I can instantly tell why certain films are being made. I know the kind of money that is being wasted. This is why I founded DilRaju Dreams—to minimize such losses and create a platform with a purpose."
- "We have decided to produce only four or five films a year. Our team will review all the scripts, filter them, and select just five projects .
- "If new talent emerges through this platform, they will have the opportunity to make films under my banner in the future. Real talent must be recognized. For example, Balagam Venu made a film with us, and there was genuine emotion in it. Now, they are making another film, Yellamma, with us.
- "There are no recommendations here. Everyone must submit their work through the website. A 20-minute script will be reviewed by our team, and if it passes, it will come to me for further consideration. I will set aside one day each week to listen to these new stories."
‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా కొత్త టీంతో చిత్రాలను నిర్మిస్తాను : ప్రముఖ నిర్మాత దిల్ రాజు
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే..
* కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుంది. వారంలో ఒక రోజు నేను ఈ టీం తెచ్చిన స్క్రిప్ట్‌లను వింటాను.
* నా బర్త్ డే సందర్భంగా అయినా లేదా న్యూయర్ సందర్భంగా అయినా ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. నాకు సన్నిహితులైన స్టార్ హీరోలను, దర్శకులందరినీ పిలిచి ఆ వెబ్ సైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. దీనిపై త్వరలోనే అప్డేట్ ఇస్తాం.
* ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులను చేస్తున్నారు. కొత్త వాళ్లందరికీ ఇదొక ఫ్లాట్ ఫాంగా ఉండాలని అనుకుంటున్నాను.
* రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా స్క్రిప్టులను రివ్యూ చేయొచ్చు. స్క్రిప్ట్ స్థాయిలోనే మీడియా వాళ్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నాం. సినిమాను ఎలాగూ రివ్యూ చేస్తారు. దాని కంటే ముందు ఇలా స్క్రిప్ట్‌ని కూడా రివ్యూ చేసేందుకు మా టీంలోకి మీడియాని ఆహ్వానిస్తున్నాం.
* ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. నా దగ్గరకు చాలా మంది వచ్చి పోస్టర్‌లు, టీజర్‌లు రిలీజ్ చేయమని అడుగుతారు. అవి చూడగానే నాకు అర్థం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఎందుకు తీస్తారు.. ఎవరు చూస్తారు? అని చెప్పేస్తాను. అక్కడ ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను.
* ఏడాదికి నాలుగైదు సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాం. మా టీం అన్ని కథలు, స్క్రిప్టులు విని వడపోస్తారు. అందులోంచి కేవలం ఐదు చిత్రాలను ఎంచుకుంటాం. కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలనే కండీషన్ పెట్టాను. తీసే ఐదు చిత్రాలకు ఐదు చిత్రాలు ఫ్లాప్ అయితే మా కష్టం వృథా అవుతుంది.
* ఈ ప్రాసెస్‌లో న్యూ టాలెంట్ వస్తే.. మున్ముందు నా బ్యానర్‌లోనే సినిమా చేసే అవకాశం ఉంటుంది. అసలు టాలెంట్ ముందు తెరపైకి రావాలి. బలగం వేణు మాకు సినిమా చేశాడు. మాతో ఎమోషన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఎల్లమ్మ సినిమాను కూడా మాకే చేస్తున్నారు. అలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నాక్కూడా హెల్ప్ అవుతుంది.
* ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్‌ను అందులో పెట్టాల్సి ఉంటుంది. అది మా టీం చూస్తుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం తరువాత నా వద్దకు వస్తుంది. ఈ కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు ఇకపై తప్పకుండా కేటాయిస్తాను.