pizza

Sushmita Shetty about DNK
‘దొంగ నా కొడుకు’లో క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశాను. ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫన్ ఎంటర్‌టైనర్: హీరోయిన్ సుష్మితా శెట్టి

You are at idlebrain.com > news today >

04 Novembar 2026
Hyderabad

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మితా శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం.. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది?
-నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు.

-నాకు శ్రీదేవి గారు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. అన్ని రకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. నేను ఫారిన్‌లో చదువుకున్నాను. అక్కడ చదువుకునేటప్పుడు థియేటర్ కూడా చేశాను.

-లీడ్ హీరోయిన్‌గా ‘దొంగ నా కొడుకు’ నా మొదటి సినిమా. ఇంతకుముందు ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ చేశాను. ఒక నటిగా బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-ఇందులో చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశాను. కొంచెం తింగరి (నవ్వుతూ) క్యారెక్టర్. ఇందులో ఈశ్వర్ (మౌళి)ని చాలా ప్రేమిస్తుంది. తన ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది. తను చాలా స్మార్ట్ అనుకునే క్యారెక్టర్. ఇందులో క్రైమ్‌లో తెలియకుండానే ఇన్నోసెంట్‌గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ ఇన్నోసెంట్‌ కామెడీ ఉంటుంది. నేను ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటే అది కామెడీగా మారుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌లో పని చేయడం ఎలా అనిపించింది?
-మైత్రీ మూవీ మేకర్స్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. పెద్ద స్టార్ సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న కథలకు కూడా వాళ్లు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

మౌళితో వర్క్ చేయడం గురించి?
-మౌళి చాలా టాలెంటెడ్. చాలా హంబుల్‌గా ఉంటారు. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. తనకి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

కథ విన్న తర్వాత ఎలా అనిపించింది?
-ఈ టైటిల్ వినగానే చాలా నచ్చింది. చాలా క్యాచీగా ఉంది. అందరూ రిలేట్ చేసుకునే ఫన్‌ టైటిల్. అలాగే కథ వినగానే చాలా నచ్చింది. ఇందులో చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది.

ఈ సినిమాలో డ్యాన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంది?
-ఇందులో ఒక డ్యాన్స్ నంబర్ ఉంది. అది కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే మౌళికి మరో సోలో సాంగ్ ఉంది. భవిష్యత్తులో మంచి డ్యాన్స్ సాంగ్స్‌తో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన డ్యాన్సింగ్ హీరోలు ఎవరు?
రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు.

మ్యూజిక్ గురించి?
-సింజిత్ చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్. ఇది క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి తగ్గట్టుగా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

మీ డ్రీమ్ రోల్ ఏమిటి?
నాకు ‘మహానటి’ సినిమా చాలా ఫేవరెట్. అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాకు కూడా అలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక సినిమా చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్ సినిమాలు కూడా చేయాలని ఉంది. నాకు రొమాంటిక్ కామెడీలు అంటే చాలా ఇష్టం. అలాగే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను కూడా ఇష్టపడతాను.

డైరెక్టర్ గురించి?
-డైరెక్టర్ గారు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. ఇది ఆయన తొలి సినిమా. అయినా ఆయన ముఖంలో ఎప్పుడూ టెన్షన్ కనిపించదు. చాలా కూల్‌గా ఉంటారు.

ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?
-సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ వస్తారు. ఇందులో చాలా ఎంటర్‌టైనింగ్ కామెడీ ఉంటుంది. చాలా ఫ్రెష్ కామెడీ ఉంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
-తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved