After making an impression with Little Hearts, Mouli Tanuj Prasanth is returning with a completely different entertainer. His upcoming film Donga Naa Koduku, backed by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, is set to hit the big screens on November 13.
The film is helmed by newcomer Sreenu Kambala and is designed as a fun-filled family entertainer. The release date poster gives an amusing peek into the kind of situations audiences can expect. Mouli occupies the centre of the frame, seated on a sofa with a visibly frightened and confused look. Behind him, Ali and Rajitha appear as his parents, with Rajitha looking stern while pointing towards him and Ali reacting in his own humorous manner.
As Donga Naa Koduku is scheduled to release on November 13, the promotional campaign is expected to become more active in the coming days. The team is likely to unveil more content ahead of the theatrical release.
Sushmitha Shetty stars as the female lead in the movie.
మౌళి తనుజ్ ప్రశాంత్, శ్రీను కంబళ, మైత్రి మూవీ మేకర్స్ రాబరీ క్రైమ్ కామెడీ 'దొంగ నా కొడుకు' నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, 'లిటిల్ హార్ట్స్' చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన 'దొంగ నా కొడుకు' చిత్రంతో వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. శ్రీను కంబళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సరికొత్త, ఆసక్తికరమైన కథాంశంతో ఒక ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమా కామెడీ టోన్‌ను ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్‌లో మౌళి సోఫా మధ్యలో కూర్చొని షాక్, భయంతో కూడిన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తున్నారు. ఆయన వెనుక తల్లిదండ్రుల పాత్రల్లో అలీ, రజిత కనిపిస్తున్నారు. రజిత సీరియస్‌గా మౌళి వైపు చూపిస్తుండగా, అలీ తనదైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌తో ఆకట్టుకుంటున్నారు. ముగ్గురి భిన్నమైన హావభావాలు పోస్టర్‌కు మంచి కామెడీని తీసుకొచ్చాయి. తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే సరదా అనుబంధం సినిమాలో కీలకంగా ఉండబోతుందనే ఆసక్తిని పోస్టర్ కలిగిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కొనసాగింపుగా, విడుదల తేదీ పోస్టర్ ‘దొంగ నా కొడుకు’పై క్యూరియాసిటీని మరింత పెంచింది. సినిమా విడుదలకు నెల రోజుల్లోపే సమయం ఉండటంతో, మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయనున్నారు. సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుశ్మిత శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్.