pizza

It's a pleasure to produce a film with Fahadh Faasil.: Producer S.S. Karthikeya at the teaser launch event of ‘Don’t Trouble the Trouble’
ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ

You are at idlebrain.com > news today >

13 July 2026
Hyderabad

Starring versatile actor Fahadh Faasil as the lead, ‘Don’t Trouble the Trouble’ is presented by S.S. Rajamouli and produced by Shobu Yarlagadda, Prasad Devineni, and S.S. Karthikeya under the banners of Arka Media Works and Showing Business. The film marks the directorial debut of Shashank Yeleti. The movie is set to release on September 11. The teaser of the film was unveiled on Monday. Speaking at the teaser launch event, the team shared their thoughts.

Producer S.S. Karthikeya said, “It is a pleasure to produce a film with Fahadh Faasil. I hope you have watched the teaser of ‘Don’t Trouble the Trouble’ and liked it. This film is something that will touch your heart. Once you watch the content we are bringing forward, you will understand that.

‘Don’t Trouble the Trouble’ was supposed to be completed before the launch of ‘Varanasi’, but due to certain reasons, we started this project a little later. Fahadh is related to my wife’s family. I have always admired him. We met him once during the shooting of ‘Pushpa’. At that time, we were working on a few scripts. We had prepared a script titled ‘Oxygen’ specifically for him. We also told him that we had another script. He immediately agreed to do ‘Don’t Trouble the Trouble’ after the very first narration.

A film in this genre has not come out in recent times. The movie has extensive VFX work. The script was locked only after getting Rajamouli garu’s approval and inputs. Once the film is completely finished, we will show it to him again and take his suggestions.”

Producer Shobu Yarlagadda said, “It is very exciting for us to make a film titled ‘Don’t Trouble the Trouble’ with Fahadh Faasil. After a long time, we are bringing a movie to the audience again. We hope everyone will like our teaser. The film will be something that everyone can watch and enjoy. We are releasing the movie in South Indian languages. As of now, we have not planned it as a pan-India release. We cannot say what will happen until the time of release.”

Through an audio byte, Fahadh Faasil said, “I have always wanted to do a straight Telugu film. I was waiting for a good script. I really liked the story narrated by Shashank. I am happy to be part of a film that has strong fantasy drama elements.”

Director Shashank Yeleti said, “‘Don’t Trouble the Trouble’ has a unique concept. The film is designed to entertain the audience. It has been a wonderful experience working with Fahadh sir. He loved the story very much. Once he comes to the sets, he completely surrenders himself to the script. Sara has given an excellent performance. I thank the producers for giving me this opportunity.”

Music director Kaala Bhairava said, “We never faced any trouble during the shooting of ‘Don’t Trouble the Trouble’. It is a magical world. Just like our teaser, the film will also be equally impressive. This story demanded a lot from me. Every scene is very different and unique. I have learned a lot through this movie.”

Child artist Ssara said, “I played the character of Divya in ‘Don’t Trouble the Trouble’. Shashank sir is an amazing director. I thank Shobu sir, Prasad sir, and Karthikeya sir for giving me such a wonderful opportunity. It was a great experience working with Fahadh sir. With our teaser, we are taking all of you into a magical world.”

Cast: Fahadh Faasil, Ssara, and others

Director: Shashank Yeleti
Producers: Shobu Yarlagadda, Prasad Devineni, S.S. Karthikeya
Script Development: S.S. Kanchi
Co-writer: Hamza Ali
Production Design: Mohan Nath Bingi, Sandeep Suvarna
Music Director: Kaala Bhairava
Cinematography: Brad Francis ACS
Stylist: Rama Rajamouli
Editor: Praveen Antony
Executive Producer: S.S. Shashank
Line Producer: Rahul Shali
Production Controller: D. Yoganand
Sound Design: Manoj Goswami

ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ*

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో..

నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘ఫహాద్ ఫాజిల్ గారితో సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ చూసే ఉంటారు. అందరికీ నచ్చే ఉంటుంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మనసుకు హత్తుకునే చిత్రం. ఇకపై నుంచి రాబోయే కంటెంట్‌ని చూస్తే ఆ విషయం మీకే అర్థం అవుతుంది. ‘వారణాసి’ ప్రారంభం కంటే ముందే ఈ చిత్రం పూర్తి అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఆలస్యంగా స్టార్ట్ చేశాం. ఫహాద్ గారు నా భార్య తరుపు బంధువులు. నాకు ముందు నుంచీ ఫహాద్ గారంటే ఇష్టం. ఓసారి ‘పుష్ప’ చిత్రీకరణ సమయంలో ఆయన్ను కలిశాం. ఆ టైంలోనే మేం కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేస్తున్నాం. ‘ఆక్సిజన్’ అనే స్క్రిప్ట్ ఆయన కోసమే రెడీ చేశాం. ఇంకో స్క్రిప్ట్ కూడా ఉందని ఈ కథ చెప్పాం. ఆయనకు చెప్పిన ఫస్ట్ నెరేషన్‌లోనే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ని ఓకే చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు. ఈ చిత్రంలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. రాజమౌళి గారి స్టాంప్ పడ్డ తర్వాతే స్క్రిప్ట్ లాక్ అయింది. మూవీ అంతా పూర్తయ్యాక మళ్లీ ఆయనకు చూపించి సలహాలు తీసుకుంటాం’ అని అన్నారు.

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ ఫహాద్ ఫాజిల్‌ గారితో సినిమా చేయడం మాకెంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. మా మూవీ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికి అయితే ప్యాన్ ఇండియా అని ప్లాన్ చేయలేదు. రిలీజ్ టైం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం’ అని అన్నారు.

ఆడియో బైట్ ద్వారా ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ .. ‘‘తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. శశాంక్ చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి మంచి ఫ్యాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది. ఫహాద్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనకి కథ చాలా నచ్చింది. సెట్‌కి వచ్చాక స్క్రిప్ట్‌కి సరెండర్ అవుతారు. సారా అద్భుతంగా నటించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

సంగీత దర్శకుడు కాల భైరవ మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ టైంలో మేం ఎక్కడా ట్రబుల్ అవ్వలేదు. ఇదొక మ్యాజికల్ వరల్డ్. మా టీజర్ ఎంత బాగుంటుందో.. సినిమా కూడా అంతే స్థాయిలో బాగుంటుంది. ఈ కథ నా నుంచి ఎంతో డిమాండ్ చేసింది. ప్రతీ ఒక్క సీన్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీతో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ సారా మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంలో నేను దివ్య అనే పాత్రను పోషించాను. శశాంక్ గారు అద్భుతమైన దర్శకులు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శోభు సార్, ప్రసాద్ సార్, కార్తికేయ సర్‌లకు థాంక్స్. ఫహాద్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మా టీజర్‌తో మీ అందరినీ మ్యాజికల్ వరల్డ్‌లోకి తీసుకు వెళ్తున్నామ’ని అన్నారు.

నటీనటులు : ఫహాద్ ఫాజిల్, సారా తదితరులు

దర్శక‌త్వం: శశాంక్ యేలేటి
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ
స్క్రిప్ట్ డెవల‌ప్‌మెంట్‌: ఎస్‌.ఎస్‌.కంచి
సహ రచయిత: హంజా అలీ
ప్రొడక్షన్ డిజైన్: మోహన్ నాథ్ బింగి - సందీప్ సువర్ణ
సంగీత దర్శకుడు: కాల భైరవ
సినిమాటోగ్ర‌ఫీ: బ్రాడ్ ఫ్రాన్సిస్ ఎసిఎస్‌
స్టైలిస్ట్: రమా రాజమౌళి
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ఎస్‌.శశాంక్
లైన్ ప్రొడ్యూసర్: రాహుల్ షాలి
ప్రొడక్షన్ కంట్రోలర్: డి యోగానంద్
సౌండ్ డిజైన్: మనోజ్ గోస్వామి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
s