pizza

Double Ismart pre release event
Ram Is An Excellent Actor And Dancer, Double ISMART Was Possible Only Because Of Him: Puri Jagannadh
డబుల్ ఇస్మార్ట్ అంటే రామ్ పోతినేని ఎనర్జీ. ఆగస్ట్ 15న వెళ్లి చూడండి. రామ్ మిమ్మల్ని చాలా ఎంటర్ టైనర్ చేస్తారు: డైరెక్టర్ పూరి జగన్నాధ్‌

You are at idlebrain.com > news today >

11 August 2024
Hyderabad

Ustaad Ram Pothineni and Dashing director Puri Jagannadh’s much-awaited Pan India film Double ISMART is carrying a strong buzz with a terrific response to all the promotional material. Meanwhile, the makers grandly celebrated the film’s pre-release in Warangal. The event saw a huge turnout.

While speaking at the event, producer Charmme Kaur expressed her gratitude, saying, "I want to thank everyone for making all the songs such big hits. The trailer has also been well received. I’ll share more after the film’s release."

Puri Jagannadh said, “When I think of Double iSmart, the one name that comes to mind is Ram Pothineni. The energy Ram brings is unparalleled. We can see Ram’s energy when he just walks onto the sets. It doesn’t just excite me, it energizes me. He brought that specialty to the character with the hairstyle, body language, Telangana slang, and more importantly, the attitude. We wouldn't enjoy the character as much, if all these elements aren’t performed well by him. This movie is only possible because of Ram. He’s an excellent dancer and a great performer. Without Ram, there wouldn’t be iSmart Shankar.

Sanjay Dutt is a hero with over 150 films to his name, and I’m a big fan of his. His presence in this film brought a new energy to the film. Likewise, Kavya performed well. Dancing next to Ram is no small feat. She learned all her dialogues in Telugu and delivered them flawlessly.

Ali and I share a 30-year friendship and have worked together on many films. In this one, he played a character named Bokka. I had discussed this track with Ali 15 years ago, and he had already shown interest in it. Charmme is a major strength for our company. We faced tough times, and Vishu Reddy has been our pillar, always standing behind Charmme.

Double iSmart is done with double the energy compared to iSmart Shankar. The energy that Ram brings to each scene is something you’ll truly enjoy.

I’d like to share a phone call I received. When a film is a hit, many people call to congratulate and appreciate us. However, after I delivered a flop, I got a call from Vijayendra Prasad, who never usually contacts me. He asked if he could help him with something. I said, “Of course, sir, what is it?” He asked when my next film would be. I told him I hadn’t thought about it yet. He requested that I tell him the story before I start. I understood what he was implying. He said, “I can’t tolerate to see directors like you fail. You make small mistakes. So let me see whether I can do any corrections before you proceed.” I was very emotional hearing this. However, I didn’t share the story with him. I took this film very close to my heart and made it with great dedication.”

Ram Pothineni said, “Mani Sharma felt more tension than anyone of us. Given the huge success of the audio for iSmart Shankar, he felt added pressure for Double ISMART. Generally, sequels come with expectations regarding the story. But for this film, the expectations extend to the audio as well. The expectations have been met with superb responses to the songs. I believe the songs will reach the next level when people watch them on screen.

Sanju Baba, it’s an honor working with you. We couldn’t imagine anyone else but you in this role. Kavya is a wonderful girl. She is very dedicated and committed. She learned her dialogues and delivered them in Telugu. It’s an honor to work with Ali Garu. Charmme is a fighter.

I need to share with you how much I enjoyed working with Puri garu. “When I go to the set, my world changes completely. I get a burst of energy and start enjoying the work. I don’t like calling him a legend. He is still one of the most inspiring directors in Telugu cinema.

In the industry, many people look up to Puri Garu when it comes to becoming a writer and director. I saved his name as Gun in my phone. Heroes are like bullets. You’ll see how much force I bring when I’m in the hands of a "gun" director like Puri Jagannadh on August 15th. The thrill I get from working with Puri is unmatched.”

We need to wait till August 15th to witness double mass madness in theatres.

డబుల్ ఇస్మార్ట్ అంటే రామ్ పోతినేని ఎనర్జీ. ఆగస్ట్ 15న వెళ్లి చూడండి. రామ్ మిమ్మల్ని చాలా ఎంటర్ టైనర్ చేస్తారు: డైరెక్టర్ పూరి జగన్నాధ్‌

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్ లో'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా వుంది. మణిశర్మ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు, ఇస్మార్ట్ శంకర్ కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాయి. సంజయ్ దత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. కావ్య చాలా మంచి అమ్మాయి.చాలా హార్డ్ వర్క్ చేసింది. విష్ హానెస్ట్ గా తన పని తను చేస్తూ ఉంటాడు. చార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. పూరిగారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గారు గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎం తఫోర్స్ గా అయినా వెళ్తుంది. పూరి గారు లాంటి గన్ అందరి యాక్టర్స్ కి కావాలి. లవ్ యూ సర్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు. ఆగస్ట్ 15న కలుద్దాం. లవ్ యూ ఆల్' అన్నారు

డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ.. హాయ్ ఎవ్రీ వన్. మీరు ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించిమాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది, అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. థాంక్ యూ రామ్. సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫారం చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి అలీగారి ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్ కి, టెక్నిషియన్స్ కి థాంక్స్. ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్ లో చాలా హార్డ్ టైమ్స్ వుంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. విష్ రెడ్డి ఛార్మి వెనుక నిల్చుంటాడు. విష్ మా పిల్లర్. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద వున్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని వుంటాడు. థాంక్ యూ విషు. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాల ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి వున్న ప్రేమ అభిమానంతో చేశారు. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గరపెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు.(నవ్వుతూ) లవ్ యూ సర్. సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్లి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా వున్నారు' అన్నారు.

నిర్మాత ఛార్మి మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్ కి ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తీస్తే ఇక్కడే ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తామని చెప్పాం. ఇస్మార్ట్ శంకర్ ని చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 15న మీ ముందుకు రాబోతోంది. పాటలు పెద్ద హిట్ చేశారు, ట్రైలర్ రెస్పాన్స్ చాలా బావుంది. ఆగస్ట్ 15న హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. లవ్ యూ ఆల్' అన్నారు.

పూరి కనెక్ట్స్ సిఈవో విష్ మాట్లాడుతూ..నమస్తే వరంగల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అందరి సపోర్ట్ వలన ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఛార్మి గారి సపోర్ట్ కి థాంక్స్. ఛార్మి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సంజయ్ బాబా ఐలవ్ యూ. ఆయనతో కలిసి పని చేయడం డ్రీం కం ట్రూ. రామ్ అన్న హ్యాట్సప్. సినిమా చూసిన అందరూ ఇదే మాట అంటారు. ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్ చేశారు. పూరి గారితో పని చేసే ప్రతి ఒక్కరూ మన సినిమా అని పని చేస్తారు. పూరిగారితో కలిసి వుండటం, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ ని సెలబ్రేట్ చేసుకుందాం' అన్నారు.

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. మీ అభిమానం చూస్తుంటే ఒక డ్రీం లా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో జన్నత్ లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరిగారికి చాలా థాంక్ యూ. ఛార్మి గారు చాలా కేరింగ్ చూసుకున్నారు. రామ్ గారితో కలిసిపని చేయడం హానర్. మార్ ముంత చోడ్ చింతా, స్టెప్పా మార్ లాంటి పాటలు చేయడం బ్లెస్సింగ్. రామ్ అమెజింగ్ పర్శన్. అలీ, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను అందరికీ పేరుపేరునా థాంక్స్. ఆగస్ట్ 15న సినిమా వస్తోంది. డబుల్ కామెడీ, డబుల్ యాక్షన్, డబుల్ మ్యాజిక్ లా వుంటుంది. మార్ ముంత చోడ్ చింతా' అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రామ్ గారి ఎనర్జీ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇందులో ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా చేశారు. పూరి గారు సినిమా అంటే బ్లాక్ బస్టర్. పూరి గారు డైలాగ్ రాస్తే చరిత్రలో వుండిపోద్ది. నాకు ప్రతి సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు బొకా. ఆ యాక్టర్ కథ ఏమిటనేది 15న చూస్తారు. సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు

గెటప్ శ్రీను మాట్లాడుతూ..ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ వైబ్స్ తో ఈ సినిమా వస్తోంది. డబుల్ డోస్ సినిమా వస్తోంది. పూరి గారికి ధన్యవాదాలు. ఛార్మి గారు చాలా సపోర్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్. అలీ అన్నతో కలసి పని చేయడం అనందంగా వుంది. అందరికీ పేరుపేరునా థాంక్స్. ఉస్తాద్ రామ్ గా ప్రతి సెకన్ కష్టపడ్డారు. ఆయన హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయిపోయాను. ఆడియన్స్ ఈ సినిమాకి డబుల్ బ్లాక్ బస్టర్ ఇస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.

టెంపర్ వంశీ మాట్లాడుతూ.. సినిమాలో థౌజెండ్ వాలా ఐదు నిముషాలు పేలుతుంది. కానీ రామ్ అన్న సినిమా అంతా పేలుతూనే వున్నారు. సూపర్ ఎనర్జీ. చిన్నప్పుడు పోయమ్స్ చదివాం. అవి ఇప్పుడు గుర్తుకు లేవు. కానీ పూరి గారు డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపొతాయి. ఈ సినిమాలో అలాంటివి చాలా వున్నాయి. ఆగస్ట్ 15 కుమ్మేద్దాం. థియేటర్స్ కి వచ్చేయండి. లవ్ యూ ఆల్' అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved