"Drinker Sai" will carry a meaningful message alongside commercial elements - Young Hero Dharma
"డ్రింకర్ సాయి" సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది - యంగ్ హీరో ధర్మ
Dharma and Aishwarya Sharma play the lead roles in the movie Drinker Sai, with "Brand of Bad Boys" as its tagline. Produced by Basavaraju Srinivas, Ismail Sheikh, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the film is directed by Kiran Tirumalasetti and is based on real events. Set for a grand theatrical release on the 27th of this month, Hero Dharma shared the highlights of Drinker Sai in a recent interview.
"I hail from Hanuman Junction in Guntur. From a young age, I was drawn to acting and dancing, often dancing to Megastar Chiranjeevi garu's songs. I participated in school plays, which gradually fueled my interest in films. My grandfather was an exhibitor and had a theater in Hanuman Junction. My father worked with producers like Kakani Babu Suhasani and Shobhan Babu on the movie Punya Dampatulu. An uncle once suggested that I get into filmmaking since my father was a producer, but my father didn’t want me to enter the industry. Despite having theaters, I worked there for a while and watched films every day, dreaming of the day I’d see myself on screen. After completing my engineering, I started my own business and saw profits. Eventually, I joined Satyanand Garu’s acting institute to pursue my passion for acting. My favorite actor is Prabhas due to his natural acting style, and I believe no other hero has Megastar Chiranjeevi’s grace in dance."
"I acted in Sindhuram, but Drinker Sai is my first film. I was excited when I first heard the story, which is based on real events. I even met the person whose life the story is inspired by and learned about his experiences. However, we’ve added some fictional elements to the story in our film."
"Pre-production for Drinker Sai started in 2019, and the shooting took place last year. Our director Kiran, who previously worked as a writer for Maruthi Garu, made some changes to the original story during the lockdown. He worked on this film with great dedication, and the shooting process was very smooth."
"Aishwarya Sharma, our heroine, is a dedicated actress. While many people get distracted by matters outside their work, Aishwarya remained focused and passionate about her role. Her portrayal of the character Baghi will impress everyone. I truly enjoyed acting alongside her."
"To prepare for my character as Sai, I observed many drinkers. I am not a drinker myself, but our director took me to several bars to observe their behavior. This helped me understand the body language of drinkers and how to portray it authentically."
"Producer Basavaraju Srinivas, a close friend of Chiranjeevi, once served as the general secretary of the PRP party. When I shared the movie's story with Chiranjeevi, he said, 'It’s good, proceed.' That’s how our movie received the blessings of Megastar Chiranjeevi. Drinker Sai blends commercial elements with a compelling love story and a strong message. To draw the audience to the theaters, we included youthful content in the trailer and teaser."
"My father was the first to appreciate Drinker Sai. He praised my performance for the first time, even though he is not part of the film industry. After watching the movie, he blessed me, saying that I will be successful in this field. The film will not mislead anyone about youth. People will understand its message after watching it. The story takes a powerful turn in the second half and will touch hearts by the pre-climax."
"After receiving training from Satyanand Garu, he blessed me, saying I would succeed as a hero. He even gave an interview about me, in which he shared many positive thoughts. I will always be grateful for his support. I’ve heard many stories now, and soon, I’ll share details about my upcoming project."
"డ్రింకర్ సాయి" సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది - యంగ్ హీరో ధర్మ
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "డ్రింకర్ సాయి" సినిమా హైలైట్స్ హీరో ధర్మ తెలిపారు.
- మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించాను. అలా క్రమంగా సినిమాల మీద ఇష్టం పెరిగింది. మా తాతగారు ఎగ్జిబిటర్. హనుమాన్ జంక్షన్ లో థియేటర్ ఉండేది. మా నాన్న కాకాణి బాబు సుహాసని, శోభన్ బాబు జంటగా పుణ్యదంపతులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేశారు. నాకు తెలిసిన అంకుల్ ఒకరు మీ నాన్న ప్రొడ్యూసర్ కదా నీతోనే సినిమా చేయమను అన్నారు. కానీ నాన్నకు నేను ఇండస్ట్రీలోకి వెళ్లడం ఇష్టం లేదు. మాకు కొన్ని థియేటర్స్ ఉన్నాయి. కొన్ని రోజులు ఆ థియేటర్స్ లో వర్క్ చేశా. రోజూ సినిమాలు చూస్తుండేవాడిని. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుందామా అని అనిపించేది. ఇంజినీరింగ్ చదివాక నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశా. లాభాలు చూశాను. ఆ తర్వాత సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. నా అభిమాన నటుడు ప్రభాస్. ఆయన నటన చూస్తే ఎంతో నాచురల్ గా ఉంటుంది. డ్యాన్సుల్లో చిరంజీవి గారి గ్రేస్ మరే హీరోకు రాదనేది నా అభిప్రాయం.
- నేను సింధూరం అనే సినిమాలో నటించాను. నేను ఒప్పుకున్న ఫస్ట్ మూవీ డ్రింకర్ సాయినే. అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యింది సింధూరం. ఇది నా రెండో మూవీ అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అయితే మా మూవీలో వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం.
- డ్రింకర్ సాయి సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. మొదట అనుకున్న కథకు లాక్ డౌన్ లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన మారుతి గారి దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. షూటింగ్ కంఫర్ట్ గా చేశాం.
- హీరోయిన్ ఐశ్వర్య శర్మ మంచి యాక్ట్రెస్. తను చాలా ఫోకస్డ్ గా నటించింది. చాలామంది తమ పని తప్ప మిగతా వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతుంటారు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ మూవీ గురించే ప్యాషనేట్ గా వర్క్ చేసేది. బాగీ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది.
- నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్ ను అబ్సర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్ కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది.
- ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు మిత్రులు. ఆయన పీఆర్ పీ పార్టీలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు. అలా మా మూవీ కథ గురించి చిరంజీవి గారికి చెబితే బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలా మా మూవీకి మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ దక్కాయి. డ్రింకర్ సాయి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్ ను థియేటర్స్ కు అట్రాక్ట్ చేయడం కోసం ట్రైలర్, టీజర్ లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం.
- డ్రింకర్ సాయి సినిమా చూసి మా నాన్న అప్రిషియేట్ చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ నన్ను మెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వద్దన్న నాన్న డ్రింకర్ సాయి సినిమా చూసి నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు అంటూ ఆశీర్వదించారు. మా సినిమా యూత్ ను ఎవ్వరినీ చెడగొట్టేలా ఉండదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుంటారు. సెకండాఫ్ నుంచి కథ మరో స్థాయికి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మీ హార్ట్ టచ్ చేస్తుంది.
- సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాక, నువ్వు హీరోగా మంచి పొజిషన్ కు వెళ్తావని దీవించారు. ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో చాలా మంచి మాటలు నా గురించి చెప్పారు. ఆయన చేసిన సపోర్ట్ మర్చిపోలేను. ప్రస్తుతం చాలా కథలు విన్నాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తా.