pizza

Mass Maharaja Ravi Teja, Karthik Gattamneni, TG Vishwa Prasad, People Media Factory’s Eagle Concept Poster Unveiled
మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగల్’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

12 November 2023
Hyderabad

Mass Maharaja Ravi Teja’s most-awaited intense and unique action thriller 'Eagle' directed by Karthik Gattamaneni under Tollywood’s leading production house People Media Factory is gearing up for Sankranti release. The previously released teaser that showed various shades of Ravi Teja went viral. Now They have released a concept Poster on the occassion of Diwali which looks unique & interesting.

Being a finest cinematographers Karthik Gattamneni who contributed his part for successful films like Karthikeya2, Dhamaka has shown his expertise in direction with his spectacular taking.

Ravi Teja appearance in the Poster looks interesting & the concept of the Poster justifies their movie title Eagle. The Mass Maharaja offered a mass massacre with his multiple get-ups, shades, and intense screen presence.

This visual extravanza Edited & Directed by Karthik Gattamneni. Dialogues are penned by Manibabu Karanam, who has earlier written for successful film Karthikeya2. For Eagle, he has written screenplay alongside Karthik Gattamneni.

The poster of this Pan India film is loaded with mass stuff that heightens the overall hype of the movie.

Under People media Factory banner Ace Producer TG Viswaprasad not compromised in backing to produce finest production values. The makers yet again clarified that Eagle will arrive in cinemas in all south Indian languages and Hindi on January 13th for Sankranthi, 2024.

Cast: Ravi Teja, Kavya Thapar, Anupama Parameshwaran, Navdeep, Srinivas Avasarala, Madhubala, Praneeta Patnaik, Ajay Ghosh, Srinivas Reddy, Bhasha, Siva Narayana, Mirchi Kiran, Nitin Mehta, Dhruva, Edward, Maddy, Zara, and Akshara

Technical Crew:
Edited and Directed by: Karthik Gattamneni
Producer: T.G Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
Written by: Karthik Gattamneni & Manibabu Karanam
Dialogues: Manibabu Karanam
Music Director: Davzand
Director of Photography: Karthik Gattamneni, Kamil Plocki & Karm Chawla
Production Designer: Srinagendra Tangala
Lyrics: Chaitanya Prasad, KK & Kalyan Chakravarthy
Executive Producer: Sujith Kumar Kolli
Action: Ram Laxman, Real Sathish & Tomek
VFX: Deccan Dreams

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగల్’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించి ఇప్పుడు దీపావళి పండగని పురస్కరించుకొని కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్ చాలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో రవితేజ ఎప్పిరియన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. పోస్టర్ కాన్సెప్ట్ సినిమా టైటిల్ ఈగల్ ని జస్టిఫికేట్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతోందనడంలో సందేహం లేదు.

ఇటివలే విడుదలైన ఈగల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. మాస్ మహారాజా రవితేజ డిఫరెంట్ గెటప్స్, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ తో అద్భుతంగా ఆలరించారు

అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. డేవ్ జాంద్ చేసిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల మాస్టర్ వర్క్ ఆకట్టుకుంది

మణిబాబు కరణం ఈ సినిమాకి మాటలు అందించారు. ఈగల్ చిత్రానికి కథనంలో దర్శకుడితో భాగం పంచుకున్న మణిబాబు కరణం గత ఏడాది అందరి మన్ననలు పొంది విజయం అందుకున్న ‘కార్తికేయ2’ కి సంభాషణలు సమకూర్చారు. ఈగల్ టీజర్ లో వినిపించిన “కొండలో లావాని కిందకి పిలవకు... ఊరు ఉండదు...నీ ఉనికి వుండదు ”అనే డైలాగ్ వైరల్ అవుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
మాటలు: మణిబాబు కరణం
సంగీతం: డేవ్ జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, కేకే, కళ్యాణ్ చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్
VFX: డెక్కన్ డ్రీమ్స్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved