8 February 2024
Hyderabad
Mass Maharaja Ravi Teja's most awaited stylish mass action entertainer 'Eagle', under the direction of Karthik Gattamneni is due for release tomorrow. The film is produced by TG Vishwa Prasad under Tollywood's leading production company People Media Factory, while Vivek Kuchibhotla is the co-producer.
Kavya Thapar and Anupama Parameswaran are the heroines. The already-released teaser, trailer and songs have received tremendous response. Meanwhile, director Karthik Ghattamaneni shared a few interesting aspects of 'Eagle' in the media interaction.
* You look so young and cool.. but everything in Eagle promotional content looks destruction. How is the movie Eagle going to be?
- There is destruction in the Eagle concept itself. It is a larger-than-life entertainer. The Eagle’s destruction is for society. That is kept in suspense for now. In this, the protagonist is a cotton farmer. But the problem he fights is international. It is also relevant to us. We enjoy movies like Rambo and Terminator a lot. This is an attempt to bring such a film. Eagle is an excellent action drama entertainer. This will definitely entertain the audience immensely.
* How did it feel to make such a big action film as a director?
-I like to do action films from earlier. But there are some limitations in career beginning. Now I am happy to get a chance to do a full-scale action movie with Eagle.
* When did you narrate Ravi Teja this story?
-I narrated this story while I was working as a cameraman for 'Dhamaka'. As soon as he heard the story, he said, "This is a good commercial film. Let's do it."
* How did you feel when Ravi Teja said 'I had done a role that I liked' at the pre-release event?
-Everyone knows that Ravi Teja is a brilliant actor. But sometimes due to commercial reasons, he has to do comedy, dance, action, and many other things in a movie. But in Eagle, he looks like a character. That difference will make sense to the audience. Being intense and cool is a different quality in him.
* Didn't give even any hints about the story and concept in the trailer... Have you tried any special screenplay for this?
-The secondary cast is very important to this story. We have explored the style of the protagonist through those characters. We tried styles like Virumandi, Rashomon, and Vikram. If the whole concept is told in advance, the excitement is lost. If you watch the trailer after watching the movie, you will understand that the concept is clearly revealed in the trailer itself.
* What are things that you learned from Ravi Teja?
-Ravi Teja's energy levels are high. But the most important thing to learn from him is discipline. He is a very disciplined actor. His food habits and sleeping hours are perfect. He lives a very happy life. He is a man with more self-control.
* Why is this movie titled Eagle?
-An eagle can see a rabbit below even if it is four kilometers high. In this, the hero has that eye power. Also, the code name of this character in the movie is Eagle. We tried the same title in Hindi as well. There is a movie with the same name in Bollywood. So, we are releasing it in Hindi with the character name of the protagonist 'Sahdev Varma'.
* What do you prefer between DOP and direction?
-I like storytelling. But accidentally became a cinematographer. I consider it a blessing.
* What is Navdeep's role? How are the characters of Anupama and Kavya going to be?
-Navdeep's role is very important. In the first half, Navdeep will be seen in a role that complements the hero's ideas. Navdeep will surprise us with his performance. He has very good memory power. Anumapa will be seen in the role that drives this story forward. Kavya's character is another reason for this story. Another small baby role is also crucial.
* What are the things that you find challenging while making Eagle?
There are many challenges in filmmaking while we go deep. With the experience we have, we think we can complete a sequence in five days. But it will not be done within the deadline. I thought I could complete the climax episode of Eagle in a week. But it took 17 nights. We tried all the real effects for it. In this process, I have troubled about four hundred people (laughs). It came out amazingly.
* The sound design of Eagle is very new. Tell us about the sound design of the movie.
-We did the Sound Design of Eagle for six months. All are the sounds produced in real. We shot with real guns in Europe and recorded that sound. We have taken a lot of care in the background music. If you see it in a good theatre with proper sound equipment, you can feel that experience. I've known DavZand for ten years and have very good journey with him.
* Mani Babu's dialogues are good? Is it your idea to take him for the movie?
-I did Karthikeya 2 with him. Since then, we have a good balance. His use of words is very good.
* How was it working with People Media Factory?
-People Media Factory has become like a home banner for me. They provided everything needed for the movie with a single phone call. Thanks to producers Vishwa Prasad and Vivek Kuchibhotla.
* What are your upcoming projects as a director?
-I am doing a film with Teja Sajja. We will announce that movie soon.
'ఈగల్' లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్ టైనర్. అద్భుతమైన యాక్షన్ డ్రామా ఆడియన్స్ ని చాలా గొప్పగా అలరిస్తుంది: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని 'ఈగల్' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
మీరు చాలా యంగ్ అండ్ కూల్ గా కనిపిస్తున్నారు.. కానీ ఈగల్ ప్రమోషనల్ కంటెంట్ లో అంతా విద్వంసం కనిపిస్తోంది? అసలు ఈగల్ ఎలా ఉండబోతుంది ?
-ఈగల్ కాన్సెప్ట్ లోనే విధ్వంసం వుంది. ఇది లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్ టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో కథానాయకుడు పత్తిపండించే రైతులా వుంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా వుండేది. మనకి కూడా రిలవెంట్ గా వుంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నం. ఈగల్ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్ టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు.
దర్శకుడిగా రెండో సినిమానే ఇంత పెద్ద యాక్షన్ చేయడం ఎలా అనిపించింది ?
-నాకు ముందు నుంచి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్ లో కొన్ని పరిమితులు వుంటాయి. ఇప్పుడు ఈగల్ తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది.
రవితేజ గారికి ఈ కథ ఎప్పుడు చెప్పారు ?
-రవితేజ గారితో 'ధమాకా' సినిమాకి కెమరామ్యాన్ గా పని చేస్తున్న సమయంలో ఈ కథ ఆయనకి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే ..''ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం'' అన్నారు.
నాకు నచ్చిన పాత్ర చేశానని రవితేజ గారు ప్రీరిలీజ్ ఈవెంట్ చెప్పడం ఎలా అనిపించింది ?
-రవితేజ గారు బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు కమర్షియల్ రీజన్స్ వలన ఒకే సినిమాలో కామెడీ డ్యాన్స్ యాక్షన్ ఇలా చాలా రకాలు చేయాల్సివస్తుంది. ఈగల్ లో మాత్ర ఆయన ఒక క్యారెక్టర్ లానే కనిపిస్తారు. ఆ తేడా చూసే ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఇంటెన్స్ గా ఉంటూ కూల్ గా వుండటం ఆయనలో డిఫరెంట్ క్యాలిటీ.
ట్రైలర్ లో కథ, కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ కూడా ఇవ్వలేదు కదా.. స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ప్రయత్నించరా ?
-ఈ కథకు సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యం. ఆ పాత్రల ద్వారా కథానాయకుడు ఎవరనే చెప్పే స్టయిల్ ని ఎక్స్ ఫ్లోర్ చేశాం. విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్సయిట్మెంట్ పోతుంది. సినిమా చూశాకా మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్ గా ట్రైలర్ లోనే చెప్పామని అర్ధమైపోతుంది.
రవితేజ గారి నుంచి ఏ విషయాలు గ్రహించారు ?
-రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్ గా వుంటాయి. చాలా ఆనందమైన జీవితం గడుపుతుంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ వున్న మనిషి.
ఈ సినిమాకి ఈగల్ అని పేరుపెట్టడానికి కారణం ?
-ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వున్నా కిందవున్న రాబిట్ ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా వుంది. దీంతో ఈ కథలో హీరో పేరు 'సహదేవ్ వర్మ' టైటిల్ తో హిందీలో విడుదల చేస్తున్నాం .
డీవోపీ, దర్శకత్వం రెండిటిలో ఏది ఇష్టపడతారు ?
-నాకు స్టొరీ తెల్లింగ్ ఇష్టం. అయితే డీవోపీ యాక్సిడెంటల్ గా జరుగుపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్ గానే భావిస్తాను.
నవదీప్ గారి పాత్ర ఎలా వుంటుంది ? అనుపమ, కావ్య పాత్రలు ఎలా వుంటాయి ?
-నవదీప్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో అలోచల్ని కాంప్లీమెంట్ చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తారు. నవదీప్ తన నటనతో సర్ ప్రైజ్ చేశారు. తనకి చాలా మంచి మెమరీ పవర్ వుంది. అలాగే అనుమప ఈ కథని ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తారు. కావ్య పాత్ర ఈ కథకు మరో కారణం. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా వుంటుంది.
ఈగల్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?
-ఫిల్మ్ మేకింగ్ లో లోతుగా వెళ్ళే కొలది సవాళ్ళు ఎదురౌతూనే వుంటాయి. మనకి వున్న అనుభవంతో ఐదు రోజుల్లో ఓ సీక్వెన్స్ ని పూర్తి చేసేస్తామని అనుకుంటాం. కానీ అనుకున్న సమయానికి ఫినిష్ కాదు. ఈగల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని వారం రోజుల్లో తీసేయొచ్చు అనుకున్నాను. కానీ అది 17 రాత్రుళ్ళు పట్టింది. దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్స్ ప్రయత్నించాం. ఈ క్రమంలో దాదాపు నాలుగువందల మందిని ఇబ్బంది పెట్టాను( నవ్వుతూ)
ఈగల్ సౌండింగ్ కొత్తగా అనిపిస్తోంది ? దాని గురించి ?
-ఈగల్ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్ గా ప్రోడ్యుస్ చేశాం. యూరప్ లో రియల్ గన్స్ తో షూట్ చేసి ఆ సౌండ్ ని రికార్డ్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్లో చూస్తే ఆ ఎక్సపీరియన్స్ ని ఫీల్ అవ్వొచ్చు. డేవ్ జాండ్ పదేళ్ళుగా తెలుసు. తనతో మంచి జర్నీ వుంది.
మణి బాబు డైలాగులు బావున్నాయి ? ఆయన్ని తీసుకోవాలనే ఆలోచన మీదేనా ?
-ఆయనతో నేను కార్తికేయ 2 చేశాను. అప్పటినుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మాకు మంచి బ్యాలెన్స్ కుదిరింది. తన పదప్రయోగం చాలా బావుటుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పని చేయడం ఎలా అనిపించింది ?
-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్ లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్ తో సమకూర్చుతారు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు.
దర్శకుడిగా మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ?
-తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం.