pizza

Eagle teaser: Ravi Teja is a man on a mission
మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగల్’ బ్లాస్టింగ్ టీజర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

6 November 2023
Hyderabad

Production house People Media Factory on Monday dropped the teaser of Ravi Teja-starrer Eagle. Captioning their post as ‘temperatures will soar upon his arrival’, the production house reiterated Sankranti (13 January) release date for the film.

The one-minute-34-seconds clip opens with Ravi Teja’s voiceover issuing a stern warning to his adversaries. “Kondalo lavani kindaki pilavaku… Ooru undadu…Nee uniki undadu…,” he thunders. He resides in forests, roams like a shadow but is visible to none. His bullet can travel wherever light pierces through (alluding to his role as a marksman). Clearly baffled with his story, a character played by Anupama Parameswaran asks whether he is a man or a myth. “He is a myth to the people, while his story is buried by the governments,” multiple characters played by Avasarala Srinivas and Madhoo say about him. Ravi, who seems to be a man on a mission, is finally revealed in a close up and his single snap leaves a trail of destruction. With a twirled moustache and long locks, he concludes the teaser, saying bon voyage.

Overall, the teaser is stylish, slick and establishes Ravi Teja’s character well. The dialogues add a lot of depth to Ravi’s role, while visually it looks stunning, with writer-director Karthik Gattamneni doubling up as a cameraman as well. There’s a lot of importance to action and if the teaser is a pointer, we can expect a riveting action thriller. Ravi Teja seems to be playing a character close to his age and he is at ease. Davzand’s background score adds edginess to the teaser.

The film also features Vinay Rai, Praneeta Patnaik, Ajay Ghosh, Srinivas Reddy, Bhasha, Siva Narayana, Mirchi Kiran, Nitin Mehta, Dhruva, Edward, Maddy, Zara, and Akshara in supporting roles.

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగల్’ బ్లాస్టింగ్ టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ డిఫరెంట్ షేడ్స్‌ని చూపించిన గతంలో విడుదల చేసిన గ్లింప్స్ వైరల్‌గా మారింది. సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.

“కొండలో లావని కిందకి పిలవకు... ఊరు ఉండడు...నీ ఉనికి వుండదు ” అంటూ రవితేజ పవర్‌ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ టీజర్‌ ఓపెన్ అయ్యింది. ప్రజలకు అపోహగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా హీరో చేసే విధ్వంసాన్ని విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. చివరిగా రవితేజ పవర్ ఫుల్ గా పరిచయమౌతూ డిఫరెంట్ అవతార్స్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దావ్‌జాంద్ చేసిన అద్భుతమైన స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఆత్యున్నతంగా వున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల మాస్టర్ వర్క్ ఆకట్టుకుంది.

క్లిప్ చివరిలో రవితేజ కనిపించనప్పటికీ టీజర్ మొత్తం తన మాస్ వైబ్ ని చాటుకున్నారు. మాస్ మహారాజా డిఫరెంట్ గెటప్‌లు, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా అలరించారు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల మధ్య సంభాషణ, నవదీప్ మాటలు రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. వినయ్ రాయ్ డెడ్లీ విలన్‌గా కనిపించారు. కావ్యా థాపర్‌ మరో కథానాయిక కాగా, మధుబాల కీలక పాత్రలో కనిపించనుంది.

కార్తీక్ గడ్డంనేని రచన, దర్శకత్వం, ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు.

మాస్ స్టఫ్‌తో లోడ్ చేయబడిన ఈ పాన్ ఇండియా చిత్రం టీజర్ సినిమాపై మరింత హైప్‌ను పెంచింది.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ గడ్డంనేని, మణిబాబు కరణం
సంగీతం: దావ్‌జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ గట్టమ్నేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
డైలాగ్స్: మణిబాబు కరణం
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, రెహమాన్, కళ్యాణ్ చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
కో-ఎడిటర్: ఉత్తర
కో-డైరెక్టర్: రామ్ రవిపాటి
సౌండ్ మిక్స్: కన్నన్ గణపత్ (అన్నపూర్ణ స్టూడియోస్)
సౌండ్ డిజైన్: ప్రదీప్. జి (అన్నపూర్ణ స్టూడియోస్)
కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్
స్టైలిస్ట్: రేఖ బొగ్గరపు
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్
పీఆర్వో : వంశీ-శేఖర్
VFX సూపర్‌వైజర్: ముత్తు సుబ్బయ్య

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved