‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా బతుకమ్మ పాటను లాంచ్ చేశారు. వివేక్ సాగర్ అద్భుతంగా స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రేయా ఘోషల్ వోకల్స్ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ పాట ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. నాకు మణిరత్నం గారి ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే’ పాట చాలా ఇష్టం. నా సినిమాల్లో కూడా అలాంటి ఒక పాట ఎప్పుడైనా చేయాలనుకునేవాడిని. ఫైనల్‌గా ఈ బడ్డీ కామెడీ సినిమాలో అలాంటి సిచువేషన్ కుదిరింది. ఇందులో ఒక ఫ్యామిలీ మీకు కొత్తగా కనిపిస్తుంది. ఆ కథకు ఈ ఫ్యామిలీకి ఏం సంబంధం అనేది మొదటి 15 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. సాంగ్ డ్యాన్స్ చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వివేక్ సాగర్ అద్భుతమైన పాట ఇచ్చారు. చంద్రబోస్ గారు మాకు ఎంతో గైడ్ చేశారు. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక సాంగ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే ఈశ్వర్ గారు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. చాలా మంచి డ్యాన్స్ ఉంటుంది. శివాత్మికను ఇందులో కీర్తన అనే పాత్రలో పరిచయం చేస్తున్నాం. తన డ్యాన్స్ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ప్రేక్షకులందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫెస్టివల్ సాంగ్. ఈ సినిమాలో ఈ పాట ఎందుకు ఉందనేది నవంబర్ 19న ఆడియన్స్ చూస్తారు. శ్రేయా ఘోషల్ గారితో పాట చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటివరకూ దాదాపు మూడు వేల తొమ్మిది వందలకు పైగా పాటలు రాశాను. అందులో నా పాటలను శ్రేయా ఘోషల్ గారు 250కి పైగా పాడారు. అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో బతుకమ్మ పాట మాత్రం చాలా వినూత్నంగా ఉంది. చాలా కొత్తగా పాడారు. మామూలుగా ఈ కాలం అమ్మాయిల్లో స్వేచ్ఛా ధోరణి, స్వతంత్ర దృక్పథం ఉంటాయి. అలాంటి అమ్మాయే ఇందులో కీర్తన పాత్ర. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ తనలోని కోరికలు, ఆశలు, ప్రశ్నలను బతుకమ్మతో ముచ్చటించుకోవడం, బతుకమ్మను అడగడమే ఈ పాట ఉద్దేశం, సారాంశం. ఈ పాటను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. చంద్రబోస్ గారు ఈ పాటను అద్భుతంగా రాశారు. అలాగే వివేక్ సాగర్ గారి మ్యూజిక్, ఈశ్వర్ గారి కొరియోగ్రఫీ, శ్రేయా ఘోషల్ గారి వాయిస్ ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. శివాత్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ పాటను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 19న సినిమా థియేటర్లకు వస్తుంది. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అద్భుతంగా ఉంది. ఇందులో పాటలను సినిమాగా చూస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియన్స్ చాలా ఆస్వాదిస్తారు. శివాత్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. వివేక్ సాగర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాకు ఇందులో బతుకమ్మ సాంగ్ ఫేవరెట్ అయిపోయింది. చంద్రబోస్ గారు ఈ పాట రాయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. శివాత్మిక డ్యాన్స్ అద్భుతంగా చేసింది. నవంబర్ 19న అందరూ హ్యాపీగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు.
శివాత్మిక మాట్లాడుతూ..నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ముందుగా ధన్యవాదాలు. అలాగే చంద్రబోస్ గారు ఈ పాట రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రేయా ఘోషల్ గారు పాడటం చాలా ఆనందంగా ఉంది. తరుణ్ భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు నా జీవితంలోకి ‘ఈ నగరానికి ఏమైంది’ రూపంలో కీర్తన పాత్ర వచ్చింది. మంచి పాత్రతో పాటు ఇలాంటి గొప్ప పాట కూడా దొరకడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు అందరూ సపోర్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నవంబర్ 19న థియేటర్లలో కలుద్దాం.
వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఏళ్ల నాటి అనుబంధం అన్నట్టుగా మా లైఫ్‌లోకి కూడా ఒక బతుకమ్మ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న మహిళలందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఒక కొత్త గ్యాంగ్ కూడా ఉంది. అది మీకు నవంబర్ 19న తెలుస్తుంది. శివాత్మిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. నవంబర్ 19న థియేటర్లలో కలుద్దాం.
అనిషా మాట్లాడుతూ..సాంగ్ అదిరిపోయింది. . సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 19న థియేటర్లలో కలుద్దాం.
నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. మిత్వా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బతుకమ్మ పాటతో ఎమోషన్ ఇంకా పెరుగుతుంది. శ్రేయా ఘోషల్ గారు, లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు, డ్యాన్సర్స్ అందరూ అద్భుతంగా చేశారు. ఇందులో బడ్డీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అందరూ నవంబర్ 19న థియేటర్లలో కలుద్దాం.
శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ.. ఇందులో చాలా స్పెషల్ రోల్ చేశాను. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఈ పాట పాడిన శ్రేయా ఘోషల్ గారికి అభినందనలు. చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు గెలుచుకుని మనందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన ఈ పాటను అద్భుతంగా రాశారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.