Vishwak Sen, Tharun Bhascker, S Originals and Rootnode Cinema’s Cult Sequel ENE Repeat One Month Schedule Underway In Thailand
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమాస్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’- థాయ్‌లాండ్‌లో జరుగతున్న నెల రోజుల షూటింగ్ షెడ్యూల్
Ee Nagaraniki Emaindi was a massive hit, and it struck a chord especially with the younger crowd, thanks to its raw honesty and effortlessly funny take on friendship and ambition. With time, the film only grew in stature, eventually earning cult status, a sentiment that was clearly evident when its re-release drew overwhelming response from fans. Building on that legacy, the much-awaited sequel ENE Repeat is presently underway with its shoot. Vishwak Sen, Abhinav Gomatam, and Venkatesh Kakumanu reunite, reviving the chemistry that made the first film so memorable, while Srinath Maganti is the new addition. At the helm once again is Tharun Bhascker, ensuring the same quirky storytelling flavor, while Srujan Yarabolu, and Sandeep Nagireddy are backing the project under S Originals and Rootnode Cinema.
The shoot of the movie is presently underway in Thailand, and will continue for a month. The picture from the set captures a breezy, easygoing moment, brimming with laid-back charm. The four boys- the “Team Kanyaraasi” gang, radiating effortless energy as they lounge in a vintage blue convertible. The frame beautifully fuses a retro vibe with the spirit of a modern-day bro trip.
Promising to recapture the same carefree spirit and chaotic fun, the film aims to take audiences back into the lives of the beloved gang. Adding to the excitement, the core team from the original is returning, bringing along a wave of nostalgia.
The sequel brings together a strong creative lineup to carry forward its distinctive flavor. Vivek Sagar provides the music. The visuals are crafted by AJ Aaron, while Raviteja Girijala oversees the editing. Sowmithri N comes on board as executive producer.
More updates on ENE Repeat are expected to be revealed soon.
Cast: Vishwak Sen, Srinath Maganti, Abhiinav Gomatam, Venktesh Kakumanu
Technical Crew:
Written & Directed by: Tharun Bhascker
Producers: Srujan Yarabolu, Sandeep Nagireddy
Production Houses: S Originals and Rootnode Cinema
Music: Vivek Sagar
DOP: AJ Aaron
Co-Director: Upendra Varma
Editor: Raviteja Girijala
Executive Producer: Sowmithri N
Line Producer: Srinu Irla
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమాస్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’- థాయ్‌లాండ్‌లో జరుగతున్న నెల రోజుల షూటింగ్ షెడ్యూల్
'ఈ నగరానికి ఏమైంది' భారీ విజయం సాధించింది, ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. స్నేహం, సరదా కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కల్ట్ స్టేటస్ పొందిన ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ సక్సెస్ ని కొనసాగిస్తూ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతోంది, ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. "టీమ్ కన్యారాసి" గ్యాంగ్‌కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు, వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ ఫ్రేమ్ రెట్రో వైబ్, మోడరన్ బ్రో ట్రిప్ స్ఫూర్తితో అందంగా కనిపిస్తోంది.
మొదటి భాగంలో ఉన్న కేర్‌ఫ్రీ స్పిరిట్, ఫన్‌ను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. ఒరిజినల్ టీమ్ తిరిగి కలవడంతో నాస్టాల్జియా కూడా యాడ్ అవుతోంది.
ఈ సీక్వెల్‌కు స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ కూడా తోడైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్, సౌమిత్రి ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘ఈఎన్ఈ రిపీట్’ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.