‘EPIC - FIRST SEMESTER’ ~ First Single “Sancharame” Strikes a Soulful Note - A Hesham Abdul Wahab Musical.
హృదయాలను తాకుతున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ తొలి గీతం 'సంచారమే'
The makers of EPIC - FIRST SEMESTER have unveiled the film’s first single “Sancharame,” a soulful track that beautifully captures the emotional journey of the lead characters.
Penned by renowned lyricist Goreti Venkanna, the song stands out for its pure Telugu poetry and heartfelt storytelling. The lyrics elegantly contrast the essence of desi roots and videshi life, perfectly aligning with the film’s narrative. Adding more depth to the composition, the track is melodiously sung by Hesham Abdul Wahab along with Goreti Venkanna, with music composed by Hesham Abdul Wahab.
Visually, the song presents stunning glimpses of London, blending vibrant international landscapes with the soulful charm of Telugu vocals. The pairing of Anand Deverakonda and Vaishnavi Chaitanya, who reunite after the blockbuster Baby, adds a charming presence on screen.
EPIC - FIRST SEMESTER marks the feature film directorial debut of Aditya Haasan and brings together a promising cast and crew. The film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios. Co-Produced by Venkat Upputuri & VMR.
The film promises to be a refreshing and emotionally rich soft love story that captures the innocence, conflicts, and unspoken emotions of young hearts.
More updates about the film will be revealed soon.
హృదయాలను తాకుతున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ తొలి గీతం 'సంచారమే'
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా 'సంచారమే'ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది.
ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు.
దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను, తెలుగు స్వరాల మాధుర్యాన్ని మిళితం చేస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఈ గీతముంది. బ్లాక్‌బస్టర్ “బేబీ” తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
'90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన తారాగణం, ప్రతిభగల సాంకేతిక బృందాన్ని ఒకచోట చేర్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'ను భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. యువ హృదయాల అమాయకత్వం, సంఘర్షణలు, మౌన భావాలను ప్రతిబింబించే సరికొత్త, మధురమైన ప్రేమకథకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.