pizza

Nithiin's Extra Film Second Single "Brush Vesko" Unveiled in Spectacular Event at CMR College
నితిన్‌, వ‌క్కంతం వంశీ, శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మూవీ ‘ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

10 November 2023
Hyderabad

The vibrant campus of CMR College played host to the grand launch of Nithiin's latest musical extravaganza, Brush Vesko. The funky and visually captivating song, featuring lyrics by the renowned Ramjogayya Sastry, vocals by the sensational Sanjith Hegde, and music by the maestro Harris Jayaraj, promises to be a chart-topping sensation.

Following the overwhelming success of the previous release Danger Pilla sung by the talented Armaan Malik, the film has already set high expectations. The teaser, characterized by its hilarity, showcases Nithiin in a unique avatar, portraying a junior artist in the industry.

Scheduled for a worldwide release on December 8th, 2023. EXTRA the upcoming film, is anticipated to redefine Nithiin's on-screen presence with a never-before-seen role. Director Vakkantham Vamsi assures audiences of an out-and-out entertainer, presenting a character-based storyline that is both engaging and delightful.

The musical brilliance of Harris Jayaraj adds an extra layer of excitement to EXTRA with the recently revealed single, Danger Pilla receiving widespread acclaim. Harris Jayaraj, known for delivering outstanding soundtracks, has once again weaved his magic for this film, promising a melodic treat for audiences.

Bankrolled by Sudhakar Reddy and Nikitha Reddy under the Sreshth Movies banner in collaboration with Aditya Movies and Entertainments and Ruchira Entertainments, EXTRA is a cinematic venture that is poised to capture hearts.

నితిన్‌, వ‌క్కంతం వంశీ, శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మూవీ ‘ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

* సీఎంఆర్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదలైన సాంగ్

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘బ్రష్ వేసుకో..’ అనే లిరికల్ పాటను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. దీనికి CMR కాలేజ్ వేదికగా మారింది. పాటను వింటుంటే చాలా హామింగ్‌గా అనిపించింది. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌తో హేరిష్ జైరాజ్ అందించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సంజిత్ హెగ్డే పాడారు. కచ్చితంగా చార్ట్ బస్టర్‌లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనిపించేలా మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ కనిపించని సరికొత్త అవతార్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారని, మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ మెప్పిస్తుందని రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌టం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. రీసెంట్ విడుద‌లైన డేంజ‌ర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved