Danger Pilla song frpm EXTRA (ordinary Man) film released
నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’.. ఆగస్ట్ 2న ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటోన్న ప్రోమో
హీరోయిన్ శ్రీలీలను చూసి హీరో నితిన్ ‘డేంజర్ పిల్ల..’ అని అంటున్నారు మరి. అసలు నితిన్‌ను అంతలా శ్రీలీల ఎందుకు భయపెట్టిందనే విషయం తెలుసుకోవాలంటే ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
టాలెంటెడ్ యాక్టర్ నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’. లైన్. రైటర్ - డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 23న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఆగస్ట్ 2న ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ సోమవారం రోజున విడుదల చేశారు.
మ్యూజికల్ జీనియస్ హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలోని ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌ను కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్ తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారు. క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ తర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.
శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.