pizza

Fauji prequel on cards
'ఫౌజీ' తరువాత 'ఫౌజీ' ప్రీక్వెల్' కూడా...

You are at idlebrain.com > news today >

09 October 2025
Hyderabad

It is well known that under the banner of Mythri Movie Makers, director Hanu Raghavapudi is making the film Fauji with Prabhas and Imanvi Ismail in the lead roles. The team has been very cautious to ensure that no details about this unique project leak out.

According to reliable sources, the shoot of Fauji is progressing at a brisk pace. The film is said to be a historical romantic drama set in the 1940s, with Prabhas playing the role of a soldier. It’s estimated that about 60% of the shoot has already been completed, while Prabhas still has around 35 days of filming left.

Reports suggest that a prequel to Fauji is also in the works. If all goes as planned, Mythri Movie Makers are aiming to release Fauji in August next year (2026).

The film’s music is composed by Vishal Chandrasekhar. Given Hanu Raghavapudi’s mastery in portraying delicate emotions, and the fact that this is a romantic story from Prabhas after a long time, there are huge expectations for Fauji among audiences and within the film industry.

'ఫౌజీ' తరువాత 'ఫౌజీ' ప్రీక్వెల్' కూడా...

'మైత్రీ మూవీస్' బేనర్లో హనూ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ మరియు ఇమాన్వీ హీరోహీరోయిన్లుగా 'ఫౌజీ' సినిమా నిర్మాణం అవుతున్న సంగతి తెలిసిందే. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా వివరాలు బయటకు ఎక్కడా పొక్కకుండా చూసుకుంటోంది చిత్ర యూనిట్. విశ్వసనీయ సమాచారం ప్రకారం 'ఫౌజీ' పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.1940 నేపథ్యంలో జరిగే హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా 'ఫౌజీ' తెరెకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సుమారు 60% శాతం షూటింగ్ పూర్తయినట్టు అంచనా. ప్రభాస్ కి ఇంకా 35 రోజుల షూటింగ్ పోర్షన్ మిగిలి వుంది. 'ఫౌజీ' సినిమా తరువాత 'ఫౌజీ ప్రీక్వెల్' కూడా ఉంటుందంటున్నారు. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 'మైత్రీ మూవీస్' సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు హనూ రాఘవపూడి సున్నితమైన భావోద్వేగాలను చిత్రీకరించడంలో సిద్ధహస్తుడు కావడంతో, చాలా కాలం తరువాత ప్రభాస్ నుండి ప్రేమ కథ కావడంతో 'ఫౌజీ' సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved