28 October, 2019
Hyderabad
యూత్ హీరో నాగ శౌర్య, బబ్లీ బ్యూటీ మెహరీన్ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకం పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతలుగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం 3 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ దీపావళి పండగ సందర్భంగా సంస్థ కార్యాలయంలో గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి అశ్వథ్థామ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. నూతన దర్శకుడు రమణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్టర్స్ తెలుగులో మొదటిసారిగా నాగశౌర్య సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫి చేస్తుండటం విశేషం.
పలు సూపర్ హిట్ చిత్రాలుకు మ్యాజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మనోజ్ రెడ్డి డీఓపీగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఛలో సెంటిమెట్ తో ఈరోజు మీడియాను కలుసుకున్నాం. ఈ సందర్భంగా ఐరా క్రియేషన్స్ నాగశౌర్య ప్రొడక్షన్ నెం.3 చిత్రానికి అశ్వథ్థామ అనే టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నాగశౌర్య ఈ తరహా కథ, కథనంతో సినిమా చేయలేదు. అందుకే ఫస్ట్ లుక్ ను విభన్నంగా ఉండేలా ప్లాన్ చేశాం. డైరెక్టర్ రమణ తేజ అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. శౌర్య అందించిన స్టోరీకి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు టాకీ పార్ట్ పూర్తయింది. ఒక పాట బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. టెక్నికల్ గా డీఓపీ మనోజ్ రెడ్డి, గ్యారీ, శ్రీచరణ్ పాకాల సపోర్ట్ ఈ సినిమాకు ఎంతో హెల్పయింది. యాక్షన్ పార్ట్ కథ ప్రకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కెజిఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు వర్క్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.
చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ చిత్రంతో డైరెక్టర్ గా రమణ తేజ పరిచయం అవుతున్నాడు. అమెరికాలో వర్క్ చేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నాగశౌర్య రియలిస్టిక్ స్టోరీని కథగా మలిచాడు. దాన్ని అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాడు. రియలిస్టిక్ సినిమా ఇది. సాంగ్ బ్యాలెన్స్ ఉంది. చిక్ మంగుళూరులో షూట్ ప్లాన్ చేశాం. దాదాపు 30 రోజులు యాక్షన్ షూట్ చేశాం. కెజిఎఫ్ కి స్టంట్స్ చేసిన అన్బు అరివు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చి మా సినిమాకు వర్క్ చేశారు. ఎడిటర్ గ్యారీ మాతో 60 రోజులు సెట్లో ఉండి ఎడిటింగ్ చేశారు. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.
రమణ తేజ - ఇది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. శౌర్య గారు రియల్ ఇన్సిడెంట్స్ నుంచి రాసుకున్నారు. నన్ను డైరెక్టర్ గా అనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐరా క్రియేషన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు కష్టం లేకుండా చేశారు. శౌర్య గారికి కాలుకు దెబ్బ తగిలింది. ఆయన డూప్ లేకుండా యాక్షన్ చేశారు. హీరో అంతగా ఇన్ వాల్వ్ అయ్యారు. నేను అమెరికాలో బోస్టన్ ఫిల్మ్ స్కూల్ లో చదువుకున్నాను. బుజ్జి గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎడిటిర్ గ్యారీ షూటింగ్ స్పాట్ లోనే ఉండి ఎడిటింగ్ చేశారు. రాసుకున్నది రాసుకున్నట్టుగా తీశాం అనుకుంటున్నాం.
ప్రతీ ఇంట్లో ఒక అశ్వథ్థామ ఉంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కుర్రాడి క్యారెక్టర్ హీరోది. మహాభారతంలో అశ్వథ్థామ ప్రాముఖ్యత ఎక్కువ. కానీ ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకున్నాం. కామన్ పర్సన్ కూడా కనెక్ట్ అయ్యే యాక్షన్ ఉంటుంది. కథను బట్టే యాక్షన్ ఉంటుంది. నాచురల్ ఫైట్స్ ఉన్నాయి. అవి చేయడంలో అన్బు అరివు స్పెషలిస్టులు. ఇందులో నాలుగు పాటలున్నాయి.
గ్యారీ మాట్లాడుతూ... కథ విన్న తర్వాత ఎలా రాసుకున్నారో అర్థం కాలేదు. అంత సెన్సిటివ్ లైన్ ఇది. విజువల్ ట్రీట్ ఉంటుంది. ఈ తరహా టెక్నికల్ ట్రీట్ మెంట్ ఎక్కడా చూడలేదు. ఈ సినిమా అందరికీ చాలా అవసరం. మెసేజ్ ఓరియెంటెడ్ కాదు. ప్రాబ్లం వస్తే కామన్ మ్యాన్ ఎలా రియాక్డ్ అవుతాడన్నదే సినిమా.
లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ... ఐరా క్రియేషన్స్ అశ్వథ్థామ టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు మీడియా సపోర్ట్ చాలా అవసరం. అని అన్నారు.
డీఓపీ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ... ఏది అడిగినా ఐరా క్రియేషన్స్ సపోర్ట్ చేసింది. శౌర్య, రమణ తేజ చాలా బాగా వర్క్ చేశారు. టెక్నికల్ గా చాలా బాగుంటుంది. అని అన్నారు.
నటీనటలు..
నాగశౌర్య, మెహరీన్, పోసానికృష్ణమురళీ, సత్య, ప్రొయరమణ, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్
సాంకేతిక వర్గం
మ్యూజిక్ః శ్రీచరణ్,
కెమెరాః మనోజ్‌రెడ్డి,
ఎడిటర్ : గారీ బిహెచ్,
ఆర్ట్‌డైరెక్టర్ః కిరణ్‌కుమార్ మన్నే,
కొరియోగ్రాఫర్ః రఘుమాస్టర్,
ఫైట్స్.. అన్బు అరివు
స్టోరీ- నాగశౌర్య,
స్క్రీన్ ప్లే- రమణతేజ, ఫణీంద్రబిక్కిన,
లైన్ ప్రొడ్యూసర్ - బుజ్జి
డైరెక్షన్- రమణ్‌తేజ,
ప్రొడ్యూసర్ - ఉషాముల్పూరి,
పిఆర్ ఓ - ఏలూరుశ్రీను.