16 April 2017
Hyderabad
Sukumar Writings’ “DARSHAKUDU” First look
Sukumar has unveiled the first look poster of his second film from his production house Sukumar Writings i.e., “DARSHAKUDU”, starring Ashok and Eesha in the direction of Hari Prasad Jakka,
Touted to be an entertaining love story, “DARSHAKUDU” has music by Sai Kartheek, editing by Navin Nooli and cinematography by Praveen Anumolu..
The film is being produced jointly by Sukumar, BNCSP Vijaya kumar, Thomas Reddy Aduri and Ravichandra Satti. Executive Producer Ramesh Kola.
సుకుమార్ రైటింగ్స్ 'దర్శకుడు' మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆదివారం సుకుమార్ విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్ తో కలిసి బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్ జక్కా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: నవీన్ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ కోలా.