“Funky will make everyone laugh uncontrollably,” says Mass Ka Das Vishwak Sen
'ఫంకీ' చిత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుంది: మాస్ కా దాస్ విశ్వక్ సేన్
Funky is arriving in theatres as a Valentine’s Day treat, bringing a shower of laughter to audiences. The film brings together Mass Ka Das Vishwak Sen, who has built a unique identity with diverse films, and director K.V. Anudeep, who has become a go-to name for comedy cinema. Presented by Srikara Studios, the film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas. Music is composed by Bheems Ceciroleo, and Kayadu Lohar plays the female lead.
Releasing on February 13, Funky has generated strong expectations among audiences. The already released teaser, trailer, and songs have been widely appreciated and have doubled the buzz. On Wednesday evening, the film’s team held a grand pre-release event at Lake View Club in Khammam.
Vishwak Sen said:
“Before every release, I feel a bit of tension. But before Funky, I am surprisingly calm. When our time is good and our films work, everyone supports us. Even though my last two films were slightly disappointing, I am deeply grateful to everyone who stood by me and supported me. I will never forget your love. In life, we sometimes fall down. Falling is not a mistake; not getting back up is. Because of your love, I am standing here today. You will enjoy Funky thoroughly.
When I was going through a rough phase, this wonderful film came to me. It felt like it was sent by God. I thank director Anudeep garu and producer Naga Vamsi garu for giving me such a good film. Special thanks to Chinababu garu, who closely oversaw everything for this movie.
Everyone who comes to the theatre will laugh a lot watching this film. My pairing with Kayadu Lohar has worked beautifully. She is very talented and hardworking. She has a bright future ahead.
Two years ago, the pre-release event of Ashoka Vanamlo Arjuna Kalyanam also happened in Khammam. I believe that same sentiment will continue with Funky. The film will entertain every member of the family. See you in theatres on February 13. This film will not disappoint you at all.”
Kayadu Lohar said:
“I don’t even have words to express the love you are showing us. Thank you for the amazing response to the Funky teaser, trailer, and songs. Please watch Funky in theatres on February 13. You will definitely like it. There will be Anudeep garu’s signature style of comedy. I am happy to have worked with Vishwak Sen. Thank you to Naga Vamsi garu for giving me this opportunity. I hope you shower love on the character I played in this film.”
Director K.V. Anudeep said:
“Greetings to everyone. Funky is a complete family entertainer. You can go to the theatre with your family and enjoy it from start to finish. I am happy to have worked with Vishwak Sen and Kayadu Lohar. Thanks to Jagan garu, who co-wrote the script with me, and cinematographer Suresh garu. Bheems has given wonderful music. I am grateful to producer Naga Vamsi garu for giving me this opportunity. Please watch and support our film releasing on February 13.”
Music director Bheems Ceciroleo said:
“I studied in Madina College in Khammam. I used to travel by train from Mahabubabad to Khammam, singing songs and writing poems. Today, the songs I wrote and composed here are being heard across continents. People are singing, dancing, and whistling to them. My heartfelt thanks to Khammam district, the people of Khammam, and everyone who encouraged me.
Funky is a full family entertainer. Everyone who watches it will say it’s very good. You can go with friends or family and have a great time laughing together. You will laugh throughout the film. I enjoyed every scene while composing the background score. I personally loved the film a lot.
After watching Jathi Ratnalu, I wanted to make a film like that and work with such a director. I got this opportunity through director Kalyan Shankar of MAD. This is my fourth film with Sithara Entertainments — starting with MAD, then MAD Square, Mass Jathara, and now Funky. I hope to do many more films with Sithara.
Thanks to Naga Vamsi garu, Chinababu garu, Sai Soujanya garu, and Trivikram garu. I hope I get more chances to work with Vishwak Sen. Anudeep garu is a man of values and humanity. He stands by his word and supports people in difficult times. My wish to work with him has come true with Funky.”
Amid huge enthusiasm from the youth, the event was conducted in a grand manner. Singer Rohini Sorat, lyricist Dev Pawar, Aditya Music’s Niranjan, actors Ravi Anthony, Mahipal, Pawan, Raghava Ram, and others attended and wished Funky a big success.
Film: Funky Cast: Vishwak Sen, Kayadu Lohar, Naresh, VTV Ganesh, and others Director: K.V. Anudeep Producers: Suryadevara Naga Vamsi, Sai Soujanya
Music: Bheems Ceciroleo
Editing: Naveen Nooli
Cinematography: Suresh Sarangam
Writers: K.V. Anudeep, Mohan
Art Director: Jonny Shaik
Production Houses: Sithara Entertainments, Fortune Four Cinemas
'ఫంకీ' చిత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుంది: మాస్ కా దాస్ విశ్వక్ సేన్
ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించడానికి వస్తున్న చిత్రం 'ఫంకీ'. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.."ప్రతి సినిమా విడుదలకు ముందు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ ఫంకీ విడుదలకు ముందు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. మన టైం బాగున్నప్పుడు, మన సినిమాలు బాగా ఆడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ, నా గత రెండు చిత్రాలు కాస్త నిరాశపరిచినప్పటికీ.. నాతో పాటు నిల్చొని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మీ ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. జీవితంలో అప్పుడప్పుడు పడిపోతుంటాం. పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడం తప్పు. మీ అందరి ప్రేమ వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. ఫంకీ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పరిస్థితులు బాలేని సమయంలో ఇంత అద్భుతమైన సినిమా నా దగ్గరకు వచ్చింది. ఆ దేవుడే పంపించాడు అనిపించింది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు అనుదీప్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. చినబాబు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో ఆయన దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ సినిమా విపరీతంగా నవ్విస్తుంది. కయాదు లోహర్ తో నా జోడి చక్కగా కుదిరింది. తనలో ఎంతో ప్రతిభ ఉంది, కష్టపడే తత్త్వం ఉంది. కయాదుకి మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం నేను నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలోనే జరిగింది. ఇప్పుడు ఫంకీకి ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని అలరించేలా ఫంకీ ఉంటుంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు" అన్నారు.
కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.."మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు మాటలు కూడా రావడంలేదు. ఫంకీ టీజర్, ట్రైలర్, పాటలకు మీరిచ్చిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న థియేటర్లలో ఫంకీ సినిమాను చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అనుదీప్ గారి శైలి కామెడీ ఉంటుంది. విశ్వక్ సేన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమాలో నేను పోషించిన చిత్ర పాత్రపై ప్రేమ కురిపిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం. ఫంకీ సినిమా గురించి చెప్పాలంటే ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్ళి.. ప్రారంభం నుంచి చివరి వరకు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నాతో కలిసి స్క్రిప్ట్ రాసిన జగన్ గారికి, కెమెరామ్యాన్ సురేష్ గారికి థాంక్స్. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ఈ అవకాశమిచ్చిన నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.."నేను ఖమ్మంలోని మదీనా కాలేజ్ లోనే చదువుకున్నాను. మహబూబాబాద్ నుంచి ఖమ్మంకు ట్రైన్ లో వచ్చేవాడిని. అప్పుడు ఎన్నో పాటలు పాడేవాడిని, ఎన్నో కవితలు రాసేవాడిని. నేను ఇక్కడ నుంచి రాసిన పాటలు, ఇక్కడ నుంచి స్వరపరిచిన పాటలు ఖండాంతరాలు దాటి మారుమోగిపోతున్నాయి. అందరూ పాడుతున్నారు, డ్యాన్స్ లు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు, ఖమ్మం ప్రజలకు, నన్ను ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు. ఫంకీ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూసిన ప్రతి ఒక్కరూ భలే ఉంది సినిమా అంటారు. స్నేహితులతో, కుటుంబం సభ్యులతో కలిసి సినిమాకి చూసి సరదాగా నవ్వుకోవచ్చు. సినిమా అంతా కడుపుబ్బా నవ్వుతూనే ఉంటారు. నేపథ్యం సంగీతం చేసేటప్పుడు ప్రతి సన్నివేశం ఆస్వాదించాను. సినిమా నాకు చాలా చాలా నచ్చింది.
జాతిరత్నాలు చూసినప్పుడు ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, ఇలాంటి దర్శకుడితో పని చేయాలి అనుకున్నాను. మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఇది నాకు నాలుగో సినిమా. మ్యాడ్ తో మొదలై మ్యాడ్ స్క్వేర్, మాస్ జాతర, ఇప్పుడు ఫంకీ చేశాను. సితార బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. నాగవంశీ గారికి, చినబాబు గారికి, సాయి సౌజన్య గారికి, త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. విశ్వక్ సేన్ గారితో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అనుదీప్ గారు మానవత్వం, విలువలు ఉన్న వ్యక్తి. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడతారు. అనుదీప్ గారితో సినిమా చేయాలన్న నా కోరిక ఫంకీతో నెరవేరింది." అన్నారు.
యువత కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకలో గాయని రోహిణి సోరట్, గీత రచయిత దేవ్ పవార్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, నటులు రవి ఆంథోనీ, మహిపాల్, పవన్, రాఘవ రామ్ తదితరులు పాల్గొని 'ఫంకీ' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.