pizza

Parvati in "Game Changer" is the Best Role of My Career: Anjali
‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

You are at idlebrain.com > news today >

06 January 2025
Hyderabad

Global Star Ram Charan's pan-India biggie Game Changer is set for a massive theatrical release on January 10, kickstarting the Sankranthi festive season. This Shankar directorial is releasing in Telugu, Tamil, and Hindi. Presented by Smt. Anita, the film is bankrolled by Dil Raju and Sirish under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Productions, and Zee Studios. As a part of promotions, one of the film's female leads, Anjali, had a chit-chat with the media. Here are excerpts:

Q. You are having two releases this Sankranthi. How are you feeling?
Anjali: Feeling very happy. I just got to know about my other film's release as well. Sankranthi is a big season for any actor. On top of it, I acted alongside big heroes like Ram Charan and Vishal in those movies. Both films got a good response. I am looking forward to people seeing it.

Q. Tell us more about your character in the movie.

Anjali: When the story was narrated to you, they told you that your character's name is Parvati. My mother's name is Parvati Devi. Sometimes, we get connected on a few factors, right? Game Changer is also a special film in my career, and I put a lot of hard work into it. So, in that way, I got connected to it.

Q. What kind of hard work did you put into the film?
Anjali: I can't reveal it because, as Shankar sir said, there is a surprise in the movie. But I can say that my character was challenging, and it took a lot out of me during a few days of shooting. Sometimes, I used to take the character home. Such was its effect on me. In my 18 years of career, Parvati from Game Changer will be special for many reasons.

Q. As per inside talk, you may win a National Award this year for this movie. What are the challenges you faced while doing this film?
Anjali: First of all, thank you for the kind words. I thought I would win an award for my performance. I am now happy that people who watched the film are also believing the same. Let's hope for the best. Coming to the challenges, there are many I faced while shooting for this movie. Generally, we act as per our real experiences most of the time. Coming to Parvati, there are many shades of this character. Some of the things that Parvati goes through I didn't experience in my life. So, I had to work hard on them.

Q. There is a lot of talk about Appanna's character in the movie. What will be your character's journey with that character?
Anjali: I am playing Appanna's wife in the movie. Their bond and their relationship are shown beautifully. More than that, there are many surprises about these characters that were not shown in the trailer and should be experienced in theatres. But I can say that the bond between Appanna and Parvati will be the core of the film.

Q. Your pair looked very good in the trailer. How was it working with Charan, and how will the combination scenes between you both be in the movie?
Anjali: Charan is the best co-star. I believe that if my co-star gives a positive energy and vibe, I will give my best and vice versa. Charan is one such person. He is very silent but very good at heart. He respects everyone on the set, from the lightman to the director.

Q. How did you feel when you got an offer to work with Ram Charan?
Anjali: There are many reasons for me to feel happy about working on this movie. First of all, it is Shankar sir's film. I got a chance to work with Charan for the first time and under Dil Raju garu's production once again. We always thought of making our pair good on screen. And we feel happy that our pair is getting a good response.

Q. 12 years back, you had a Sankranthi release under the same banner in the form of Seethamma Vaakitlo Sirimalle Chettu. Now, how are you feeling to return on Sankranthi after all these years with a Shankar's film? Have you ever thought of working with him?
Anjali: I never expected it. I always wanted to work under Shankar sir and Mani Ratnam garu for a long time. Dil Raju's banner is like a home production for me. Be it Seethamma Vaakitlo or Vakeel Saab, both are beautiful films. Coming to Game Changer, the character I played in this movie will not only remain the best in my films under Dil Raju garu's banner but also in my entire career.

Q. Among Telugu heroines, you got a chance to work with big personalities like Shankar and Ram Charan. How do you feel about it?
Anjali: I feel extremely proud and happy not only for myself but for all Telugu aspiring heroines. Believe in yourself and keep working hard. There is always a route that can get you through. I believe in my choice of scripts. Game Changer also I liked the script and signed it immediately.

Q. Every actor has a dream role. Is Parvati from Game Changer one such role for you?
Anjali: I never had dream roles. But I would have dreamt of a role like Parvati from Game Changer if I ever had a dream role.

Q. Were you afraid of Shankar while working with him, as there is stress while working with your favourite directors?
Anjali: Shankar sir is not such a person. He is very normal, and all he thinks about is the shot he is shooting at that point. As you said, I was a bit afraid on the first day of working with him, but he made me feel comfortable right from the start. Such a wonderful person he is.

Q. What is the toughest and most memorable scene for you in Game Changer?
Anjali: I can't reveal it now. But while watching the film, if you feel a particular scene might be tough or memorable for me, consider it as my answer (laughs).

Q. Will Parvati's character be the game-changer in Game Changer?
Anjali: In a way, yes. If you have watched the team interview, we conveyed the same. But watch the rest in the film.

Q. How will the "Arugu Meeda" song be visually on screen?
Anjali: It will be incredible. You liked the song, right? You will love the visuals even more.

Q. You have worked with Pawan Kalyan and Ram Charan. When are you doing a film with Chiranjeevi?
Anjali: I will ask Chiranjeevi garu when I meet him (laughs). I think it is high time now.

Q. You and Ram Charan played characters beyond your age. How did you feel about it?
Anjali: Actually, both of us loved our characters to the core. Charan garu loved the Appanna character a lot. We had great coordination, and all credit goes to Charan for giving me that space. You will feel the same while watching our scenes in the theatres.

Q. What was your feeling when you saw Ram Charan for the first time in Appanna's getup and yourself in Parvati's getup?
Anjali: I felt it was new right after the look test. Most of the roles I did were girl-next-door roles or roles without makeup. For this film, I wear a bindi and apply turmeric, just like a woman from the 90s. Shankar sir's idea was to make it more realistic. He was the one who designed the looks of all the characters.

Q. How was it working in Dil Raju's production once again?
Anjali: I feel very happy. Working in Dil Raju garu's production is very comfortable. He is known for making good films, and as an actor, I feel privileged to work in his movies.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..

సంక్రాంతికి మీ రెండు చిత్రాలు వస్తున్నాయి? దాని గురించి చెప్పండి?
ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

గేమ్ చేంజర్‌లో మీ కారెక్టర్ గురించి చెప్పండి?
గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. కారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.

మీ పాత్ర కోసం మీరు చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి?
పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంకా నేను ఆ కారెక్టర్‌ గురించి ఎక్కువగా చెప్పకూడదు. అది థియేటర్‌లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ కారెక్టర్.

మీ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు?
నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి.

ఈ పాత్రను పోషించడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?
బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్‌, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

అప్పన్న పాత్రతో మీ జర్నీ ఎలా ఉండబోతోంది?
శంకర్ గారు నా పాత్ర గురించి చాలానే చెప్పారు. నా పాత్రలో చాలా సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయొద్దనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు. నా పాత్రను తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

రామ్ చరణ్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది?
రామ్ చరణ్ గారు తన కో స్టార్స్‌కు కంఫ్టర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ బాగా ఉంటారు. అందరితోనూ చక్కగా మాట్లాడతారు. దిల్ రాజు గారి బ్యానర్, శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ గారితో మొదటి సినిమా కావడంతో నాకు ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రత్యేకం. శంకర్ గారు, మణిరత్నం గారి చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. నాకు శంకర్ గారి చిత్రంలో ఛాన్స్ రావడం ఆనందంగా అనిపించింది.

గేమ్ చేంజర్ మీ లైఫ్‌కు గేమ్ చేంజర్ అవుతుందా?
గేమ్ చేంజర్ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.

రామ్ చరణ్ గారితో మీరు చేసిన సాంగ్ గురించి చెప్పండి?
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశాం. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నాకే కాకుండా టీం అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట. తమన్ నాకు ఇచ్చిన బలుపు, వకీల్ సాబ్ ఇలా అన్ని పాటలు ఎవర్ లాస్టింగ్‌గానే ఉంటాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఎవర్ లాస్టింగ్‌గా నిలుస్తుంది.

దిల్ రాజు గారి నిర్మాణంలో మళ్లీ నటిస్తుండటం ఎలా ఉంది?
దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి చిత్రం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved