pizza

Global Star Ram Charan's "Game Changer" first single 'Jaragandi' on his birthday
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి సందడి చేయనున్న తొలి సాంగ్ ‘జరగండి’

You are at idlebrain.com > news today >

26 March 2024
Hyderabad

Game Changer is an exciting upcoming bilingual action film that features the incredibly talented Ram Charan as the lead actor. What makes this film even more special is that it marks Ram Charan's direct Tamil debut, where he will be portraying a dual role. Directed by renowned filmmaker Shankar, known for his groundbreaking movies, this film takes a different direction as it is based on a story written by another filmmaker, Karthik Subbaraj.

The movie also stars the beautiful Kiara Advani as the female lead, and it's their second collaboration after the film Vinaya Vidheya Rama. Alongside Ram Charan and Kiara Advani, the film boasts an impressive ensemble cast that includes Anjali, SJ Suryah, Jayaram, Sunil, Srikanth Meka, Samuthirakani, Nassar, Naveen Chandra, and Rajeev Kanakala in significant roles.

To add to the excitement, the makers of Game Changer recently announced that the much-awaited song 'Jaragandi' will be released on March 27th at 9 AM in a grand and extravagant manner. This news came as a special treat for fans on the occasion of Ram Charan's birthday.

There is another special delight to mega fans as Jaragandi song will be screened in theatres across the nation where Ram Charan's blockbuster film Magadheera is screening tomorrow. It is known that Ram Charan's mega film Magadheera is releasing again in more than 150 plus theatres to take viewers to a memorable ride.

Produced by Dil Raju and Sirish under Sri Venkateswara Creations, in association with Zee Studios, The film's music and background score are composed by the talented S Thaman, while Tirru is the cinematographer and Shameer Muhammed is working on the editing.

Expectations are high on Game Changer as Ram Charan is playing the powerful roles of father and son and already the visuals and the promotions from the film increased the curiosity levels among movie lovers. With such an impressive cast and crew, a unique storyline, and the collaboration of exceptional talents, Game Changer promises to be a thrilling political drama that will surely captivate audiences in both Tamil and Telugu languages. Ram Charan is doing pan India films after the stardom he attained globally with RRR.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి సందడి చేయనున్న తొలి సాంగ్ ‘జరగండి’

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడసాగారు.సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మూవీని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

గొప్ప సినిమాలను అందించాలనే తపనపడి, ఎంతటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధపడే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ తోడు కావటంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతం అని అందరూ మెచ్చుకోవాలనేలా సినిమాలు తీయటం శంకర్ అలవాటు. రామ్ చరణ్‌కి వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి..’ అనే పాటను విడుదల చేస్తున్నారు. 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు:
రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం:
సమర్పణ-శ్రీమతి అనిత, బ్యానర్స్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీస్టూడియోస్, నిర్మాతలు - దిల్ రాజు, శిరీష్, సినిమాటోగ్రఫీ - తిరుణ్ణావుక్కరసు, సంగీతం - ఎస్.ఎస్.తమన్, యాక్షన్ - అన్బరివు, కథ - కార్తీక్ సుబ్బరాజు, డైలాగ్స్ - సాయి మాధవ్ బుర్రా, ఆర్ట్ - అవినాష్ కొల్ల, రామకృష్ణ, మోనిక, కొరియోగ్రఫీ - ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండి, పాటలు - రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, వి.ఎఫ్.ఎక్స్ - శ్రీనివాస్ మోహన్, ఆడియో - సరిగమ మ్యూజిక్, పి.ఆర్.ఓ - నాయుడు సురేంద్ర కుమార్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved