Melodious Chartbuster "Naanaa Hyraanaa" Will Be Added To Game Changer From Today
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘గేమ్ ఛేంజర్’కు ‘నా నా హైరానా’ పాటను జోడించిన చిత్రయూనిట్
Global Star Ram Charan's most-anticipated film Game Changer emerged as the first blockbuster of Indian cinema in 2025. Directed by Shankar, Game Changer was released on January 10 and opened to a super-positive response from viewers. With humongous collections and rave reviews, Game Changer is setting the box office on fire.
Adding to the hype, the makers have introduced the chartbuster Naanaa Hyraanaa to the film from today. The Hindi version 'Jaana Hairaan Sa' and Tamil version 'Lyraanaa' will also be available in theatres starting today in their respective language versions.
Sung by Karthik and Shreya Ghoshal, Naanaa Hyraanaa is a soothing melody composed by S. Thaman. The lyrics were penned by "Saraswatiputra" Ramajogayya Sastry. It is a fusion of Western and Carnatic sounds, offering a melodious appeal to the audience. Vivek wrote the Tamil lyrics, while Kausar Munir crafted the Hindi version.
The song is a visual spectacle shot in New Zealand over five days. It is also the first Indian song to be filmed using an "Infrared Camera," known for bringing out vivid colours and creating a dreamlike sequence. Bosco Martin served as the choreographer for this track.
The on-screen chemistry between Ram Charan and Kiara Advani promises to be a visual treat for audiences. The melodious track, combined with stunning visuals, is set to captivate viewers in theatres starting today.
Game Changer features Ram Charan in a dual role, as a powerful IAS officer and an honest social reformer. Anjali, SJ Suryah, Srikanth, Samuthirakani, Naveen Chandra and others played important roles in it. Dil Raju and Sirish bankrolled the film under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Produtcions and Zee Studios. SVC Adityaram Movies produced the Tamil version. AA Film's Anil Thadani handles the Hindi release.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘గేమ్ ఛేంజర్’కు ‘నా నా హైరానా’ పాటను జోడించిన చిత్రయూనిట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ విజయవంతంగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ఈ చిత్రంలో మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సాంకేతిక కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను జోడించలేకపోయాని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే నేటి నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు. సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుంది.
రామ్ చరణ్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయి ఓ వైపు స్టైలిష్‌గా, మరో వైపు పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చరణ్-ఎస్.జె.సూర్య మధ్య ఉండే ఎగ్జయిటింగ్ సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్-కియారా కెమిస్ట్రీ, అంజలి అద్భుతమైన నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పంథాలో గేమ్ చేంజర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండర్ మూవీగా ఆవిష్కరించారు.
గేమ్ చేంజర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, తిరు ఎక్స్‌ట్రార్డినరీ విజువలైజేషన్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.