pizza

Game Changer pre release event in Rajahmundry
”Ram Charan Grows Humbler with Success”: Deputy CM Pawan Kalyan Wishes 'Game Changer' to Shatter Box Office Records
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

You are at idlebrain.com > news today >

04 January 2025
Hyderabad

Global Star Ram Charan teamed up with renowned filmmaker Shankar for the high-budget political action-drama Game Changer. Kiara Advani plays the female lead in it. The film was presented by Smt. Anita and produced by Dil Raju and Sirish under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Productions, and Zee Studios.

Game Changer is slated for a worldwide release on January 10. Ahead of its release, the makers hosted a grand pre-release event in Rajahmundry on January 4. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan attended the event as the chief guest. The state's cinematography minister Kandula Durgesh, MLAs Gorantla Buchaiah Chowdary, Adireddy Vasu, Bathula Balaram, Kolikapudi Srinivas, MLC Hari Prasad, and KUDA chairman Thummala Babu graced the event with their precious presence.

The film's cast and crew, including Global Star Ram Charan, director Shankar, producers Dil Raju and Sirish, music director Thaman, lyricists Ramajogaiah Sastry, Ananta Sriram, Kasarla Shyam, dialogue writer Sai Madhav Burra, actors Naveen Chandra, Anjali, Srikanth, Pruthvi and Racha Ravi graced the event. The other guests include director Sujeeth and producer Hanshitha.

Speaking at the event, Pawan Kalyan said, "My warm greetings to everyone who attended this Game Changer's event. Greetings to everyone who is watching the event on various mediums. Greetings to Pawan Kalyan fans too (smiles). We cannot forget our film industry's pillars like Raghupathi Venkaiah Naidu, Dadasaheb Phalke, Satyajit Ray, and Raj Kapoor. We cannot forget the pride of Telugu cinema NT Rama Rao garu, ANR garu, BN Reddy garu, and Ramabrahmam garu. If there is Pawan Kalyan or Ram Charan today, it is Chiranjeevi garu. You might call me Kalyan Babu or OG or Deputy CM, but Chiranjeevi garu was the one who is the reason behind all this. We are able to hold this event here only because of the support of honorable Chief Minister Nara Chandrababu Naidu garu. I also thank Home Minister Anita garu, the state DGP, and the entire district force who were relentlessly working over the last four days to organize this event. My greetings to the ministers and MLAs who attended this event. I watched Shankar garu's Gentleman in Chennai. I watched his Premikudu along with my grandmother. He makes films with a strong social message. Today, people like Ram Charan garu, Rajamouli garu, and Jr NTR garu took Indian cinema to a global level. A few Southern directors were the foundation of this success. Shankar garu is one among them. Telugu people owned Shankar garu's films. I always wanted to see him make a straight Telugu film. I feel happy that he is now debuting with Game Changer. Coming to Dil Raju garu, he distributed my Tholi Prema. When I was in trouble, he gave me Vakeel Saab. In fact, he was an engine that helped to run the Jana Sena party. Our family members are the devotees of Lord Hanuman. When Chiranjeevi garu had a son, our father thought a lot and named him Ram Charan. It means the one who serves at Lord Rama's feet, i.e., Lord Hanuman. No matter how strong he is, he remains calm and loyal. Charan is such a personality. Chiranjeevi garu is like a father figure to me. I am not Ram Charan's uncle, but he is like my younger brother. I thought he would win an award for his film Rangasthalam. Even though he was not born or raised in the Godavari region, he performed that role with utmost perfection. While the father is Mega Star, the son became the Global Star. With perseverance and hard work, one can reach the level of a Mega Star. I am here because of the hard work of Chiranjeevi garu. Back then, he used to come back home tired after his shoots. I used to be at home at that time. Whenever he comes back, I used to remove his shoes and socks and clean his legs. We never thought ill of any actors. Our father taught us to believe in 'Sarvejana Sukhinobhavanthu.' We pray for everyone's well-being. I feel jealous of Charan's horse-riding skills. I don't know horse riding. Despite telling the fact, I was given a horse-riding scene in Gabbar Singh. I went to the horse and fed it with a carrot. It later made me travel safely during the shoot. Charan is not like that. He is a trained horse rider. I watched Game Changer's trailer, and I liked it. The film packs a strong social message. Everyone who attended the event should go back home safely. We would be hurt if something happens to you. Ticket rates depend on demand and supply. Telugu film standards have increased. There is a GST on every ticket. The government earns through ticket sales. People from all industries are uniting to make films. Instead of following Hollywood films, we should make films with our roots. Even NT Rama Rao garu never showed partiality towards anyone. Chandrababu Naidu garu has also been supportive of the growth of the film industry. I feel satisfied when I watch Shankar garu's films like Oke Okkadu and Shivaji. There is right and wrong in films. It depends on people what they take. I hope that apart from entertaining films, thought-provoking films will also get released. I hope that films teaching values should come a lot in the future. On behalf of Andhra Pradesh, I congratulate Ram Charan garu, Shankar garu, Dil Raju garu, and Sirish garu. SJ Suryah garu is a great director. He is also a great actor too. He always used to express his desire for acting. He is now impressing everyone with his acting. I wish all the best to Game Changer. I hope it kickstarts the New Year by breaking all records at the box office. Ram Charan lived in the roles of Magadheera and Alluri Seetharama Raju. He is a good friend of all heroes in the film industry. He performs Ayyappa Deeksha and Hanuman Deeksha for at least 100 days in a year. He says he tries to keep arrogance at bay by performing deeksha. Even if he goes as far as the Oscars, he remains grounded. If he’s dressed up, he’ll appear in a suit; otherwise, you’ll see him wearing an Ayyappa mala and barefoot. Ram Charan is our treasure, like a younger brother to me. The more he grows, the more humble he becomes. I bless him not just as an uncle but also as an elder brother, wishing for incredible success."

The film's lead hero, Ram Charan said, "I witnessed a sea of people when Pawan Kalyan garu did a rally on the Rajahmundry bridge for the first time. Now, once again, I see such a sea of people. I thank Deputy CM Pawan Kalyan garu for attending this event. I might be the Game Changer in the film, but he is the real game-changer in Indian politics. I think Shankar garu wrote this story by seeing people like Pawan Kalyan garu. I will speak more at another instance. Forgive me for now."

Director Shankar stated, "I thank Deputy Chief Minister Pawan Kalyan garu for attending this Game Changer's event. I met him once to invite him to my daughter's wedding. He received me so well and talked to me so warmly. Within a few minutes of meeting him, I started admiring him. I never made a straight Telugu film in all these years of my career, yet you received me so well. That’s why I decided to do a film in Telugu. I thank Dil Raju garu and Ram Charan garu for giving me this opportunity. We shot the film in Telugu locations. The film is about a war between a minister and a collector. The hero's flashback episode is a major highlight. Ram Charan garu lived in that role. Every actor, including Kiara Advani garu, Anjali garu, Srikanth garu, Naveen Chandra garu, and SJ Suryah garu, performed exceptionally well. Thaman composed great music. I thank the entire team for supporting me."

Producer Dil Raju said, "I thank Deputy Chief Minister Pawan Kalyan garu for attending this event. When Shankar garu narrated this story, I was reminded of various instances that happened in our state. Ram Charan garu played three different shades of characters in this movie. His performance is going to be epic. Thaman gave great music. I thank the AP government for issuing a GO to increase ticket rates for Sankranthi movie releases. Our film is arriving on January 10. I hope it will be a great success."

AP Cinematography Minister Kandula Durgesh said, "My heartfelt greetings to Andhra Pradesh Deputy Chief Minister, the man who strives for the people and played a key role in the formation of the alliance government in the state, Sri Pawan Kalyan garu. My greetings to Global Star Ram Charan garu, who has carved a niche for himself in the Telugu film industry. It is a proud moment for all of us to see both of them sharing one stage in our very own Rajahmundry. The government is ready to bring a special cinema policy with the support of Pawan Kalyan garu and Honorable Chief Minister Nara Chandrababu Naidu garu. Andhra Pradesh is home to various beautiful locales, and already many films are being shot in the state. On behalf of the CM and Deputy CM, I request directors and producers to consider providing basic amenities for the film industry. The government is ready to encourage the industry by bringing in a new policy, much like the tourism and industry policies. Game Changer, directed by Shankar garu, will hopefully be a game-changer in Indian cinema. I congratulate everyone who worked on this team and extend my best wishes to Dil Raju garu as well."

Actor Srikanth said, "I feel happy to meet Power Star and Deputy Chief Minister Pawan Kalyan garu after a long time on this occasion. Congratulations, sir. I thank Shankar garu for trusting me with such a role. Working on this film, I learned a lot from SJ Suryah garu. Anjali garu, Samuthirakani garu, and others also have great roles. Thaman garu provided excellent music for the film. This is my second film with Ram Charan, after Govindudu Andarivaadele. I have seen a lot of change in him over the years. He proved his mettle with Rangasthalam and RRR and will take it to the next level with Game Changer. He excelled in both characters, Ram Nandan and Appanna. Being with Charan feels like being with Annayya (Chiranjeevi). While everything else has changed, his humble and grounded nature remains the same. I truly wish he wins a National Award for this movie because I have witnessed his performance firsthand."

SJ Suryah said, "Happy New Year to everyone. I was speechless after meeting my friend and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan garu after a long time. His presence has made this event even more special. Two people who changed my thought process are AR Rahman garu and Pawan Kalyan garu. When I narrated the story of Kushi to Pawan Kalyan garu, he suggested a few changes, including adding a song and three fight sequences. That’s how 'Yeh Mera Jahaan' was created, a song he still stands by today. He taught me the importance of standing by our words. He is a visionary who loves his people and would give his life for them. He is not living for power or any post but for the people. Coming to Game Changer, Ram Charan garu has delivered an extraordinary performance as Ram Nandan and Appanna. What Pawan Kalyan garu is doing on the field is what Ram Charan garu does in this film. I’ve watched the scenes, and the face-off moments between me and Charan garu came out brilliantly. Like Sukumar garu said, I hope Ram Charan garu wins a National Award for this film. I wanted to say a lot more, but I’m speechless after witnessing this reception. Game Changer is releasing for Sankranthi, and I hope you all love it."

Game Changer is produced by Dil Raju and Sirish under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Productions and Zee Studios. SVC Adityaram Movies are producing the film in Tamil. AA Films, owned by Anil Thadani, is releasing the film in Hindi.

 

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు, కుడా చైర్మన్ తుమ్మల బాబు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. ఈవెంట్‌ను వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు (నవ్వుతూ). మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. హోం మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థాంక్స్. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారాలు. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇక దిల్ రాజు గారు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు.. ఆంజనేయుడు.. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు.. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు.. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘రాజమండ్రి బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు జన సంద్రం కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. సినిమాలో నేను గేమ్ చేంజర్‌ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ గారి లాంటి వారిని చూసే శంకర్ గారు ఇలాంటి పాత్రలని రాసి ఉంటారు. ఇంకో సందర్భంలో మరింతగా మాట్లాడుతాను. నన్ను క్షమించండి’ అని అన్నారు.

శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు థాంక్స్. నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన మిమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారు తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి గారు, కియారా గారు, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర గారు, ఎస్ జే సూర్య గారు ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. శంకర్ గారు ఈ కథను చెప్పిన మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్ చరణ్ గారు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నామ’ ని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు. సినిమా సినిమాకి ఎదుగుతూ వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్‌ ఇక్కడ జరుగుతుండటం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన అనుమతులు, ప్రోత్సాహం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ సినిమా గేమ్ చేంజర్‌లా ఉండాలని కోరుకుంటున్నాను. నిర్మాత దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఆయన్ను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్ గారు విజన్, తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఎస్ జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నాను. అంజలి గారు, సముద్రఖని గారు ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి. తమన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటాడు. అప్పటికీ ఎప్పటికీ రామ్ చరణ్ బిహేవియర్‌లో ఏమీ మారలేదు. సుకుమార్ గారు చెప్పినట్టు ఈ సినిమాకు జాతీయ అవార్డు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తమన్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్‌లోని కొండ దేవర పాటను ఈ రోజు ఇక్కడే లైవ్‌లో పాడుతాను. సోల్ ఆఫ్ గేమ్ చేంజర్ సాంగ్‌ను కూడా ఇక్కడే రివీల్ చేస్తున్నాం. ఈ పాటలన్నీ తెరపై అద్భుతంగా ఉండబోతోన్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈవెంట్ జరుగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడి నుంచే వెళ్లి హీరోయిన్‌గా మారి.. మళ్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారెతో వకీల్ సాబ్‌లో పని చేశాను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ రోజు మాకోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. నటిగా డిఫరెంట్ పాత్రలను చేయాలని అందరికీ ఉంటుంది. నా తల్లి పేరు పార్వతి. ఈ చిత్రంలో నేను పోషించిన కారెక్టర్ నేమ్ పార్వతి. నాకు ఈ కారెక్టర్ చాలా టచ్ అయింది. నాకు ఇంత మంచి పాత్రను రాసిన, ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న మూడో చిత్రమిది. తమన్ సంగీతం బాగుంది. ఈ రోజు ఇక్కడ వినబోయే సాంగ్ నాకు చాలా స్పెషల్. రామ్ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఇక్కడకు వచ్చిన ఆడియెన్స్, అభిమానులకు థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved