pizza

Director Shankar Reveals the Reason Behind Choosing Ram Charan for 'Game Changer': Says, "He is an artist who can give in depth performance and has an excellent screen presence."
రామ్ చరణ్‌ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్ : స్టార్ డైరెక్టర్ శంకర్

You are at idlebrain.com > news today >

19 December 2024
Hyderabad

Global star Ram Charan is all set to hit the big screens with his magnum opus Game Changer. With director S. Shankar at the helm, the anticipation surrounding the film is immense. Promising to elevate the audience's cinematic experience, Game Changer is set to showcase Ram Charan in an intriguing avatar. Amid the excitement, director Shankar revealed the reason behind casting the global star and praised his exceptional talent as an actor. He also shared that Ram Charan’s decision to star in the film was made even before the release of his cinematic extravaganza RRR.

"Ram Charan's decision to do this film was made even before the release of RRR. Dil Raju felt that it would be good if Ram Charan was in this. It seemed appropriate to me too. Some of my stories are universal themes that can be applied to any hero, so they would be perfect for a big hero. There was a good journey with him in this film," said Game Changer director Shankar.

Speaking about Ram Charan's acting prowess, Shankar further added, "When you look at him, it seems like he is controlling the power inside. It also seems like he will explode when required. He is an artist who can give in-depth performances. He has a good screen presence. No matter what kind of scene it is, he handles it beautifully."

Game Changer is expected to feature Ram Charan as an IAS officer who goes all out to cleanse the corrupt political system. Adding to the intrigue, the movie’s teaser showcases various looks of the actor, offering glimpses of high-octane action sequences intertwined with political elements. In addition to Ram Charan, Game Changer also stars Kiara Advani, SJ Suryah, Samuthirakani, Anjali, Naveen Chandra, Sunil, and Srikanth.

Currently, the film's songs "Jaragandi," "Raa Macha Macha," and "Jaana Hairaan Sa" are topping the charts. The next song, "Dhop," is slated to be unveiled on December 22.

With Thaman's riveting music and S. Thirunavukkarasu's cinematography, this Shankar directorial promises to be a blockbuster and wreak havoc at the box office. Produced by Dil Raju and Sirish under the banners of Sri Venkateswara Creations and Zee Studios, the cinematic spectacle is set to release worldwide on January 10, 2025, in Telugu, Tamil, and Hindi.

రామ్ చరణ్‌ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్ : స్టార్ డైరెక్టర్ శంకర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి, ఆ పాత్రకు రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని శంకర్ వివరించారు. శంకర్ ఏం చెప్పారంటే..

‘RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. నా కథలు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కాబట్టి ఓ పెద్ద హీరో అయిన బాగుంటుందని అనుకుని రామ్ చరణ్‌తో ప్రయాణం ప్రారంభించాం.

రామ్ చరణ్‌ని చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్పోటనం చెందుతుందా? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు’ అని తెలిపారు.

అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించున్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, ఎస్‌ జె సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ప్రస్తుతం ఈ చిత్రంలోని "జరగండి", "రా మచ్చా", "జానా హైరాన్ సా" పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. నాలుగో పాట అయిన డోప్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన డోప్ ప్రోమో అందరినీ మెప్పించింది.

థమన్ అద్భుతమైన సంగీతం, తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ, శంకర్ మేకింగ్‌తో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచేట్టుందని అంతా ఫిక్స్ అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved