pizza

Cyber Police arrest two for leaking Global Star Ram Charan, Sensational Director Shankar Game Changer song
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ‘గేమ్ చేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీస్
‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి థమన్ సంగీతం అందించిన 'జరగండి' పాట దీపావళికి విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

6 November 2023
Hyderabad

Global superstar Ram Charan and renowned director Shankar are joining forces to bring audiences a colossal action spectacle known as "Game Changer." The film is progressing rapidly, and expectations are soaring to unprecedented heights, especially since it marks Ram Charan's first project following the blockbuster success of Rajamouli's epic "RRR."

The production team has gone to great lengths and taken extra precautions to prevent leaks, but even with stringent measures in place, they encountered piracy issues when leaked images and videos of Ram Charan performing high-octane stunts went viral. Despite stern warnings issued to those responsible, the footage of the first single, "Jaragandi," ended up leaking on social media.

In response, the film's crew has taken a strong stance and filed a formal police complaint. In the latest developments, the Cyber Crime Department swiftly took action and apprehended two individuals responsible for the song leak. The police have issued a stern warning against engaging in such leaks in the future. ACP Chand Basha of the Cyber Crimes Division, along with Inspector Bhaskar Reddy, SI Prasen Reddy, SI Saiteja Sree, and their team, acted decisively and brought the culprits to justice, sending a clear message to those involved in piracy.

Meanwhile, the filmmakers delighted fans by announcing that the film's first single will be released as a special Diwali treat. Thaman is creating electrifying music for the songs and providing breathtaking background scores. The film's production team has revealed that the song will be released in multiple languages at a pan-India level, intensifying the excitement among mega fans for its debut. Shankar, known for his visually stunning and grandiose filmmaking, is sparing no effort to transform "Game Changer" into a visual extravaganza. Cinematographer Thirunavukkarasu is enhancing the film with his captivating visuals.

 

Cast: Ram Charan, Kiara Advani,Anjali, Samuthirakhani,SJ.Suryah, Srikanth,Sunil, Naveen Chandra and others
Technicians
Director: Shankar
Producers: Dil Raju, Sirish
Writers:SU.Venkatesan,Vivek

Storyline: Karthik Subbaraj
Co-Producer: Harshit
Cinematography: S.Thirunavukkarasu
Music: S.Thaman
Dialogues: Sai Madhav Burra
Line Producers: Narasimha Rao. N, SK.Jabeer
Art Director: Avinash Kolla
Action Choreogrpaher: Anbariv
Dance Choreographer: Prabhu Deva, Ganesh Acharya,Prem Rakshit, Bosco Martis, Jhony, Sandy

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ‘గేమ్ చేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీస్
‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి థమన్ సంగీతం అందించిన 'జరగండి' పాట దీపావళికి విడుదల

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.

సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోందన్న సంగతి తెలిసిందే.

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: శంక‌ర్
నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్‌
రైట‌ర్స్‌: ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్‌
స్టోరీ లైన్‌: కార్తీక్ సుబ్బ‌రాజ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్‌
సినిమాటోగ్ర‌ఫీ:ఎస్‌.తిరుణావుక్క‌ర‌సు
మ్యూజిక్‌: త‌మ‌న్.ఎస్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
లైన్ ప్రొడ్యూస‌ర్స్‌: న‌ర‌సింహారావ్‌.ఎన్‌, ఎస్‌.కె.జ‌బీర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: అవినాష్ కొల్ల‌
యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌: అన్బ‌రివు
డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌: ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
లిరిసిస్ట్‌: రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, కాస‌ర్ల శ్యామ్‌
ఎడిట‌ర్‌: షామీర్ ముహ్మ‌ద్
సౌండ్ డిజ‌న‌ర్‌: టి.ఉద‌య్‌కుమార్‌

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved