My Role in Game Changer Was the Most Challenging Of My Career: Srikanth
‘గేమ్ చేంజర్’ లో అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు... నటుడు శ్రీకాంత్
Global Star Ram Charan's Game Changer is one of the most anticipated films of 2025. Directed by Shankar, this political action drama is set for a grand release on January 10, 2025. The ensemble cast of this movie includes popular actor Srikanth, who played a pivotal role in the movie. Today, Srikanth interacted with the media and shared his experiences of working on this prestigious project.
Q: How do you feel about your characterization in the movie?
A: I feel that my characterization in this movie is fresh and distinct compared to my recent work. I never imagined I would portray such a character. When they first narrated the first half, I questioned why they thought of me for this role and whether I could pull it off. However, after hearing the second half, I knew I had to take on the role no matter what. It was such a compelling character. Once the prosthetics were done and I got into the look, I felt confident that I could do justice to the role. Working with Shankar garu is a dream for many, and I consider myself fortunate to have such a significant role in his film.
Q: How many days did you take to finalize your getup in the movie?
A: They made a few designs initially. After doing trials for two-three designs, they finalized one.
Q: Was it tough to get into that prosthetic makeup?
A: It was my first time. One needs a lot of patience while getting into that getup. We need to sit for 2-3 hours to get the makeup done. We can't sweat till evening. We should balance all these things. It is tough. Initially, I found it difficult, but later I figured out how to manage myself in that makeup.
Q: Until now, you have seen Shankar from outside. Now, you got a chance to work with him. Can you tell us what you feel about his vision?
A: He is already a proven director nationwide. Right from the first day, he made us very comfortable. He is very patient and goes for as many takes as possible. As he was an artist before, he knows how his actors need to act in his film and injects his vision into us perfectly. We just follow it.
Q: How is your characterization in the movie?
A: I am playing the role of the Chief Minister in the movie. There is a positive and negative side to this character. These shades come out as per the situation. Rest everything you have to watch the film.
Q: Did you take any references, observe anyone, or does your character have any mannerisms in the movie?
A: The character I play is of an aged CM character. With the getup, my behaviour comes automatically, be it walking style, delivering dialogues subtly, and lowering down my energy levels.
Q: CM Character in Shankar's Oke Okkadu clicked with the audience very well and became a reference for such characters. Will your role in the movie have any such new dimension?
A: For me, I felt the character was a new dimension for myself.
Q: Will you be the follower of Ram Charan garu's older role in the movie?
A: (laughs) You have to watch the film to see if I was a follower or a friend or anything else.
Q: With which character do you have more combination scenes?
A: I have scenes with everyone: Charan, SJ Suryah, Jayaram, and Samuthirakani. SJ Suryah's performance is outstanding. His character has layers of humour, cunning, and sarcasm, taking it to the next level compared to his role in Saripodhaa Sanivaaram. Working with such versatile characters has been an amazing experience.
Q: Were you skeptical after listening to your character in the movie?
A: Playing my character without any prior experience of playing such a character is a challenge. As I said, I was skeptical after hearing the first half. However, when I listened to the second half, and especially the flashback episode, I was mind-blown and decided to do it.
Q: What was the most unlikely response you got after wearing that getup?
A: They created my look after seeing a picture of my father, who has passed away. The moment I wore that getup, I went straight home, and my mother was shocked to see me like that. To add to her surprise, I called her "Baby" just to tease her. I never imagined I would resemble my father so much until I put on that getup.
Q: Game Changer is Shankar's first Telugu film. Before that, he has only done Tamil films. Have you ever thought of working in his movie?
A: I never expected to work with Shankar garu. As Shankar garu's films have pan-India appeal, they chose actors of such level. Generally, we get characters from all industries. But getting this type of character is very rare. Rajendra Prasad and Jagapathi Babu did these kinds of characters, but it is new for me. But Shankar garu showed confidence in me. Eventually, I also did it.
Q: You worked with Charan in the past. How was it sharing screen space with him again, and was there any difference in his style of acting?
A: Absolutely. There will be a lot of difference. When we did Govindudu Andarivadele, it was a kind of youngster character. Whatever he has been doing now are matured characters, be it Rangasthalam, RRR. As he is now a Global Star, the characters will be of that level. Both his characters in this movie are performance-oriented roles. Especially, playing Appanna character in this movie is challenging. Playing such characters needs a lot of experience. He aced it completely.
Q: What is your favourite character among all the movies you have done till now?
A: All of them are my favourite characters. But the toughest one was this character in Game Changer. I never played a role of this age in my career. People will be surprised to watch me on screen.
Q: You call Chiranjeevi Anna. What does Charan call you?
A: He also calls me Anna. He never called me Babai (laughs). Not only Charan, but Bunny and Sai Dharam Tej also call me Anna.
Q: What is your opinion on the current trend of filling movies with action and elevation scenes rather than having a solid story?
A: If such movies are getting hit, it means that audiences are enjoying them. People are not watching if there is only a story and no elevation scenes. When story and elevation scenes are mixed well, movies are becoming bigger hits.
Q: Does Game Changer have elevations and story?
A: Yes. From Shankar garu, you can expect strong stories. Even though his recent movies disappointed, he never failed as a director. I hope he makes a strong comeback with this movie. There are all commercial elements in it. There is entertainment, political angle, and many twists. It will definitely be a big hit.
Q: Recently, Shankar wrote the stories of his movies. But for this film, Karthik Subbaraj wrote the story. What is your view on this exchange?
A: Karthik Subbaraj is a famous director and a writer too. If Shankar garu took that story, imagine how impressed he was with it.
Q: Nowadays, every big film has a lead to a sequel in the end. Will Game Changer also have such an ending?
A: No. I think Game Changer is a standalone single-part movie.
Q: Game Changer had a lot of shooting days. Did you miss something during this shoot?
A: People often think that we prolong shoot unnecessarily. But that is not the case. For example, we shot in Rajahmundry as per the planned schedule. But managing the artist combination dates for each schedule will be a hectic task. Maybe one and a half years were wasted due to managing the dates of various actors and their particular getups.
‘గేమ్ చేంజర్’ లో అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు... నటుడు శ్రీకాంత్
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
* గేమ్ చేంజర్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది.
* ప్రోస్థటిక్ మేకప్‌లో నటించడం ఎలా అనిపించింది?
నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.
* శంకర్ గారి వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.
* గేమ్ చేంజర్‌లో మీ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందా? పాజిటివ్‌గా ఉంటుందా?
నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన కారెక్టర్. ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం.
* ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి?
ఎస్ జే సూర్య, జయరాం, సముద్రఖని, రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయి. ఎస్ జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుంది.
* గెటప్ చాలా కొత్తగా ఉంది కదా.. ఈ లుక్‌ను ఎలా ఫైనల్ చేశారు?
మా తండ్రి గారి గెటప్‌ను చూసే నాకు ఈ కారెక్టర్ లుక్‌ను ఫిక్స్ చేశారు. గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి షాక్ అయ్యారు. హేయ్ బేబీ (నవ్వుతూ) అని సరదాగా పిలిచాను. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అనుకున్నాను.
* రామ్ చరణ్ మళ్లీ వర్క్ చేశారు? అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా?
గోవిందుడు అందరివాడేలే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగానే పిలుస్తాడు.
* డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నారు కదా.. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడుతుంటారా?
దేవర చిత్రంలోనూ డిఫరెంట్ పాత్రను పోషించా. అఖండ టైంలోనూ కాస్త భయపడ్డాను. ఆపరేషన్ దుర్యోధన చిత్రాన్ని రిసీవ్ చేసుకున్నారు. అప్పటి నుంచి నాకు కాస్త ధైర్యం ఏర్పడింది.
* గేమ్ చేంజర్ చిత్రం ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.
* గేమ్ చేంజర్ చిత్రానికి సీక్వెల్ వంటివి ఏదైనా ఉంటుందా?
కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి చాలా నచ్చింది. అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవు.
* షూటింగ్ చాలా ఆలస్యంగా, నిదానంగా జరగడానికి కారణం ఏంటి?
అందరి డేట్లు సెట్ అవ్వడం వల్లే షూటింగ్ ఆలస్యం ఏర్పడింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.
* రాబోవు చిత్రాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.
* రీ రిలీజ్‌ల గురించి, మీ కొడుకు చిత్రాల గురించి చెప్పండి?
ఖడ్గం రీ రిలీజ్‌ను థియేటర్లో చూశాను. కుర్రాళ్లంతా చాలా ఎంజాయ్ చేశారు. పెళ్లి సందడి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని అనుకుంటున్నాను. నా కొడుకు రోషణ్ ప్రస్తుతం ఛాంపియన్ చిత్రాన్ని చేస్తున్నాడు. మేం ఇద్దరం కలిసి ఇప్పట్లో అయితే నటించం. చిన్నోడు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. చదువులు పూర్తయ్యాక సినిమాల్లో వస్తాడు.