pizza

Gam Gam Ganesha premiere response
ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" స్పెషల్ స్క్రీనింగ్ కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్

You are at idlebrain.com > news today >

29 May 2024
Hyderabad

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. "గం..గం..గణేశా" సినిమా చూస్తూ థ్రిల్ ఫీలయ్యామని, కామెడీని బాగా ఎంజాయ్ చేశామని ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసిన ఆడియన్స్ తమ రెస్పాన్స్ తెలియజేశారు.

"గం..గం..గణేశా" సినిమాలోని కామెడీ, కాన్సెప్ట్ సూపర్బ్ అని, సినిమా థ్రిల్లింగ్ గా ఉంది. రెండున్నర గంటలు నవ్వుతూనే ఉన్నాం, సినిమా పక్కాగా సక్సెస్ అవుతుందని, ఎక్కడా ల్యాగ్ లేదని ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూసిన ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ చెప్పారు. స్పెషల్ స్క్రీనింగ్ లో వచ్చిన రెస్పాన్స్ తో మూవీ టీమ్ మరింత కాన్ఫిడెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం - చేతన్ భరద్వాజ్
లిరిక్స్ - సురేష్ బనిశెట్టి
బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved