pizza

Gam Gam Ganesha teaser launched
ఘనంగా జరిగిన ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" సినిమా టీజర్ రిలీజ్ వేడుక

You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2023
Hyderabad

"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా". ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా టీజర్ ను ఇవాళ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, విరూపాక్ష కార్తీక్ దండు, మిడిల్ క్లాస్ మెలొడీస్ డైరెక్టర్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

యాక్టర్ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. కామెడీ పంచ్ లు అదిరిపోతాయి. ఆనంద్ అన్నను ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. మీరంత ఫ్యామిలీతో కలిసి రెండున్నర గంటలు హ్యాపీగా చూసేలా సినిమా ఉంటుంది. అన్నారు

యాక్టర్ సత్యం రాజేష్ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఆనంద్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్ట్ ఈవెంట్స్ లో ఈ సినిమా గురించి మాట్లాడుతాను. అన్నారు

సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ - మా డైరెక్టర్ ఉదయ్ ఎంత ప్యాషనేట్ గా మూవీ రూపొందించాడో మీకు టీజర్ లోనే కనిపిస్తుంది. ఈ కథకు నేను మ్యూజిక్ తో న్యాయం చేయగలను అని నమ్మినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చాననే అనుకుంటున్నాను. సినిమా కోసం ఆనంద్ దగ్గర నుంచి అందరం ఒక టీమ్ లా ప్యాషనేట్ గా కష్టపడ్డాం. అందుకు మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇవాళ థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించాలంటే ఛాలెంజింగ్ కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాాం అన్నారు.

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - మేమంతా ఒక మంచి సినిమా చేశామని చెప్పగలను. దర్శకుడు ఉదయ్ మాకు కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో స్టోరీ ఓకే అయ్యింది. మా అందరికీ అంత బాగా కథ నచ్చింది. ఆ కథను అంతకంటే అందంగా తెరకెక్కించారు. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వంశీ కారుమంచి మాట్లాడుతూ - మీరంతా టీజర్ చూశారు. టీజర్ ఎంత ఎనర్జిటిక్ గా, కామెడీగా ఉందో మూవీ కూడా అంతే యాక్షన్ కామెడీతో ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్స్ గా మాకు, డైరెక్టర్ ఉదయ్ కు ఫస్ట్ మూవీ. మేము ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థాంక్స్. ఆనంద్ ఇప్పటిదాకా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా కొత్తగా ప్రయత్నించాడు. "గం..గం..గణేశా" సినిమా మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ ఇయర్ ఆనంద్ కు సెకండ్ సూపర్ హిట్ అవుతుంది. నిజానికి ఈ వినాయక చవితికే సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఈ ఇయర్ ఎండ్ కు "గం..గం..గణేశా" తెరపైకి తీసుకొస్తాం. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved