pizza

Varun Tej about Gandeevadhari Arjuna
Gandeevadhari Arjuna will impress everyone with Good action sequences and emotions: Mega Prince Varun Tej
మంచి యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషన్స్ ఉన్న ఎంటర్టైనర్ 'గాండీవధారి అర్జున' అందరినీ ఆకట్టుకుంటుంది - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2023
Hyderabad

Mega Prince Varun Tej is an action and emotional thriller 'Gandeevadhari Arjuna'. Sakshi Vaidya played the female lead in the film. Stylish filmmaker Praveen Sattaru has directed and it is produced by Sri Venkateswara Cine Creations. The film releasing on August 25th and the makers are busy with promotions. On this occasion, Mega Prince Varun Tej interacted with the media about the film and shared few interesting things

*I have been following Praveen Sattaru's work from the start. There are sensibilities in his concepts and he tries to do different films. I have seen movies like Chandamama Kathalu and Garuda Vega. I gota call from him during the Ghani shoot. I didn't ask anything about the story at that time. He said let's make an action movie. I knew that he can handle action films well. After listening to the story, stylish action movies usually focus more on action and stylish elements and the content is minimal. But when Praveen told this story, I knew as a young actor that whatever issue he wanted to talk about was very big. Because of the busy life, no one cares about that problem. It does not affect us immediately but its effect will last for years.. I liked the main point and emotions of the story when Praveen narrated it.

*The actor rarely gets films in which he plays socially responsible roles. I've done comedy films like F2 and F3 but I love action film with solid emotions. I also felt it would be good to make a film that reminds us of social responsibility along with a good story. It felt like it is my responsibility tell these kind of stories with every chance I get.

*I love watching action movies. Praveen has an understanding of how to get action. That is why action sequences are so good in his movies. When it came to Gandeevadhari Arjuna, we did it without using too many rope shots and CG work. We have done a different kind of action sequences thats focused on realistic nature.

*Gandeevadhari Arjuna is a title that fits the story. A title means "Call for Help". In this movie too, the hero is called when there is a problem. His name is Arjun. That's why we gave this title.

*'Gandeevadhari Arjuna' is not a spy film. I played a bodyguard role in this. Usually, when representatives of our country go to other countries for talks, they take private security there. Most of these people are working in the national defense system.

*'Gandeevadhari Arjuna' is not giving any message and telling you to change. We re just showing what kind of problem we are facing right now. It would be good if someone changed because of it. I recently watched the movie and I loved it thoroughly.

* If someone says anything like a documentary, it sucks and feels boring. Even if it is a movie, if it is told in an entertaining way, the audience will connect. When it comes to 'Gandeevadhari Arjuna, we have tried to narrate it as an action entertainer.

* The story of 'Gandeevadhari Arjuna' is a film that takes place in four days. There are good emotions along with impressive action scenes. We shot the film in London, Budapest as per the demand of the story.

* Sakshi Vaidya is a very focused person. I found it surprising , when she told three pages of dialogue in the film in a single take. She wants to achieve something and she is well prepared for that.

* In the film Matka, there will be many variations in my role. There are four shades in my character. It opens with the concept of how the game Matka started and how it changed lot of lives.

మంచి యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషన్స్ ఉన్న ఎంటర్టైనర్ 'గాండీవధారి అర్జున' అందరినీ ఆకట్టుకుంటుంది - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్బంగా...

* ప్రవీణ్ సత్తారు సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. తన కాన్సెప్ట్స్ లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. విభిన్నమైన సినిమాలను చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చందమామ కథలు, గరుడ వేగ లాంటి సినిమాలను చూశాను. గని సినిమా షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి నేనేమీ అడగలేదు. యాక్షన్ సినిమా చేద్దాం అన్నాడు. తను యాక్షన్ సినిమా అయితే బాగా చేస్తాడని సరేనని కలిశాను. కథ విన్న తర్వాత స్టైలిష్ యాక్షన్ మూవీస్ సాధారణంగా యాక్షన్, స్టైలిష్ అంశాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు ఓ యంగస్టర్ గా తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ సమస్యను ఎవరం పట్టించుకోం. అది వెంటనే మనపైన ప్రభావం చూపేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ చెప్పినప్పుడు కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి.

* నటుడికి ఓ సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. ఎఫ్ 2, ఎఫ్ 3లాగా కామెడీ చేయాల్సి ఉంటుంది. గని విషయానికి వస్తే యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. అయితే మంచి కథతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే సినిమా చేయటం నాకు బావుంటుందనిపించింది. అవకాశం ఉన్న ప్రతీసారి చేయాల్సిన అవసరం ఉందనిపించింది.

* బేసిగ్గా నాకు యాక్షన్ సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నాను. ప్రవీణ్ కి యాక్షన్ ఎలా కావాలనే దానిపై ఓ అవగాహన ఉంది. అందుకనే తన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు బావుంటాయి. గాండీధారి అర్జున విషయానికి వచ్చేసరికి ఇందులో ఎక్కువ రోప్ షాట్స్, సీజీ వర్క్ ఉపయోగించకుండానే చేశాం. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశాం. రేపు థియేటర్స్ లో చూస్తే తెలుస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి.

* 'గాండీవధారి అర్జున' కథను యాప్ట్ అయ్యే టైటిల్. కాల్ ఫర్ హెల్ప్ లాంటి టైటిల్. ఈ సినిమాలోనూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హీరోని పిలుస్తారు. తను పేరు అర్జున్. అందుకనే ఈ టైటిల్ పెట్టాం.

* 'గాండీవధారి అర్జున' స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సాధారణంగా మన దేశానికి చెందిన ప్రతినిధులు ఇతర దేశాల్లో చర్చలకు వెళ్లినప్పుడు వాళ్లు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు. ఇలాంటి వాళ్లలో దేశ రక్షణ వ్యవస్థలో పని చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు.

* 'గాండీవధారి అర్జున'లో ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. నేను రీసెంట్ గా సినిమాను చూశాను. నాకు నచ్చింది.

* ఎవరైనా క్లాస్ పీకినట్లు ఏ విషయమైన చెబితే బోర్ కొట్టేస్తుంది. సినిమా అయినా అంతే కాస్త ఎంటర్ టైనింగ్ పంథాలో చెబితే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. 'గాండీవధారి అర్జున' విషయానికి వస్తే యాక్షన్ ఎంటర్ టైనర్ గా చెప్పే ప్రయత్నం చేశాం.

* 'గాండీవధారి అర్జున' కథ నాలుగు రోజుల్లో జరిగే సినిమాగా తెరకెక్కించారు. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో పాటు చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. కథ డిమాండ్ మేరకే సినిమాను లండన్ లో షూట్ చేశాం.

* సాక్షి వైద్య చాలా ఫోకస్డ్ పర్సన్. సినిమాలోని త్రీ పేజీస్ డైలాగ్ ను ఎక్కువ టేక్స్ లేకుండా కంప్లీట్ చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తను ఏదో సాధించాలనుకుంటోంది.

* ఇప్పుడు నేను చేస్తున్న మట్కా సినిమాలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో నా క్యారెక్టర్ లో నాలుగు షేడ్స్ ఉంటాయి. మట్కా అనే ఆట ఎలా ప్రారంభమైందనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved