7 June 2023
Hyderabad
Mega Prince Varun Tej and talented Filmmaker Praveen Sattaru are currently working non stop to bring an solid actioner. The big action film that they are working titled as ‘Gandeevadhari Arjuna’, which translates to "Bow-Clad Arjuna." The actor will be seen in most intense avatar in the film with lot of stylish action.
The film is set to be an action thriller and the look posters, BTS glimpses have already gained much-wanted buzz for the film. The team is completing the shoot in foreign countries at a rapid pace, and the action sequences will be the film's main highlights. The makers have now announced the much-anticipated release date for the film.
Gandeevadhari Arjuna's mission will begin in theatres on August 25th. The film's production is nearing completion, and the crew is hard at work on post-production. The team is on a mission to bring this all-out action entertainer to the audience as soon as possible. With the glimpses and pictures of schedule updates, the hype on the film raised to next level.
The film will have technical richness as well as numerous action sequences. This is the most expensive film in Varun Tej's career. BVSN Prasad and Bapineedu are producing this film under the banner SVCC. Successful Music director Mickey J Meyer is the music composer. Mukesh will handle the camera work for the movie, while Avinash Kolla will overlook the Art department of the movie. More details about cast and crew will be announced soon.
Gandheevadhari Arjuna will be releasing in theatres worldwide on August 25th, Friday.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాంఢీవధారి అర్జున’...ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్
డిఫరెంట్ మూవీస్ చేస్తూ అలరిస్తోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇన్‌టెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్.. అందులో వరుణ్ తేజ్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన బీటీఎస్ వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
చిత్ర యూనిట్ విదేశాల్లో శరవేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలియజేశారు. ‘గాంఢీవధారి అర్జున’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేయటానికి టీమ్ చాలా కష్టపడుతోంది.
వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ టెక్నికల్ హై స్టాండర్డ్స్‌తో మెప్పించనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా, ముఖేష్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు.
* ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదలవుతుంది.