pizza

Global Star Ram Charan, Upasana congratulate Team Gandhi Tatha Chettu; Makers cherish their lovely gesture
గాంధీ తాత చెట్టు' టీమ్‌ను అభినందించిన గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన

You are at idlebrain.com > news today >

25 January 2025
Hyderabad

Gandhi Tatha Chettu, featuring director Sukumar Bandreddi’s daughter Sukriti Veni Bandreddi in the lead role, was released in theatres this Friday (January 24th). Directed by Padmavati Malladi, the film is produced by Mythri Movie Makers, Sukumar Writings, and Gopi Talkies. Thabitha Sukumar is the presenter, while Naveen Yerneni, Yalamanchili Ravishankar, and Shesha Sindhu Rao have jointly produced it.

Global Star Ram Charan extended his congratulations to the team of the thought-provoking drama during their visit today. His wife, Upasana, also expressed her appreciation for the actors and crew. Sukriti Veni and Thabitha Sukumar, along with the film's director and producer, were also present.

The film has received appreciation in the form of glowing reviews. The high-rated drama has been talked about by film critics for its tender message. Sukriti Veni's nuanced portrayal has particularly been mentioned as a key highlight.

After winning several awards, the film is now enjoying positive feedback from the audience.

The cast of Gandhi Tatha Chettu includes Anand Chakrapani, Raghuram, Bhanu Prakash, Nehal Anand Kunkuma, and Rag Mayur.

గాంధీ తాత చెట్టు' టీమ్‌ను అభినందించిన గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల చేశారు మేకర్స్‌. కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్‌ పట్ల రామ్‌చరణ్‌, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్‌, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్‌, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ తదితరులు ఉన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved