pizza

Superstar Mahesh Babu Launches the Trailer of Sukriti Veni’s Gandhi Tatha Chettu
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్‌!

You are at idlebrain.com > news today >

09 January 2025
Hyderabad

The trailer of Gandhi thata chettu , featuring Sukumar Bandreddy’s daughter Sukriti Veni Bandreddy in the lead role, was launched by superstar Mahesh Babu through his social media. Directed by Padmavati Malladi, the film is produced by Mythri Movie Makers, Sukumar Writings, and Gopi Talkies. Tabitha Sukumar is presenting the movie, while Naveen Yerneni, Yalamanchili Ravishankar, and Shesha Sindhu Rao have jointly produced it.

The film has already been screened at several international film festivals, winning multiple awards. Sukriti Veni also received the Best Child Artist award for her performance. The movie is set for a worldwide theatrical release on January 24.

Sharing his thoughts on social media, Mahesh Babu wrote, “Happy to launch the trailer of #GandhiTathaChettu…Looks heartwarming and deeply touching… My best wishes to Sukriti and the entire team for their journey ahead**

The trailer suggests that the story revolves around a girl named Gandhi who, inspired by Mahatma Gandhi’s principles, strives to protect her grandfather’s beloved tree and her village. The emotional narrative appears to be centered on how the girl follows the path of non-violence to achieve her goal. Sukumar himself plays a role in the film alongside his daughter Sukriti Veni. The trailer has received praise for its touching and heartfelt presentation.

In response to the trailer launch, the producers, director Padmavati Malladi, and presenter Tabitha Sukumar expressed their gratitude to Mahesh Babu for supporting the film.

Speaking on the occasion, director Padmavati Malladi stated, “In today’s world, negativity is spreading rapidly—be it through hatred or envy, especially on social media where conflicts and blame games are common. When we think of non-violence, the first person who comes to mind is Mahatma Gandhi. This film follows the story of a 13-year-old girl who, inspired by Gandhi’s ideals, tries to save her village. It’s a story every parent should show their children. The film conveys emotions that will touch every heart, leaving viewers with an indescribable feeling. We are confident that it will be well received by audiences when it releases on January 24.”

The cast of Gandhi Tatha Chettu includes Sukriti Veni, Anand Chakrapani, Raghuram, Bhanu Prakash, Nehal Anand Kunkuma, and Rag Mayur. The music is composed by Re, while cinematography is handled by Srijith Cheruvupalli and Vishwa Devabattula. Editing is by Harishankar TN, and the lyrics are written by Suddala Ashok Teja, Kasarla Shyam, and Vishwa. Production design is by V. Nani Pandu, with Ashok Bandreddy as the co-producer and Abhinay Chilukamarri as the executive producer. The film is written and directed by Padmavati Malladi.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్‌!

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌, ప్రిన్స్‌ మహేష్‌బాబు తన సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. '' గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తుంది. సుకృతికి మరియు ఈ సినిమా టీమ్‌ అందరికి నా అభినందనలు'' అంటూ ప్రిన్స్‌ మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

ట్రైలర్‌ చూస్తుంటే '' గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. గాంధీగా సుకుమార్‌, కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్‌ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది'' అనిపిస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్‌ తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు.

ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ '' ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రీ, సినిమాటోగ్రఫీ: శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల, ఎడిటింగ్‌: హరిశంకర్‌ టీఎన్‌, పాటలు: సుద్దాల అశోక్‌ తేజ, కాసర్ల శ్యామ్‌, విశ్వ, ప్రొడక్షన్‌ డిజైన్‌ వి.నాని పాండు, కో పొడ్యూసర్‌: అశోక్‌ బండ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అభినయ్‌ చిలుకమర్రి, రచన-దర్శకత్వం : పద్మావతి మల్లాది


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved