Sensational Director Sukumar's daughter Sukriti Veni's Gandhi Tatha Chettu to release on January 24th
జనవరి 24న విడుదల కానున్న సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు'
Gandhi Tatha Chettu is headlined by Sukriti Veni Bandreddi, the daughter of Sensational Director Sukumar and Tabitha Sukumar. The message-oriented, emotionally moving movie is slated to hit the screens on January 24th.
Mythri Movie Makers, Sukumar Writings, and Gopi Talkies have produced this Padmavathi Malladi directorial. The film co-stars Anand Chakrapani, Raghu Ram, Bhanu Prakash, Nehal Anand Kumkuma, and Rag Mayur. Ree has composed its music.
The meaningful, award-winning drama narrates the uplifting tale of a young girl's conviction to save her Grandfather’s tree through the Gandhian path of peaceful resistance and non-violence. The principle of Ahimsa is at the core of the story. Gandhi Tatha Chettu also raises awareness about the need for ecological balance, the empowerment of the female child, and the importance of harmony in interpersonal relations. Love, co-existence, peace, hope and empathy are underlined by the film.
Producers Naveen Yerneni, Y Ravi Shankar, and Sesha Sindhu Rao have jointly produced this movie, which is presented by Tabitha Sukumar.
Multiple awards won!
Sukriti Veni has been honored with the Dadasaheb Phalke Award for Best Child Artist for the film 'Gandhi Thatha Chettu'. At the Dubai International Film Festival and the Indian Film International Festival, Sukriti won awards in the Best Debutante Child Artist category. The film also won the Best Picture Award at the 11th Noida International Film Festival, Jury Best Film and Best Regional Film at the New Delhi Film Festival, Jury Best Film at the Jaipur International Film Festival and at the 8th Indian World Film Festival.
An uplifting, conscious film:
They say a good story will find its own way into the world and into the hearts of people. We have always believed that the right people will find their path into our project and associate with us and join us in bringing 'Gandhi Tatha Chettu' into the world. So, this is an invite for all you people out there who love cinema and think that the world needs stories that are like warm hugs. Stories that give hope. Stories that have a heart of their own. In these times of war and hatred we feel that it is an absolute necessity for us to tell a story of peace and love. Something that will put a little bit of hope and positivity into the world.
Mythri Movie Makers, Sukumar Writings and Gopi Talkies are bringing this feel-good movie laced with high-thinking themes.
జనవరి 24న విడుదల కానున్న సుకృతి వేణి 'గాంధీ తాత చెట్టు'
దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ '' ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రీ, సినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల, ఎడిటింగ్: హరిశంకర్ టీఎన్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, విశ్వ, ప్రొడక్షన్ డిజైన్ వి.నాని పాండు, కో పొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ చిలుకమర్రి, రచన-దర్శకత్వం : పద్మావతి మల్లాది