pizza

Last 20 minutes of Gangs of Godavari is an emotional roller coaster: Director Krishna Chaitanya
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది : చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య

You are at idlebrain.com > news today >

29 May 2024
Hyderabad

Vishwak Sen, who’s rediscovering himself as a performer with every film, is teaming up with Anjali and Neha Sshetty for Gangs of Godavari, an intense gangster drama directed by Krishna Chaitanya. Yuvan Shankar Raja scores the music. Produced by S. Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, the film is set for release on May 31.

Ahead of the film’s release, the director of the film interacted with the media.

- I first shared the idea of the Gangs of Godavari with artist Anand Ramaraju, and from there we began working on the story. The film initially started with Sharwanand but Sharwa Garu asked to keep this movie on hold as his movie before this was an emotional film. Because of it, we have some gaps. Another movie of mine was also put on hold, and I was afraid that there would be a lot of gaps. Then I narrated this story to Vishwak, and he liked the story, and the film took off again.

- Just like you see in Rayalaseema and Telangana, there are murders and conflicts in Andhra as well. Showing Godavari in a picturesque way every time felt very cliche for me. We are not that; there is more to Godavari than just its nature. I wanted to be real. Through this movie, I got the opportunity to show a good story paired with good emotions. From production to the whole cast and crew, everyone supported my story. The entire story is fictional.

- I didn’t make any changes to the story of Gangs of Godavari after Vishwak came on board. The only apprehension I had was the accent. Vishwak speaks Telangana and our story was set in Andhra backdrop. So I told him to focus a little more extra on the dialect. We hired a tutor. He learned for 15 days, and within a month, Vishwak did a good job.

- My cinema got a U/A certificate. The film has three audio peaks. We used them during the trailer because there is no censor for the trailer. I wanted people to understand the intent of the movie. We started shooting for this movie on May 8, 2023, and finished by May 8, 2024. We wanted to shoot for 95 days, but we shot for 103 days.

- I watched the film and when I was watching it I found it very good and felt really happy about the output. I had tears in my eyes. Gangs of Godavari unfolds the saying “You are your own enemy.” I made this film within the limits of the liberty I got. Personally, this story is very close to me. Everyone can do action, but emotions can be shown only if you feel it. In this film, the last 20 minutes will be an emotional rollercoaster. It will hit people hard and I am very confident about it. This movie will be very emotional.

- All the actors did their best in their roles. This movie has so many gangs in it, but this is not a gangster story, and I request that people not consider it a gangster film. There are no gangsters in this movie. Yuvan Shankar Raja gave amazing music. I enjoyed his music a lot.

- I want to make a sequel for this movie; however, nothing has been finalised yet. If this movie turns out to be a hit, then I will write the sequel story in a month and make the film.

- Working with Sithara Entertainment has been a pleasure for me. It was a fantastic experience. Words fall short to describe how good they are.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది : చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడిగా ప్లానింగ్ లో ఉన్న చిత్రాలు ఆలస్యం అవటం, మరీ గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయం నాలో మొదలైంది. అదే విషయాన్ని త్రివిక్రమ్ గారితో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ కి కథ చెప్పాను. విశ్వక్ కి కథ నచ్చడంతో అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది?
గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ కథ. అయితే ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.

విశ్వక్ సేన్ కోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?
విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.

ట్రైలర్ లో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. దీనిపై మీ అభిప్రాయం?
మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.

షూటింగ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు?
గతేడాది మే 8 మొదలై, ఈ ఏడాది మే 8 తో సినిమా పూర్తయింది. సినిమా పూర్తవ్వడానికి సరిగ్గా ఏడాది పట్టింది. ఇందులో షూటింగ్ చేసినవి 103 రోజులు.

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?
యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

దర్శకుడిగా సినిమా చూసి సంతృప్తి చెందారా?
ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..?
మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను.

సితార బ్యానర్ గురించి?
చినబాబు గారు, నాగవంశీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలస్యమైనా పరవాలేదు.. ప్రేక్షకులకు మంచి సినిమాని అందించాలని భావించే నిర్మాతలు వారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తారు.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎవరితో చేయాలని ఉంది?
నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఎప్పటి నుంచో అభిమానం. ఆ అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఆయనతో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved