pizza

We’ve Plans Of Making Sequel For Gangster Gangaraju: Laksh
మా "గ్యాంగ్ స్టర్ గంగరాజు" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది..హీరో లక్ష్

You are at idlebrain.com > news today >
Follow Us

23 June 2022
Hyderabad

Young and promising hero Laksh who has been doing wide variety of movies is coming up with a pucca commercial entertainer Gangster Gangaraju helmed by Eeshaan Suryaah. The film is produced prestigiously by 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalavada Brothers'. Vedika Dutt is the lead actress in the movie due for release tomorrow. Meanwhile, Laksh interacted with media today.

Laksh revealed that Eeshaan Suryaah who was a protégé of Sreenu Vaitla and AR Murugadoss approached him with a good story, when he was busy as producer four years ago. “I told him that let’s do it later, as I was busy as producer back then,” said he.

The actor stated the success of the content-based movies Pelli Choopulu, Arjun Reddy, Kshanam etc. which were released after Bichagadu, inspired him to create an identity for himself as an actor. “I lost nearly 25 kgs and prepared myself completely for acting debut. Then, I made my debut with a content-rich movie Valayam which was well-received by the audience.”

Laksh informs he planned to do two movies, after Valayam. “But there was two years gap because of covid. When I thought of making a full-length mass and commercial entertainer, after covid, Suryaah came to my mind. I narrated him the basic plotline of “Gangster Gangarju” and told him to develop it. He made sure the movie will have elements for masses and families.”

About the film, his character and the backdrop, Laksh says, “The film’s story is set in a fictional town named Devara Lanka. While the hero’s character will be like that of Sreenu Vaitla’s, the villain’s character will be like the antagonist in Rajamouli movies.”

He’s all praises for music director Sai Kartheek who scored music for many blockbuster movies including Pataas, Supreme, Raja The Great etc. “More than the songs, the background score will be more enchanting. There will be many whistleblowing episodes in last 20 minutes.”

Laksh says he wants to do movies of different genres. He informs his next “Dheera” is going to be very different from “Gangster Gangaraju”. “It’s a raw and massy movie in city backdrop. It’s a road trip movie where I will be seen as a prisoner.”

He opines “Gangster Gangaraju” is the only film among the movies releasing this week that will connect more to audience with adequate mass elements. “Since the other movies are of different genre, I consider we don’t have any competition. I wish all the other movies releasing tomorrow will become successful. We are releasing the movie in 300 theaters in Telugu and 100 theatres in Tamil.”

Laksh concluded saying, “We’ll mull over making sequel for the movie, based on the response from the audience.”

మా "గ్యాంగ్ స్టర్ గంగరాజు" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది..హీరో లక్ష్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్.'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండ గా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర హీరో లక్ష్ చదవలవాడ మాట్లాడుతూ..

నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రొడ్యూసర్ గా చేస్తున్న టైం లో శీను వైట్ల, మురుగదాస్ ల దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసిన ఇషాన్ సూర్య ఒక మంచి కథతో వచ్చి ఒక సినిమా చేద్దాం అన్నాడు. అయితే అప్పుడు నేను నిర్మాతగా ఉన్నందున తరువాత చూద్దాం అన్నాను.

బిచ్చగాడు రిలీజ్ అయిన తరువాత వచ్చిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, క్షణం సినిమాలను చూస్తుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. ఆ సినిమాల తర్వాత వాళ్ళు స్టార్ హీరో అయిపోయారు. అప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తే ప్రేక్షకులు అదరిస్తారనే నమ్మకం తో ఇండస్ట్రీ లో నిర్మాతగానే కాకుండా నటుడుగా నాకంటూ ఒక ఐడెంటిటీని క్రెయేట్ చేసుకోవాలని వర్క్ అవుట్స్ చేసి 25 కేజీలు తగ్గాను. ఆ తరువాత అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి మంచి కంటెంట్ ఉన్న "వలయం" సినిమా తో ఇండస్ట్రీకి రావడం జరిగింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నేను "వలయం" సినిమా చేసిన తర్వాత రెండు సినిమాలు చేద్దాం అనుకున్న టైంలో కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు నాలుగు సంవత్సరాల క్రితం కథ చెప్పిన సూర్య గుర్తుకు రావడంతో తనను పిలిచి నేనే "గ్యాంగ్ స్టర్ గంగరాజు" కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. తను ఈ కథను డెవలప్ చేసి ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా చాలా చక్కటి సినిమా తీయడం జరిగింది

"గ్యాంగ్ స్టర్ గంగరాజు"సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్.అందరూ గ్యాంగ్ స్టర్ అన్నాక చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు . బళ్ళు గాల్లోకి ఎగరడాలు, బాంబులు, చేజింగ్ లు , ఫైటింగ్ ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు . కానీ ఈ స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ టౌన్ లో జరుగుతుంది. అయితే ఎందుకు ఫిక్షనల్ టౌన్ లో గ్యాంగ్ స్టర్ అనే టర్మ్ వచ్చింది. అక్కడ గ్యాంగ్ స్టర్ స్టోరీ ఏంటి అనేదే ఈ కథ.ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్, ఏది ఓవర్ లోడ్ అవ్వకుండా అన్ని ఈక్వల్ గా ఉంటూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసెలా ఉంటుంది.

ఇందులో నా క్యారెక్టర్ చెప్పాలంటే ఒక ఫిక్షనల్ టౌన్ దేవర లంక అనే ప్లేస్ లో ఈ స్టోరీ జరుగుతుంది. అయితే ఎందుకు ఫిక్షనల్ టౌన్ తీసుకున్నాము అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో జరిగే స్టోరీ కాబట్టి ప్రేక్షకులకు కొత్తగా చూయించాలని కొత్త స్క్రీన్ ప్లే గా ఉండేటట్లు క్యారెక్టర్స్, గెటప్స్, బాగా రా..గా కనపడేలా ఈ సినిమా తీశాము. నా సినిమాల్లో చేసే నలుగురు విలన్స్ అందరు కూడా డిఫ్రెంట్ డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తారు. నాకంటే హైట్ లో ఉంటారు.

ఒక హీరో అనే వాడు తన కంటే పవర్ ఫుల్ ఉన్నవాళ్ళతో ఢీకొంటే బాగుంటుందని మైండ్ లో పెట్టుకొని ఒక రాజమౌళి గారి సినిమాలో విలన్ ,ఒక శ్రీను వైట్ల గారి సినిమాలో హీరో ఇద్దరు కలసి స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో ఈ "గ్యాంగ్ స్టర్ గంగరాజు" అలా ఉంటుంది.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్ ఇలా చాలా సినిమాలకు మ్యూజిక్ చేసి చాలా మంచి మ్యూజికల్ సక్సెసర్ అనిపించు కున్నాడు. మీరు విన్న ఈ సాంగ్స్ కంటే కూడా ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఉంటుంది..ఈ సినిమాలో సెకండాఫ్ చాలా బాగా వచ్చింది.ఈ సినిమాలో ఎమోషనల్ గా ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.అయితే లాస్ట్ 20 మినిట్స్ కు మాత్రం కచ్చితంగా విజిల్స్ వేసేలా సినిమా ఉంటుంది. ఆడియన్స్ థియేటర్ లో సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు చాలా శాటిస్ఫై అవుతారు

ఈ సినిమాకు మా నాన్న పేరు వేద్దామని నేను చాలాసార్లు మా నాన్నను అడిగినా తను ఒప్పుకోలేదు ఎందుకంటే.. మా నాన్నగారికి ఆయన పేరు బయట వేసుకోవడానికి ఇష్టపడరు . ఇంతకాలం నేను నిర్మాతగా చేశాను.ఒక నిర్మాత కష్టాలు ఏంటో తెలుసుకుని నువ్వు ఇక సుక్సెస్ ఫుల్ నిర్మాతవు అవ్వాలి అంటాడు.నా సినిమా ఈవెంట్ కి వచ్చినా తను ఒక గెస్ట్ గా వస్తాడు

నేను ఆల్ జోనర్స్ లలో నటించాలని ఉంది. ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని కాకుండా ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చేయాలనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి అది నెగిటివ్, హీరో, కామిక్స్,లవ్, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏదైనా కానీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను

ఈ సినిమా తర్వాత చేస్తున్న "ధీర" గ్యాంగ్ స్టర్ గంగరాజు కన్నా వెరీ డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంటుంది. ఈ సినిమా రా..గా మాసీగా ఉంటే ఆ సినిమా సిటీ బ్యాక్డ్రాప్లో ఒక ఖైదీ లాగా జరిగే స్టొరీ. వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో రోడ్ ట్రిప్ లో జరిగే స్టొరీ. ఇందులో యాక్షన్, కామెడీ, లవ్ అన్నీ ఈక్వల్ ప్రమోషన్ తో చాలా స్టైలిష్ గా యూత్ ఫుల్ సబ్జెక్టు గా వస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతిసారి కొత్త సబ్జెక్టుతో రావడము అనేది కుదరదు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ప్రేక్షకులకు చాలా కన్విన్సింగ్ గా తియ్యాలి.

ఈనెల 24 కు చాలా సినిమాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకోమని చాలా మంది చెప్పారు .అయితే మా సినిమాను 24 కు రిలీజ్ చేద్దాం అని అనౌన్స్ చేసినప్పుడు మాకు పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమే.. మాత్రమే ఉంది. ఆ తరువాత ఎనిమిది సినిమాలు ఒకటే డేట్ కు వస్తున్నాయి. ఇదంతా మన చేతుల్లో లేదు. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. ఇక నుండి ఏ వారం చూసినా ప్రతి వారం కూడా ఆరు, ఏడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. అందుకని మేము ఈ నెల 24 న వస్తున్నాము.

ఇప్పుడు వస్తున్న పది సినిమాల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది మా సినిమా ఒక్కటే అనుకుంటున్నాను. ఇక మిగిలిన సినిమాలు ఉన్నా అవి డిఫరెంట్ జోనర్స్ కాబట్టి మాకు కాంపిటీషన్ లేదు అను కుంటున్నాను.నేను ఒక యాక్టర్ నే కాకుండా నాకు ప్రొడ్యూసర్స్ కష్టాలు కూడా తెలుసు కాబట్టి మా సినిమాతో పాటు రేపు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు కూడా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. మా సినిమాను తెలుగులో మూడు వందల థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము,తమిళ్ లో 100 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము.ఈ సినిమా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది అని ముగించారు

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved