TG Vishwa Prasad, Krithi Prasad’s People Media Factory’s #PMF48 with Heroine Anandhi and Director Gowri Naidu Jammu is titled Garividi Lakshmi, Launched Grandly
టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #PMF48, ఆనంది హీరోయిన్ గా గౌరీ నాయుడు జమ్మూ దర్శకత్వంలో 'గరివిడి లక్ష్మి' టైటిల్ తో సినిమా గ్రాండ్ గా లాంచ్
Heroine Anandhi, known for her powerful performances and ability to bring depth to her characters, is set to deliver another impactful portrayal in a new and inspiring film produced by TG Vishwa Prasad and TG Krithi Prasad under the banner of People Media Factory. The grand opening event of the 48th project of PMF titled Garividi Lakshmi was celebrated on an unprecedented scale in Adoni, Andhra Pradesh.
The event drew a massive crowd and set a new benchmark in film promotions by celebrating the movie even before the shooting began. This bold initiative, praised by veteran actor Naresh and MLA Pardhasaradhi, highlights the makers’ confidence in the project. The film portrays the inspiring story of the iconic Burra Katha artist Garividi Lakshmi from North Andhra and tackles the theme of women’s identity theft.
The pooja ceremony was a grand affair, with the first clap given by MLA Pardhasaradhi and the camera switch-on done by MLC Madhu and Mallappa Nayakar. People Media Factory’s immense confidence in the script was evident in the grandeur of the event, reflecting their belief in the film’s success. The shooting is scheduled to commence in the third week of January in Adoni.
TG Krithi Prasad, the daughter of renowned producer TG Vishwa Prasad, is making her debut as a producer with Garividi Lakshmi. While J. Aditya cranks the camera, Charan Arjun is the music director.
Technical Crew:
Producers: T.G. Vishwa Prasad, T.G. Krithi Prasad
Banner: People Media Factory
Director: Gowri Naidu Jammu
Co-Producer: Vivek Kuchibotla
Cinematographer (DOP): J. Aditya
Music Director: Charan Arjun
Chief Coordinator: Megha Shyam Pathada
Chief Executive Producer: Sujith Kumar Chowdary Kolli
Executive Producers: Vijay Reddy, Durga Prasad G, Sukumar
PRO: Vamsi-Sekhar
Marketing: First Show, People Media Factory
Marketing Head (PMF): Tirumalasetty Venkatesh
టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ #PMF48, ఆనంది హీరోయిన్ గా గౌరీ నాయుడు జమ్మూ దర్శకత్వంలో 'గరివిడి లక్ష్మి' టైటిల్ తో సినిమా గ్రాండ్ గా లాంచ్
పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రలకు డెప్త్ ని తెచ్చే హీరోయిన్ ఆనంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించే కొత్త, స్ఫూర్తిదాయకమైన చిత్రంలో మరొక ఇంపాక్ట్ ఫుల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా వున్నారు. 'గరివిడి లక్ష్మి' టైటిల్ తో రూపొందనున్న #PMF48 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్ భారీ సంఖ్యలో ప్రేక్షకులను అలరించింది. షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సరికొత్త చొరవను వెటరన్ యాక్టర్ నరేష్, ఎమ్మెల్యే పార్ధసారధి ప్రశంసించారు, ఇది ప్రాజెక్ట్‌పై నిర్మాతల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తుంది.
ఎమ్మెల్యే పార్ధసారధి ఫస్ట్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ కెమెరా స్విచాన్ చేయడంతో పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్క్రిప్ట్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో స్పష్టంగా కనిపించింది, ఇది సినిమా విజయంపై వారి నమ్మకాన్ని చూపింది. జనవరి మూడో వారంలో ఆదోనిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కుమార్తె టిజి కృతి ప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. జె.ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.