pizza
Gautamiputra Satakarni Begins Rajasuya Yagam
గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` రాజ‌సూయ యాగం మొద‌లైంది
You are at idlebrain.com > news today >
Follow Us

7 September 2016
Hyderaba
d

Natasimha Nandamuri Balakrishna’s prestigious 100th film Gautamiputra Satakarni is directed by National Award winning Jagarlamuldi Krish and produced by Y Rajeev Reddy, Jagarlamudi Saibabu on First Frame Entertainments banner. The present schedule is under commencement in Madhya Pradesh. Balakrishna, Hema Malini and Shriya Saran are participating in this key schedule where crucial scenes are planned for the shoot.

On September 6th, director Krish began to film the imperial sacrifice Rajasuya Yagam. Historical evidences and Puranic references mention the existence of only two great kings Dharma Raju and Satavahana Emperor Gautamiputra Satakarni to have performed this epic ritual. Currently, Krish and Balakrishna are recreating those spectacular ancient moments with shooting underway in Madhya Pradesh.

These moments also coincide with prominence of a bygone era when King Satakarni prefixed his mother Gautami’s name to change and declare his name as Gautamiputra Satakarni. On the same day, it was announced as beginning of new era and we formally began to organize the celebration of Ugadi festival every year, since then.

Coincidentally, Balakrishna is well organizing the activities as Chairman of Indo American Cancer Hospital named after his mother Basavatarakam making Telugu people all over the world feel proud.

A rare fortuity, September 6th and Swathi Nakshatram happen to be the birth day of Mokshagna and birth star of Legendary NTR respectively.

It is a divine initiative and blessing from senior NTR to start the filming of Rajasuya Sacrifice on this same reverential day.

Gautamiputra Satakarni is an interesting project narrating the untold story of a greatest Telugu warrior emperor which entire world should know about. The technical extravaganza is sure to go beyond our expectations in exquisite hands of director Krish with high budget bankrolled by Rajeev Reddy and Jagarlamudi Krish. This fourth schedule began on August 29 in Madhya Pradesh will continue till September 20.

Casting: Balakrishna, Hema Malini, Shriya Saran
Presenter: Bibo Srinivas
Cinematographer: Gnanashekhar
Art: Bhupesh Bhupathi
Lyrics: Sirivennela Sitarama Shastri
Dialogues: Saimadhav Burra
Fights: Ram Lakshman
Co producer: Kommineni Venkateswara Rao
Producers: Y Rajiv Reddy, Jagarlamudi Saibabu
Director: Krish

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` రాజ‌సూయ యాగం మొద‌లైంది

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ట్రీజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రేయాశ‌ర‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 6న రాజ‌సూయ‌యాగం చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. అఖండ భార‌తాన్ని ఏక‌తాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వ‌హించారు. ఈ రాజ‌సూయ యాగ స‌మ‌యంలోనే శాత‌కర్ణి త‌న త‌ల్లి గౌత‌మి పేరును త‌న పేరు ముందు ఉంచుకుని త‌న పేరుని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్ర‌కటించారు. అప్ప‌టి నుండి అదే రోజున ఉగాది పండుగ‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. యాదృచ్చికంగా బాల‌కృష్ణ కూడా త‌న త‌ల్లి పేరుతో ఉన్న బ‌స‌వ‌తారం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిటల్‌కు ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తూ, ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగువారు గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నారు. అలాగే రాజసూయం షూటింగ్ ప్రారంభమైన నిన్న (సెప్టెంబ‌ర్‌6న‌) బాల‌కృష్ణ తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు పుట్టిన న‌క్ష‌త్రం స్వాతి న‌క్ష‌త్రం కావ‌డం, అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం. ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో కూడిన రోజునే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో రాజ‌సూయ యాగం చిత్రీక‌ర‌ణ ప్రార‌భమ‌వ‌డం దైవ సంక‌ల్ప‌మే కాక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు అని చెప్ప‌వ‌చ్చు.

తెలుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రారాజు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఆయ‌న గురించి నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా తీస్తున్నాడ‌న‌గానే అందరిలో ఆస‌క్తి పెరిగింది. అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా సినిమాను ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. ఆగ‌స్ట్ 29న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్ సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు జ‌రుగుతుంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved